newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

అమలాపురం సీటుపై కర్ఛీఫ్ ఎవరిది?

12-03-201912-03-2019 12:16:48 IST
Updated On 12-03-2019 12:14:42 ISTUpdated On 12-03-20192019-03-12T06:46:48.911Z12-03-2019 2019-03-12T06:33:25.954Z - 2019-03-12T06:44:42.247Z - 12-03-2019

అమలాపురం సీటుపై కర్ఛీఫ్ ఎవరిది?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమలాపురం లోక్ సభ సీటు నుంచి ఎవరిని దింపాలన్న అంశం మీద సీఎం చంద్రబాబు క్లారిటీకి రాలేక పోతున్నారని అర్థం అవుతోంది. సిట్టింగ్ ఎంపీ పండుల రవీంద్రబాబు వైసీపీలోకి వెళ్లడంతో... కొత్త వారిని దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్నటి దాకా లోక్ సభ మాజీ స్పీకర్ గంటి మోహన చంద్ర బాలయోగి కుమారుడు హరీష్‌ను ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపాలని చంద్రబాబు భావించారట. అయితే హరీష్ కుర్రోడనీ... కోనసీమ రాజకీయాల్లో అంతగా అనుభవం లేదనేది ఇప్పుడు చంద్రబాబుకు వచ్చిన అనుమానం. 

అందుకే ఆయన పేరు పరిశీలనలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ రవీంద్రబాబు వైసీపీలో చేరడం, మాజీ ఎంపీ హర్షకుమార్ జనసేన వైపు చూస్తుండటంతో... వీరిద్దరికీ బలంగా పోటీ ఇచ్చే వ్యక్తి కావాలన్నది చంద్రబాబు అభిప్రాయంగా తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం అమలాపురం అభ్యర్ధి పేరును ప్రకటించారు. డీఎంఆర్ శేఖర్ అమలాపురం బరిలో ఉంటారని పవన్ వెల్లడించారు.

రాజమండ్రి సీటు కూడా ఖరారు చేశారు. రాజమండ్రి లోక్ సభ అభ్యర్ధిగా డా.ఆకుల సత్యనారాయణను ఎంపికచేశారు. ఈయన గతంలో టీడీపీ మద్దతుతో బీజేపీ ఎంఎల్ఏగా గెలిచారు. ఈమధ్యే బీజేపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. ఎలాగూ వైసీపీ ఎంపీగా అమలాపురం బరిలో సిట్టింగ్ ఎంపీ పండుల రవీంద్రబాబు ఉండబోతున్నారు. మొత్తం మీద అమలాపురం సీటు తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో హాట్ హాట్‌గా సాగుతోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle