newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

అమరావతి కోటలో పాగా ఎవరిది? -2

19-05-201919-05-2019 08:44:57 IST
Updated On 19-05-2019 08:58:03 ISTUpdated On 19-05-20192019-05-19T03:14:57.025Z19-05-2019 2019-05-19T03:14:46.963Z - 2019-05-19T03:28:03.896Z - 19-05-2019

అమరావతి కోటలో పాగా ఎవరిది? -2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
(మొదటి భాగం తరువాయి)

ఇక‌, ఎస్సీ రిజ‌ర్వుడ్  నియోజ‌క‌వ‌ర్గ‌మైన తాడికొండ‌లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్య‌ర్థి శ్ర‌వ‌ణ్ కుమార్  పై పార్టీ క్యాడ‌ర్ తో పాటు ప్ర‌జ‌ల్లో కొంత వ్య‌తిరేక‌త ఉంది. వైసీపీ అభ్య‌ర్థి ఉండ‌వ‌ల్లి శ్రీదేవి ఆయ‌న‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు. దీంతో ఇక్క‌డ కూడా ఎవ‌రు గెలిచినా స్వ‌ల్ప మెజారిటీనే వ‌చ్చే అవ‌కాశం ఉంది.

https://www.photojoiner.net/image/qrktEfBH

రాజ‌ధాని కోసం స్వ‌చ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు, భూముల ధ‌ర‌లు పెరిగిన వారు టీడీపీ ప‌ట్ల బాగా సానుకూలంగా ఉన్నారు. మిగ‌తా వారిలో టీడీపీ ప్ర‌భుత్వం ప‌ట్ల కొంత అనుకూల‌త ఉన్నా వ్య‌తిరేక‌త కూడా అదే స్థాయిలో ఉంది. అందుకే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్న ప్రాంతంలో ఏక‌ప‌క్షంగా ఉండాల్సిన ఫ‌లితాలు నువ్వానేనా అనే రీతిలో వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఇక‌, రాజ‌ధాని ప్రాంతానికి చుట్టుప‌క్క‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో సేమ్ సీన్ ఉంది. గుంటూరు జిల్లా పెద‌కూర‌పాడులో టీడీపీకి విజయావ‌కాశాలు ఉన్నా వైసీపీ కూడా గ‌ట్టి పోటీనే ఇచ్చింది. ఇక్క‌డ డ‌బ్బు ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌టంతో ఎవ‌రు గెలుస్తార‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి. గుంటూరు న‌గ‌రంలోని ఒక నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ వైపు మొగ్గు ఉండ‌గా మ‌రో నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి గెలుపు అవ‌కాశాలు ఉన్నాయి.

ఇక‌, విజ‌య‌వాడ న‌గ‌రంలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి అనుకూలంగా ప‌రిస్థితులు క‌నిపిస్తున్నా వైసీపీ గ‌ట్టి పోటీ ఇచ్చింది. క‌చ్చితంగా న‌గ‌రంలో ఒక సీటును ఆ పార్టీ గెలుచుకునే అవ‌కాశం ఉంది. మొత్తంగా రాజ‌ధానితో పాటు రాజ‌ధాని చుట్టుప‌క్క‌ల టీడీపీకి ఏక‌ప‌క్షంగా అయితే ఫ‌లితాలు ఉండ‌క‌పోవ‌చ్చు అంటున్నారు. వైసీపీ చొప్పుకోద‌గిన స్థాయిలో సీట్లు గెల‌వ‌వ‌చ్చు.

అమరావతి కోటలో పాగా ఎవరిది? -1

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle