newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

అమరావతి రైతులకు పవన్ భరోసా

31-12-201931-12-2019 13:25:42 IST
Updated On 31-12-2019 15:12:28 ISTUpdated On 31-12-20192019-12-31T07:55:42.426Z31-12-2019 2019-12-31T07:55:38.691Z - 2019-12-31T09:42:28.403Z - 31-12-2019

అమరావతి రైతులకు పవన్ భరోసా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మూడురాజధానుల వివాదం నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ రాజధాని అమరావతి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఎర్రబాలెంలో ధర్నాలో పాల్గొన్నారు పవన్‌కల్యాణ్. ఈసందర్భంగా వందలాదిమంది రైతుల మధ్యలో కూర్చుని వారి ఆవేదనను శ్రద్ధగా ఆలకించారు పవన్. రాజధానికి ఇచ్చిన భూములు కాంక్రీట్ గా మారాయని, అక్కడ పంటలు పండే అవకాశమే లేదన్నారు.

ఆ భూములు వెనక్కిస్తామని అంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వమే మాట తప్పిందని ఆరోపించారు. ఒక నగరాన్ని రాత్రికి రాత్రి నిర్మించడం సాధ్యం కాదని, నగర నిర్మాణానికి కొన్ని దశాబ్దాల సమయం పడుతుందన్నారు.

తమ పిల్లల భవిష్యత్‌ను ఫణంగా పెట్టి రైతులు విలువైన భూములిచ్చారని.. వ్యక్తుల భరోసాతో రైతులు భూములివ్వలేదన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతోనే రైతులు భూములిచ్చారన్నారు. ప్రభుత్వమే మాట తప్పడం దారుణమన్నారు పవన్.

 రాజధాని కోసం ధర్నా చేస్తున్న వివిధ ప్రాంతాల రైతులను మంగళవారం పవన్ కలిశారు. వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. అమరావతిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కక్ష ఎందుకు పెంచుకున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అమరావతిలో అవకతవకలు జరిగితే దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. కొందరు వ్యక్తులపై ఉన్న కోపాన్ని.. ప్రజలందరిపై చూపించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు.

అప్పుడు అసెంబ్లీలో అమరావతిని ఆమోదించిన జగన్ ఇప్పుడు మాట తప్పడం అంటే ధర్మం తప్పడమేనన్నారు. రాష్ట్రంలో ప్రజలు వైసీపీకి 151 సీట్లిచ్చింది... అస్థిరత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కాదని వ్యాఖ్యానించారు. అమరావతికి వ్యతిరేకమని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ ఎందుకు చెప్పలేదని పవన్ ప్రశ్నించారు.

రైతులకు న్యాయం జరిగేవరకు జనసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు తన ప్రయత్నమంతా ఓట్ల గురించి కాదని.. మార్పు గురించేనని పవన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై వైసీపీ స్పష్టమైన ప్రకటన చేయాలని పవన్‌ డిమాండ్ చేశారు.ఒక బాధ్యతాయుతమయిన స్పీకర్ స్థానంలో వున్న వ్యక్తి అమరావతిని ఎడారి అనడం ఎంతమాత్రం సరికాదన్నారు.

ఆందోళనకారులను పెయిడ్‌ ఆర్టిస్టులనడంపై పవన్ మండిపడ్డారు. రైతుల ఆశయాలను కాపాడతామని పవన్‌ కల్యాణ్ అన్నారు. రైతులు కన్నీరు పెడితే పోరాటం చేస్తానని గతంలోనే చెప్పానని, రైతుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమయితే ఎంత దూరమయినా వెళతానన్నారు పవన్. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారుస్తామంటే ఎలా అని పవన్ ప్రశ్నించారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle