newssting
BITING NEWS :
* సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య సుదీర్ఘ చర్చలు. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల రాత్రి 9 గంటల వరకు ఆరవ విడత చర్చలు. * మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు, మహిళలు అధికం. * బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకు సమాజ్‌వాదీ పార్టీ మద్ధతు. సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా సోమవారం రాత్రి ప్రకటన. * ముంబై నగరంతోపాటు పలు పరిసర నగరాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు. ముంబై, థానే, రాయగడ్, పూణే, సతార, సిందూర్గ్ ప్రాంతాల్లో మంగళవారం ఉరుముులు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంబై వాతావరణ శాఖ హెచ్చరికలు. రష్యా దేశంలో భారీ భూకంపం. రష్యాలోని ఇర్కుట్సు రీజియన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యన్ ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడి. భూకపంపంతో ప్రజలు భయాందోళనలు. విగత జీవిగా దొరికిన సరూర్ నగర్ తపోవన్‌కాలనీ వద్ద ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన నవీన్‌కుమార్‌. * కేంద్రంలో తెచ్చిన వ్యవసాయ బిల్లులతో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య సాగుతున్న విమర్శ, ప్రతి విమర్శలు. * కేంద్ర బిల్లులతో రైతులకు మేలని బీజేపీ వర్గాలు, కొత్తగా తెచ్చిన బిల్లులతో రైతులను తీవ్ర నష్టమని టీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు. 280వ రోజుకు చేరుకున్న రాజధాని అమరావతి రైతుల ఉద్యమం. కొనసాగుతున్న శిబిరాల్లో రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం. నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ జరిగే అవకాశం. బుధవారం తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సి ఉన్నా మంగళవారం ఆకస్మిక ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం గమనార్హం. రాష్ట్రంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ, షాలతో చర్చకు అవకాశం. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం.

అమరావతి కోటలో పాగా ఎవరిది? -1

19-05-201919-05-2019 08:42:17 IST
Updated On 19-05-2019 08:57:12 ISTUpdated On 19-05-20192019-05-19T03:12:17.695Z19-05-2019 2019-05-19T03:11:56.291Z - 2019-05-19T03:27:12.206Z - 19-05-2019

అమరావతి కోటలో పాగా ఎవరిది? -1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐదేళ్ల తెలుగుదేశం ప్ర‌భుత్వం చేసిన ప‌నుల్లో రాజ‌ధాని నిర్మాణం గొప్ప‌ద‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. రాజ‌ధాని లేని రాష్ట్రానికి, క‌ట్టుబ‌ట్ట‌ల‌తో వ‌చ్చి అమ‌రావ‌తిని ప్ర‌పంచ‌స్థాయి రాజ‌ధానిగా నిర్మిస్తున్నామ‌ని, ఇది చంద్ర‌బాబు విజ‌న్ వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు.

రాజ‌ధాని ఎంపిక‌పై అనేక ప్రాంతాల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాల మ‌ధ్య‌లో రాజ‌ధాని నిర్మించాల‌ని టీడీపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రాజ‌ధానిగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయ‌డంతో ఈ ప్రాంత రూపురేఖ‌లే మారిపోయాయి. రైతులు రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు అయ్యారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి ప‌నులు పెద్ద ఎత్తున జ‌రుగుతున్నాయి.

దీంతో రాజ‌ధాని ప్రాంతంతో పాటు చుట్టు ప‌క్క‌ల ప్ర‌జ‌లు త‌మ ప్ర‌భుత్వంపై చాలా సంతృప్తితో ఉన్నార‌ని టీడీపీ చెబుతోంది. అయితే, నిజంగా ఈ ప్రాంత ప్ర‌జ‌లు టీడీపీపై సంతృప్తిగా ఉన్నారా..? అసంతృప్తితో మొదలయిందా? అనేది ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలే చెబుతాయి. రాజ‌ధానితో పాటు చుట్టు ప‌క్కల నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపోట‌ములు ఎలా ఉంటాయ‌నే దానిపై అంద‌రిలో ఆస‌క్తి పెరుగుతోంది.

ముఖ్యంగా రాజ‌ధాని ఉన్న మంగ‌ళ‌గిరి, తాడికొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపోట‌ముల‌పై ఎవ‌రి అంచ‌నాలు వారికున్నాయి. మంగ‌ళ‌గిరిలో మంత్రి నారా లోకేష్ పోటీ చేయ‌డంతో ఇది హాట్ సీట్ గా మారింది.

అయితే, ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఆయ‌న‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు. లోకేష్ గెలిచే అవ‌కాశం ఉన్నా మెజారిటీ మాత్రం అతి స్వ‌ల్పంగా ఉండ‌వ‌చ్చు అనే అంచ‌నాలు ఉన్నాయి.

Image result for rk vs lokesh

(ఇంకా ఉంది)

అమరావతి కోటలో పాగా ఎవరిది? -1      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle