newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

అమరావతి రైతుల కాళ్ళు మొక్కి క్షమాపణలు చెప్పిన పోలీసులు!

04-01-202004-01-2020 14:05:50 IST
2020-01-04T08:35:50.398Z04-01-2020 2020-01-04T08:35:47.616Z - - 22-01-2020

అమరావతి రైతుల కాళ్ళు మొక్కి క్షమాపణలు చెప్పిన పోలీసులు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఔను.. మీరు చదివింది నిజమే. పోలీసులు అమరావతి రైతుల కాళ్ళు మొక్కి క్షమాపణలు చెప్పారు. వాళ్ళు చేసింది.. చేస్తుంది తప్పేనని కానీ.. తప్పడం లేదు.. ఇలా రైతులను హింసిస్తున్నందుకు.. రైతుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నందుకు క్షమించాలని ఓ పోలీస్ అధికారి రైతుల కాళ్ళు మొక్కి క్షమాపణలు చెప్పారు. ఇంతకీ అసలు ఏంటి ఈ పరిస్థితి అంటే కొంచెం వివరంగా చెప్పుకోవాల్సిందే.

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదకి తెచ్చిన అనంతరం రాజధాని ప్రాంతంలో పరిస్థితిలు భగ్గుమంటున్నాయి. 33 వేల ఎకరాలను రాజధాని కోసం త్యజించిన రైతులు ఇప్పుడు కడుపు మండి ఆందోళనకు దిగారు. కుటుంబాలతో కలిసి పిల్లా.. పాప అన్ని పనులను మానుకొని దీక్షలు, ధర్నాలకు దిగారు. చివరికి ఇది ఆ ప్రాంతంలో సకల జనుల సమ్మె వరకు దారితీసింది.

రైతుల ఆందోళనను అణచివేసేందుకు ప్రభుత్వం అక్కడ భారీగా పోలీస్ బలగాలను దించింది. అయితే పోలీస్ బారికేడ్లను కూడా లెక్కచేయకుండా ఆందోళన కారులు నేతలు కనిపిస్తే అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే రైతులపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఈ తరహా దృశ్యాలు ఏదొక చోట జరుగుతూనే ఉన్నాయి.

అసలే కడుపు మంటతో ఉన్న రైతులకు అక్కడ పోలీసులంటే అసహ్యించుకునే పరిస్థితికి వచ్చేసింది. దీంతో పోలీసులను చూస్తేనే చీదరించుకుంటున్నారు. వాళ్ళ వాహనాలకు కనీసం ప్రజల సొంత స్థలాలలో నిలుపుకునేందుకు కానీ.. పోలీసులకు కనీస అవసరాలకు కూడా ఎవరు వాళ్ళ వైపు చూడడం లేదు. దుకాణాల వద్ద కూడా పోలీస్ మంచినీళ్లు అడిగినా లేవు అని మొహం మీద చెప్పేస్తున్నారు.

ఇలాంటి సమయంలోనే తాజాగా పోలీసులకు దుకాణం వద్ద గొడవ జరిగింది. గ్రామస్థులు ఎదురుతిరగడంతో పోలీసులు అక్కడ గుమికూడిన రైతుల కాళ్ళు మొక్కి క్షమాపణలు చెప్పారు. దయచేసి మాకు సహకరించండని వేడుకున్నారు. అందుకు అమరావతి రైతులు కూడా పోలీసుల కాళ్ళు మొక్కి మీకు దణ్ణం పెడతాం ఈ ప్రాంతం నుండి వెళ్లిపోండి.. మా కడుపుమంటను మీరు కూడా అర్ధం చేసుకోవాలని వేడుకున్నారు.

ఆందోళన చేస్తున్న రైతులకు వ్యతిరేకంగా మాకు డ్యూటీల వేయవద్దని అధికారులకు చెప్పుకోండి.. మా ఆవేదన.. మా భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతుంటే.. మీరు వాళ్ళకి సహకరించడం పద్ధతి కాదు .. మేము కావాలంటే మీ బూట్లు తాకి క్షమాపణలు చెప్తాము అంటూ రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులకు అద్దం పట్టే ఈ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూ ఆందోళనకు గురిచేస్తుంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle