newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి భూ ఒప్పందాలపై సీఐడీ నివేదిక రెడీ..

14-10-201914-10-2019 18:04:03 IST
Updated On 15-10-2019 12:19:01 ISTUpdated On 15-10-20192019-10-14T12:34:03.680Z14-10-2019 2019-10-14T12:34:01.986Z - 2019-10-15T06:49:01.388Z - 15-10-2019

అమరావతి భూ ఒప్పందాలపై సీఐడీ నివేదిక రెడీ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిపినట్లు వచ్చిన ఆరోపణలపై తన దర్యాప్తును సీఐడీ దాదాపుగా పూర్తి చేసినట్లు తెలియవచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో అధికార పక్షానికి మేలు జరిగేటట్లుగా ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను పెద్ద ఎత్తున సాగించారని, రాజధాని ప్రాంతం ఎక్కడ ఉంటుందో టీడీపీ నేతలకు అసలు విషయాన్ని ముందుగా సమాచార మిచ్చి ఇతరులను మాత్రం రోజుకో ప్రకటన చేస్తూ తీవ్ర గందరగోళానికి గురిచేశారని, టీడీపీ నేతలు మాత్రం ముందస్తు సమాచారాన్ని తెలివిగా ఉపయోగించుకుని తక్కువ ధరలతో అమరావతిలో భూముల కొనుగోలు చేసి రాజధానిని ప్రకటించాక భారీ డబ్బు ను సంపాదించారని పదే పదే ఆరోపించిన విషయం తెలిసిందే.

ఏపీ రాజధానికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని నాటి టీడీపీ మంత్రులు నారాయణ, ఘంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీలు గల్లా జయదేవ్, మురళీ మోహన్, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎమ్మల్యేలు ధూళిపాళ నరేంద్రకుమార్ తదితర నేతలెందరికో నాటి ప్రభుత్వం లీకుల రూపంలో అందించిందిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లోనే ఆరోపించింది. 

ఇలా ముందస్తు సమాచారం లభించడంతో, ఈ నేతలందరూ అమరావతి ప్రాంత రైతులనుంచి చౌకధరలతో భారీ మొత్తంలో భూములను కొనేశారని ఆరోపణలున్నాయి. తర్వాత ఇదే భూములను ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా ప్రభుత్వానికి అప్పగించి వీరందరూ భారీ ప్రయోజనం పొందారని సమాచారం.

రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు వచ్చిన వార్తలపై వైకాపా ప్రభుత్వ ఆరోపణల ప్రాతిపదికన విచారణ సాగించిన సీఐడీ అధికారులు నేరుగా రైతులను కలిసి సమాచారం సేకరించారు. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందు జరిగిన భూ ఒప్పందాలకు సంబంధించి సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల నుంచి సమాచారాన్ని సీఐడీ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది.

మరి కొద్ది వారాల్లో సీఐడీ తన విచారణ నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు సమాచారం. ఇన్ సైడర్ ట్రేడింగులో భాగం పంచుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్న పిమ్మట రాజధాని నిర్మాణ కార్యక్రమాలను చేపట్టడానికి వైకాపా ప్రభుత్వం పథక రచన చేస్తోంది. 

ఈ ఇన్‌సైడర్ ట్రేడింగ్ ప్రధానంగా నేలపాడు, తుళ్లూరు, దోనపాడు, ఐనవోలు, శాఖమూరు, నీరుకొండ, కూరగల్లు, ఉండవల్లి, వెంకటపాలె గ్రామాల్లో చోటుచేసుకుందని సీఐడీ అధికారులు కనుగొన్నారు. ఇక్కడే టీడీపీ ప్రభుత్వం కీలకమైన ప్రభుత్వ భవనాల నిర్మాణానికి తదనంతర కాలంలో ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

 

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle