newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

అమరావతి రైతులకు సినీ పరిశ్రమ మద్దతు ఏదీ?

05-01-202005-01-2020 11:19:42 IST
Updated On 09-01-2020 12:12:16 ISTUpdated On 09-01-20202020-01-05T05:49:42.631Z05-01-2020 2020-01-05T05:49:39.643Z - 2020-01-09T06:42:16.527Z - 09-01-2020

అమరావతి రైతులకు సినీ పరిశ్రమ మద్దతు ఏదీ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతి రాజధానిలో నిన్న మహిళలపై పోలీసుల దాడికి నిరసనగా‌ మందడంలో  రైతుల సంఘీభావంగా ధర్నాలో పాల్గొన్నారు ఎపిసిసి ఉపాధ్యక్షురాలు సుంకర‌ పద్మశ్రీ . ఈసందర్భంగా ఆమె సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దంటూ రైతులు,‌మహిళలు ఆందోళన చేస్తుంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమ నోరు మెదపకపోవడంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. వైజాగ్ లో స్టూడియోల నిర్మాణానికే జగన్ తో చిత్ర పరిశ్రమ లాలూచీ పడిందన్నారు. 

తమిళనాడు జల్లికట్టు ఉద్యమానికి తమిళ సినీ పరిశ్రమ ఎంతగా సహకరించిందో అందరికీ తెలుసన్నారు. రాజకీయపార్టీలన్నీ అమరావతి రాజధాని ఆందోళనకు తెలుపుతుంటే... తెలుగు సినీ పరిశ్రమకు పట్టడంలేదన్నారు. అసలు సినీ పరిశ్రమకు దిగిరావాలంటే 13 జిల్లాల ప్రజలంతా ‌సినిమాలు చూడడం మానేయాలన్నారు. రైతులన్నా, మహిళలంటే చిత్ర పరిశ్రమకు గౌరవం లేదని, మనం సినిమాలు చూస్తుంటే వారికి డబ్బులొస్తున్నాయి కాబట్టి సంతోషంగా ఉంటున్నారన్నారు. 

సినిమాలను నెలరోజుల పాటు చిత్రపరిశ్రమను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమ తరలివచ్చేలా సోషల్‌మీడియాలో ప్రతిఒక్కరూ చిత్రపరిశ్రమపై ఒత్తిడి తేవాలన్నారు. మహీళలపై  పోలీసుల దాడి అమానుషం అని ఆమె ఖండించారు. నైతిక బాధ్యతగా రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు,‌ఎంపి లు రాజీనామాలు చేసి పోరాటం లో పాల్గొనాలని ఆమె పిలుపు2నిచ్చారు. రాజధానిని అమరావతినుంచి తరలించవద్దన్నారు. 

 

ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

   4 minutes ago


ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు..  ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు.. ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

   9 minutes ago


ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

   16 minutes ago


జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

   2 hours ago


తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

   2 hours ago


ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

   2 hours ago


విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

   2 hours ago


 జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

   3 hours ago


  పైలెట్ ని క్షమించేద్దాం.. అశోక్ గెహ్లాట్

పైలెట్ ని క్షమించేద్దాం.. అశోక్ గెహ్లాట్

   4 hours ago


సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

   15 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle