newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆవిర్భావం

21-12-201921-12-2019 18:32:23 IST
Updated On 23-12-2019 12:26:16 ISTUpdated On 23-12-20192019-12-21T13:02:23.160Z21-12-2019 2019-12-21T13:02:20.871Z - 2019-12-23T06:56:16.002Z - 23-12-2019

అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆవిర్భావం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న జగన్ ప్రభుత్వ తీరుకి నిరసనగా ‘అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ’ ఏర్పాటైంది. వివిధ సంఘాల ప్రతినిధులతో జెఏసి ఏర్పాటు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదన, రాజధాని మార్పు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై జెఏసి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పురోగతికి కారణం అయ్యే సంఘాలే జెఏసి లో సభ్యులుగా  ఉన్నాయి. జీఎన్ రావు కమిటీ నివేదిక బయటకు రాకముందే ముఖ్యమంత్రి అసెంబ్లీ లో మూడు రాజధానుల ప్రకటన చేయడంపై మండిపడుతున్నారు.

గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తప్పుగా కనపడటం మంచిది కాదని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాల్సిందేనని జేఏసీ పేర్కొంది. ‌విధాన పరమైన నిర్ణయాలు తప్పుగా ఉంటే సరి చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కృష్ణా గుంటూరు జిల్లా వాసులు ఎవరూ స్వాగతించరన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జేఏసీ నేతలు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా చాలా దూరంగా విస్తరించి ఉందని, కర్నూలు  శ్రీకాకుళం మధ్య రాకపోకలు సాగించాలంటే చాలా కష్టమని జేఏసీ నేతలు అన్నారు. పరిపాలన సౌలభ్యం అంటే ఉద్యోగులను అధికారులను ఇబ్బంది పెట్టడమేనా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ ఇప్పుడు వైజాగ్.. ఇలా ఎన్ని ప్రాంతాలకు రాజధానులను తీసుకెళతారని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ మండిపడింది. 

మూడురాజధానులంటూ అన్నివర్గాలను అయోమయంలోకి నెట్టారని.. ప్రభుత్వం తమ ఆలోచనను సమీక్షించుకోవాలన్నారు క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి. రాజధాని అంశం జీవన్మరణ సమస్యగా తయారైందని ప్రజలు ఆందోళనలో ఉన్నారని ఆయన అన్నారు. రాజధానుల మార్పు విషయంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రజాద్రోహులుగా మారవద్దంటున్నారు జేఏసీ నేతలు.

మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల జీవితాలను బలి చేయవద్దంటోంది జేఏసీ. అంతా పార్టీలకతీతంగా మాట్లాడాలని, రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇస్తే.. వారిని హేళన చేయడం ఏంటని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలకు తొత్తులుగా మారవద్దని కోరింది. త్వరలో మూడు రాజధానుల అంశంపై  కార్యచరణ రూపొందించి ప్రజా పోరాటం వైపు నడవాలని జేఏసీ నిర్ణయించింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle