newssting
BITING NEWS :
*శబరిమలలో మండల-మకరవిళక్కు పూజలు ప్రారంభం.. ఏపీ మహిళల్ని వెనక్కి పంపిన కేరళ పోలీసులు *ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో దూసుకుపోతున్న భారత్.. 300 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమ్ ఇండియా*ఆర్టీసీ జేఏసీ డిమాండ్లను పరిష్కరించలేమని ఆర్టీసీ యాజమాన్యం ...హైకోర్ట్ కు అఫిడవిట్ *రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఇచ్ఛాపురం పర్యటన రద్దు *సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు *మధ్యాహ్నం 2గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ..శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *ఎంఎంటిఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ మృతి... కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్*శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో భారీగా పోలింగ్‌..ఓటు హక్కు వినియోగించుకున్న 80 శాతం మంది ఓటర్లు

అమరావతి నుంచి రాజధాని మారుతుందా?వాస్తవమెంత?

21-08-201921-08-2019 18:03:51 IST
Updated On 22-08-2019 15:43:08 ISTUpdated On 22-08-20192019-08-21T12:33:51.230Z21-08-2019 2019-08-21T11:31:38.718Z - 2019-08-22T10:13:08.310Z - 22-08-2019

అమరావతి నుంచి రాజధాని మారుతుందా?వాస్తవమెంత?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజధాని అమరావతి ఇప్సుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజధానిపై మరింత గందరగోళానికి కారణమయ్యాయి. రాజధాని అమరావతిపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు. 2014లో చంద్రబాబునాయుడు అధికారంలో వచ్చిన తర్వాత రాజధాని కోసం అమరావతిని ఎంపిక చేశారు.

దీంతో ఈ ప్రాంతంలో భూములను కొనుగోలు చేశారు. ఎన్ఆర్‌లు కూడ ఇక్కడ భూములను కొన్నారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం ప్రారంభం కావడంతో రియల్ వ్యాపారం కూడ జోరందుకొంది. గతంలో ఎకరం భూమి ధర సుమారు. రూ. 2 కోట్లు కూడ ఈ ప్రాంతంలో పలికింది. ప్రస్తుతం ఎకరం ధర రూ. 45లక్షలకు పడిపోయినట్టుగా రియల్టర్లు చెబుతున్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై మంత్రి బొత్స దారుణంగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. రాజధానిని తరలించేందుకు వైసీపీ కుట్రపన్నుతోందని ఆరోపించారు. రాజధాని తరలిపోకుండా తాను ఎంతవరకైనా పోరాడుతానని చంద్రబాబు సవాల్ చేశారు. మరోవైపు టీడీపీ నేత వేదవ్యాస్ అమరావతి విషయంలో జగన్ దుర్మార్గంగా, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

ముంపు ప్రాంతంగా అమరావతికి ముద్రవేసి రాజధానిని వేరే చోటకు షిఫ్ట్ చేయాలన్నదే ప్రభుత్వ నిర్ణయమన్నారు. వరదలను భూతద్దంలో చూపించి రాజధాని నిర్మాణం ఆపాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు.వరద ప్రభావానికి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఉన్న ప్రాంతాలేవీ మునగలేదని చెప్పుకొచ్చారు. అయితే సీఎం వైయస్ జగన్ మనుషులు భూములు కొన్నందున‌‌ రాజధానిని ప్రకాశం జిల్లా దొనకొండకి మార్చాలనుకుంటున్నారని ఆరోపించారు.

అమరావతిలో రాజధాని ఉండటం జగన్‌కు ఇష్టం లేదన్నారు. ఫ్లడ్ మేనేజ్‌మెంట్ తెలియనివాళ్లు మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. ప్రకాశం బ్యారేజీలో నీటిని నిల్వ చేసి అమరావతిని ముంచే కుట్ర పన్నారని ఆరోపించారు. రాజధానిగా అమరావతి పనికిరాదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రులు ప్రజల సమస్యలను గాలికొదిలేసి.. చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్నారని వేదవ్యాస్ ఫైర్ అయ్యారు.

యమునకు వరద వస్తే ఢిల్లీని తరలిస్తారా అని వేదవ్యాస్ అన్నారు. ఒకవేళ చెన్పై మునిగితే అక్కడ కూడా రాజధానిని మార్చేస్తారా అన్నారు. రాజధాని విషయంలో కుట్ర, తప్పుడు ప్రచారం ప్రజలను అయోమయానికి గురిచేస్తోందన్నారు. రాజధాని నిర్మాణాన్ని ఆపి ఇప్పుడు దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటూ వేదవ్యాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని ప్రాంతంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని.. త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తామని వెల్లడించడంతో రాజధాని ప్రాంతంలో అలజడి కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే ఏపీ రాజధాని మార్పుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదని స్పష్టం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. ఈ అంశం కేంద్రం పరిధిలోకి రాదని తెలిపారు. కాంగ్రెస్ నేత చింతామోహన్ రాజధాని అమరావతి నుంచి దొనకొండకు మారనుందని.. దీనిపై కేంద్రంలోని పెద్దల నుంచి తనకు సమాచారముందని చెప్పారు. ఏపీ రాజధానిగా తిరుపతిని ప్రకటించాలని మాజీ ఎంపీ చింతా మోహన్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సూచించారు.  దొనకొండ విషయంలో తొందరపడొద్దని సీఎం జగన్‌కు ఆయన సూచించారు.

అసలేం జరగబోతోంది?

అమరావతి, దొనకొండ, తిరుపతి .. ఇన్ని గందరగోళాల మధ్య ఏపీ ప్రజలు రాజధాని గురించి ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి రాజధాని మార్పు జరగే అవకాశమే లేదని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇప్పుడున్న 29 గ్రామాలకు బదులుగా ఐదు గ్రామాలను రాజధాని కోసం ఉంచి, మిగిలిన వాటిని రైతులకు తిరిగి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కోర్ క్యాపిటల్ 2250 ఎకరాల వరకూ ఉండవచ్చని అంటున్నారు.

రాజధాని అంటే ఒకేసారి వందల ఎకరాలు అవసరంలేదని, క్రమేపీ నగరం పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు ఉదాహరణగా ఢిల్లీ, ముంబైని ఉదహరిస్తున్నారు. రాజధాని ఏర్పడ్డాక అది విస్తరిస్తుంది. దేశంలో జరిగింది అదే. అమరావతి విషయంలోనూ అదే జరుగుతుందని అంటున్నారు. రాజధాని విషయంలో గందరగోళం అవసరం లేదంటున్నారు. అమరావతి మారబోదని ఘంటాసథంగా చెబుతున్నారు. 

జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ సక్సెస్‌..!  కమ్మ వర్సెస్‌ కమ్మ!!

జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ సక్సెస్‌..! కమ్మ వర్సెస్‌ కమ్మ!!

   37 minutes ago


అధికారుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..!

అధికారుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..!

   2 hours ago


ఆ 70 కోట్ల కోసమే బీజేపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతారా..?

ఆ 70 కోట్ల కోసమే బీజేపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతారా..?

   6 hours ago


దీక్ష భగ్నం.. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

దీక్ష భగ్నం.. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   9 hours ago


కేంద్రానికి చేరిన టీటీడీలో అన్యమతస్తుల వ్యవహారం

కేంద్రానికి చేరిన టీటీడీలో అన్యమతస్తుల వ్యవహారం

   11 hours ago


కాంగ్రెస్‌కు - ఎన్నిక‌ల‌కు సంబంధం ఉన్న‌ట్టా..?  లేన‌ట్టా..?

కాంగ్రెస్‌కు - ఎన్నిక‌ల‌కు సంబంధం ఉన్న‌ట్టా..? లేన‌ట్టా..?

   13 hours ago


పంచాయతీ ఎన్నికలు జరిపి తీరాల్సిందే.. హైకోర్టు

పంచాయతీ ఎన్నికలు జరిపి తీరాల్సిందే.. హైకోర్టు

   13 hours ago


జగ‌న్ ఓకే అంటే ఇద్ద‌రూ వ‌చ్చేస్తారట‌..!

జగ‌న్ ఓకే అంటే ఇద్ద‌రూ వ‌చ్చేస్తారట‌..!

   14 hours ago


తెలంగాణ ఆర్టీసీ చేతులెత్తేసిందా?

తెలంగాణ ఆర్టీసీ చేతులెత్తేసిందా?

   15 hours ago


నేనొప్పుకోను.. అవినీతి జరిగిద్ది! మంత్రులకు షాకిచ్చిన జగన్‌!!

నేనొప్పుకోను.. అవినీతి జరిగిద్ది! మంత్రులకు షాకిచ్చిన జగన్‌!!

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle