newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

అమరావతి భూములపై ధూళిపాళ్ళ హాట్ కామెంట్స్..

07-01-202007-01-2020 10:10:48 IST
Updated On 07-01-2020 12:18:01 ISTUpdated On 07-01-20202020-01-07T04:40:48.339Z07-01-2020 2020-01-07T04:40:46.056Z - 2020-01-07T06:48:01.286Z - 07-01-2020

అమరావతి భూములపై ధూళిపాళ్ళ హాట్ కామెంట్స్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొంద‌రు తాము అధికారాన్ని అనుభ‌వించ‌డానికి, ఇత‌రుల‌ను పాలించ‌డానికే పుట్టామ‌నుకుంటారు. అలాంటి వారు ఇత‌ర‌ల‌కే కాదు వారికి వారే ప్ర‌శాంత‌త‌ను దూరం చేసుకుంటుంటారు. మేం ఓడిపోవ‌డ‌మేంటి అంటూ త‌ర‌చూ వారికి వారే ఆశ్చ‌ర్య‌పోతుంటారు. సుదీర్ఘ‌కాలంపాటు ఎదురులేకుండా అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను ఆడిస్తూ ఆనందించిన వారు ఇలాంటి మాన‌సిక స్థితిని అనుభ‌విస్తుంటారు. తాము ఇత‌ర స‌మూహాల‌కు భిన్నం అన్న‌ట్టుగా వారి వైఖ‌రి ఉంటుంది.

కానీ, ఒక వ్య‌క్తి రూపంలోకానీ, ఒక వ్య‌వ‌స్థ రూపంలోకానీ ఊహించ‌ని, త‌ట్టుకుని నిల‌బడ‌లేని ఘ‌ర్ష‌ణ వ‌చ్చిన‌ప్పుడు హ‌ఠాత్తుగా సంఘ‌ర్ష‌ణ‌కు లోన‌వుతుంటారు. అప్ప‌టి వ‌ర‌కు స‌మాజానికి శాంతి సూక్తులు చెప్పిన వారు కూడా య‌థేచ్ఛ‌గా నోరు వాడేస్తుంటారు. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ అదే జ‌రుగుతోందా..? అని అనిపిస్తోంది. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు చంద్ర‌బాబు స్థానంలో మ‌రొక‌రు ముఖ్య‌మంత్రి అవుతారు అన్న అభిప్రాయాన్ని వినేందుకు కూడా టీడీపీ వారు ఇష్ట‌ప‌డేవారు కాదు. జ‌గ‌నా..?  సీఎమ్మా..? అంటూ సంతూర్ యాడ్ త‌ర‌హాలో స్పందించేవారు.

సీఎం జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత ఆయ‌న్ను సీఎంగా గుర్తించ‌బోమ‌ని, త‌మ సీఎం చంద్ర‌బాబేన‌ని జ‌నం అనుకుంటున్నార‌ని గ‌ల్లా అరుణ‌కుమార్ వంటి వారు కూడా మాట‌ల రూపంలో మొండికేశారు. తాము ఇష్ట‌ప‌డే టీవీ ఛానెళ్లు కూడా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అని సంబోధించిన‌ప్పుడు వారు మ‌రింత చీకాకుప‌డ్డారు. అప్ప‌టికీ ఏపీ సీఎం సీటు చంద్ర‌బాబు కోసం మాత్ర‌మే త‌యారు చేయ‌బ‌డింది క‌దా..! అన్న‌ది వారి వాద‌నా, భ్ర‌మ‌.

లోప‌ల ఎంత కోపం ఉన్నా మేథావులు, చంద్ర‌బాబు మీడియా ప్ర‌తినిథులు మాత్రం భావ వ్య‌క్తీక‌ర‌ణ‌ను నియంత్రించుకుంటూనే తెర‌పైన శాంతిమూర్తుల్లా ఇంత‌కాలం క‌నిపిస్తూ వ‌చ్చారు. కానీ, ఎప్పుడైతే అమ‌రావ‌తిపై సీఎం జ‌గ‌న్ దృష్టిసారిస్తూ వ‌చ్చారు. అప్ప‌టి నుంచి అస‌లు రూపాలు బ‌య‌ట‌కు రావ‌డం మొద‌లైంది. స‌ర్వ‌హంగుల రాజ‌ధానిగా అమ‌రావ‌తి లేకుంటే అది త‌మ‌కు అవ‌మానం అన్న‌ట్టుగా కొంద‌రు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల సంపద అమ‌రావ‌తిలో కుమ్మ‌రించుకోవ‌డం త‌మ హ‌క్కు అన్న‌ట్టు బ‌హిరంగంగానే వాద‌న‌కు దిగుతున్నారు.

అమ‌రావ‌తిలో ఏదో దాచుకోక‌పోతే వీరు ఇంత‌గా ఎందుకు గింజుకుంటార‌ని సామాన్యులు కూడా ఇప్పుడు అనుమానించేలా ఒక సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ అమ‌రావ‌తి విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకోక‌పోతే తాను ఉరేసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. మ‌రో సీమ మేథావి భ అక్ష‌రంతో మొద‌ల‌య్యే దుర్భాష‌ను ప్ర‌భుత్వ పెద్ద‌ల‌పైన లైవ్‌లోనే వాడేశారు. మ‌రో ప‌త్రికాధినేత అమ‌రావ‌తి కోసం సామూహికంగా చావండి అంటూ గ‌ట్టుమీద కూర్చొని అమాయ‌కుల్లో స్ఫూర్తి రగిల్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇలా ఇంకా రాలేదే అని అనుకుంటుండ‌గానే ప్ర‌త్య‌క్ష‌మైన న‌టుడు మేలుకో ఆంధ్రుడా అంటూ తెలంగాణ‌లో తాము కుక్క‌ల్లా బ‌తుకున్నామ‌ని సెల‌విచ్చారు. తెలంగాణ‌లో కుక్క‌ల్లా బ‌తికే ప‌రిస్థితే ఉంటే ఐదేళ్ల త‌రువాత కూడా అమ‌రావ‌తిలో ఆ న‌టుడు సొంతిళ్లు ఎందుకు క‌ట్టుకోలేదు..?  సొంత రాష్ట్రంలోకంటే ప‌క్క రాష్ట్రంలో కుక్క‌బ‌తుకే బ‌హుబాగుగా ఉంద‌నుకోవాల్నా..?

ఓటుకు నోటు త‌రువాత హైద‌రాబాద్‌ను వ‌దిలేసిన చంద్ర‌బాబు ఆ త‌రువాత కూడా హైద‌రాబాద్‌లోనే ప్యాలెస్ ఎందుకు క‌ట్టుకున్నారు..? అమ‌రావ‌తిలో క‌నీసం ఇంటి జాగాను కూడా చంద్ర‌బాబు ఎందుకు సిద్ధం చేసుకోలేదు. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు మాత్రం ఉండ‌వు.

చంద్రబాబు కూడా అధికారుల‌ను, ఐఏఎస్‌ల‌ను వాడూ.. వీడూ.. అనేస్తున్నారు. ధూలిపాళ్ల న‌రేంద్ర‌కు కూడా అమ‌రావ‌తిలో కొన్ని ఎక‌రాల భూమి ఉంద‌ని బ‌య‌ట‌కు రాగానే ఆయ‌న మ‌రింత వీరావేశంతో త‌న వెంట్రుక‌ను కూడా ఈ ప్ర‌భుత్వం పీక‌లేదు అంటూ, భూములు ఎవ‌రివి అన‌గానే భుజాలు త‌డిమేసుకునేలా ఆయ‌న స్పందించారు. త‌న వెంట్రుక‌లు మ‌ర్రి ఊడ‌ల్లా గ‌ట్టివ‌ని ఆయ‌న‌కు అనిపించ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. కాక‌పోతే ప్ర‌తి వెంట్రుక‌కు ఒక టైమ్ వ‌స్తుంది. ఆ టైమ్‌కు ఆ వెంట్రుక రాలిప‌డాల్సిందే. ఎన్ని లోష‌న్లు వాడినా కాలంచేసిన జుట్టు రాల‌క‌మాన‌దు. పండిన‌ప్పుడు ప‌రిస్థితి తిర‌గ‌బ‌డ‌కా మాన‌దు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle