newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

అమరావతి జేఏసీ బస్సు యాత్రకు అడ్డంకులు.. హైటెన్షన్

09-01-202009-01-2020 09:20:26 IST
Updated On 09-01-2020 12:14:14 ISTUpdated On 09-01-20202020-01-09T03:50:26.005Z09-01-2020 2020-01-09T03:49:38.712Z - 2020-01-09T06:44:14.284Z - 09-01-2020

అమరావతి జేఏసీ బస్సు యాత్రకు అడ్డంకులు.. హైటెన్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతి పరిరక్షణకు బస్సుయాత్రలు చేయాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. అయితే జేఏసీ బస్సులను షెడ్డు వద్దే నిలిపివేశారు పోలీసులు. బస్సుయాత్రకు ఆర్టీఏతో పాటు పోలీసుశాఖ అనుమతి ఉండాలన్నారు పోలీసులు. మరోవైపు అమరావతిపై జేఏసీ తలపెట్టిన చైతన్య యాత్రలో పాల్గొననున్నారు  టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబునాయుడు.

ముందుగా జేఏసీ కార్యాలయంలో నేతలతో సమావేశం కానున్నారు చంద్రబాబు.  పోలీసులు అడ్డుకున్న ప్రదేశం నుంచే ప్రజా చైతన్య యాత్రను చేపట్టాలని నిర్ఱయించారు.

చంద్రబాబు నేతృత్వంలో బెంజ్ సర్కిల్ నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది.  మచిలీపట్నం కోనేరు సెంటర్‌లో మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారని జేఏసీ నేతలు తెలిపారు. ఇటు చంద్రబాబు యాత్రకు మద్దతుగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ అమరావతికి మద్దతుగా సభలు, ర్యాలీలు జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, ఒంగోలులోనూ చైతన్య సభలు నిర్వహించనున్నట్లు  అమరావతి పరిరక్షణ కమిటీ తెలిపింది.

మరోవైపు విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి జెఏసి కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం జెఏసి బస్సుయాత్ర ప్రారంభించడానికి బెంజ్ సర్కిల్ వద్దకు పాదయాత్ర చేస్తూ వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు, లోకేష్ ఇతర టీడీపీ నేతలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించింది. దీనిపై టీడీపీ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. చట్ట ప్రకారం పర్మిషన్ తీసుకున్నా, పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారని, దౌర్జన్యం, దమనకాండతో ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

దమ్ముంటే రాజధాని మార్పుపై రెఫరండం పెట్టాలి. లేదా ఇదే అజెండాగా ఎన్నికలకు వెళ్లాలి. ప్రజలు అంగీకరిస్తే... రాజధాని మార్చుకోండని సవాల్ చేశారు చంద్రబాబు. బస్సుయాత్రలో వున్న నేతలపై పోలీసులు ఆంక్షలు విధించారు. సుమారు రెండు గంటల ఉద్రిక్తత, ఉత్కంఠ అనంతరం వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి చోటు చేసుకున్న ఈ పరిణామాలతో విజయవాడలో హైటెన్షన్‌ నెలకొంది.

యాత్ర కోసం సిద్ధం చేసిన బస్సులను ఏపీఐఐసీ కాలనీ వద్ద సీజ్‌ చేశారు. దీంతో బెంజి సర్కిల్‌ నుంచి బస్సులు ఉన్న ప్రాంతానికి పాదయాత్రగా వెళ్లాలని చంద్రబాబు, ఇతర నేతలు నిర్ణయించుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులూ పెద్ద ఎత్తున మోహరించారు. రాత్రి 7.30 గంటల సమయంలో చంద్రబాబు పాదయాత్ర ప్రారంభిస్తుండగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సీపీఐ నేత రామకృష్ణ, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, టీడీపీ నేతలు దేవినేని ఉమ, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ జెడ్పీ చైర్మన్‌ గద్దె అనురాధ, జేఏసీ నేతలు వున్నారు. రెండుగంటల పాటు చంద్రబాబు రోడ్డుపైనే వున్నారు. మొత్తం మీద అమరావతి ఆందోళన మరోదశకు చేరుకుందని అంటున్నారు. 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   4 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle