newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

అమరావతి ఆందోళనకు టీడీపీ మద్దతు.. పలువురి హౌస్ అరెస్ట్

07-01-202007-01-2020 09:26:25 IST
Updated On 07-01-2020 12:26:23 ISTUpdated On 07-01-20202020-01-07T03:56:25.282Z07-01-2020 2020-01-07T03:55:04.120Z - 2020-01-07T06:56:23.650Z - 07-01-2020

అమరావతి ఆందోళనకు టీడీపీ మద్దతు.. పలువురి హౌస్ అరెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్ మూడురాజధానుల ఏర్పాటుకు చకచకా అడుగులు వేస్తున్నారు. త్వరలో విశాఖకు అమరావతిలోని సచివాలయం శాఖలను తరలించనున్నారు. ఈ నేపథ్యంలో గత 20 రోజులుగా సాగుతున్న ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్నాయి. ఆందోళనలు 

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనకు టీడీపీ నేతలు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలువురు టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. 

https://www.photojoiner.net/image/RqtY0yrH

రైతులు చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమం భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు.. గుంటూరు జిల్లా చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధానికి వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను, వసంతరాయపురంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును గృహనిర్బంధంలో ఉంచారు. చింతకాని, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం డాన్‌బాస్కో స్కూల్‌ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రైతులను, ఆందోళనకారులను కట్టడి చేస్తున్నారు. ఇటు పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను కూడా గృహనిర్బంధంలో ఉంచారు.

దీంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. విజయవాడ, పెనమలూరు, నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలను గృహనిర్బంధంలో ఉంచారు. ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌ నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఇదిలా ఉండగా... రాజధానిని తరలించవద్దంటూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేస్తున్న దీక్షాశిబిరాన్ని చంద్రబాబు సందర్శించి సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే.మన పిల్లలు వేరే ప్రాంతానికి వెళ్లకూడదనే ఉద్దేశంతో ఆనాడు అమరావతికి శ్రీకారం చుట్టానని, తనపై ఉన్న కోపాన్ని అమరావతిపై చూపించవద్దని ప్రభుత్వానికి సూచించారు చంద్రబాబు.

రాజధాని అంశంపై పార్లమెంట్‌లో గట్టిగా పోరాడతామని ఎంపీ గల్లా జయదేవ్‌ స్పష్టం చేశారు. మందడంలో రైతుల నిరసనకు జయదేవ్‌ సోమవారం సంఘీభావం తెలిపారు. 

శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. పెయిడ్ ఆర్టిస్టులంటూ రైతుల్ని, మహిళల్ని కించపరిచే వారే సిగ్గుపడాలన్నారు. రైతులకు సెల్‌ఫోన్లు, బంగారుగొలుసులు ఉంటే చులకనగా మాట్లాడతారా అని గల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే రాజధానిని విభజించడం కాదని, విభజించుకుంటూ పోతే ఖర్చు పెరుగుతుంది తప్ప ఆదాయం సమకూరదన్నారు. రాజధానుల మార్పు ఆలోచనను విరమించుకోవాలన్నారు. 

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   43 minutes ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   an hour ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   an hour ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   an hour ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   2 hours ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   2 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   3 hours ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   3 hours ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   3 hours ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   4 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle