newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం నిధులకు కత్తెర..

24-09-201924-09-2019 12:53:52 IST
Updated On 24-09-2019 13:01:07 ISTUpdated On 24-09-20192019-09-24T07:23:52.729Z24-09-2019 2019-09-24T07:23:47.924Z - 2019-09-24T07:31:07.362Z - 24-09-2019

అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం నిధులకు కత్తెర..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రాజెక్టులు, కాంట్రాక్టుల విషయంలోనే కాదు...ఆలయాల విషయంలో కూడా ఏపీలోని జగన్ సర్కార్ గత తెలుగుదేశం ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడుతున్నది. తాజాగా అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన శ్రీవారి ఆలయం నిధుల విషయంలో కూడా కత్తెర వేసింది. గత టీటీడీ పాలక మండలి ఆధ్వర్యంలో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో అమరావతిలో తిరుమల శ్రీవారి ఆయల నమూనాతో దేవాలయం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు ఆమోదం కూడా అయిపోయింది. అయితే రాష్ట్రంలో వైపాకా సర్కార్ అధికారంలోనికి వచ్చిన తరువాత బాధ్యతలు చేపట్టిన టీటీడీ కొత్త పాలక  మండలి ఆలయ నిర్మాణం విషయంలో నిధులకు కత్తెర వేసింది. రూ.150 కోట్లతో గత పాలక మండలి సిద్ధం చేసిన ప్రతిపాదనలను పక్కన పెట్టేసి కేవలం 36కోట్ల రూపాయల వ్యయంతో అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే గత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదొడుతున్న జగన్ సర్కార్ వాటన్నిటికీ అవకతవకలు, అనినీతి కారణంగా చెబుతున్నది. అయితే ఆలయ నిర్మాణ వ్యయాన్ని భారీగా కుదించేయడానికి టీటీడీ చెప్పిన కారణం నిధుల కొరత. టీటీడీ కొత్త పాలక మండలి కొలువుదీరిన తొలి సమావేశంలోనే అమరావతి ఆలయ నిర్మాణ వ్యయంపై కత్తెర వేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందనడంలో సందేహం లేదు.

నవ్యాంధ్ర రాజధానితో తిరుమల వైభోగం కళ్లకు కట్టేలా, తిరుమల ఆలయాన్ని పోలినట్లుగా భారీగా శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని, అక్కడి పూజలు ఇతర వ్యవహారాలు అన్నీ తిరుమలలోలాగే జరిపించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అప్పటి టీటీడీ పాలక మండలి అంగీకరించింది. ఆలయ నిర్మాణానికి భూమిని కూడా అప్పటి ప్రభుత్వం కేటాయించింది. తాళ్లూరు మండలం వెంకటాయపాలెంలో ఇందుకోసం పాతిక ఎకరాల స్థలాన్ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది.

2020 నాటికి ఆలయ నిర్మాణం పూర్తి కావలన్నది లక్ష్యంగా పెట్టుకున్న గత పాలక మండలి ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. అయితే కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే సమావేశమై తొలి సమావేశంలోనే అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ వ్యయాన్ని భారీగా కుదించాలని నిర్ణయించింది.

ఇప్పటికే తిరుమలలో అన్యమత ప్రచారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలో భక్తిగీతాల ఆల్బమ్ లో క్రైస్తవ ప్రార్థనా గీతాలు కూడా ఉన్నాయని సామాజిక మాధ్యమంలో జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించ తలపెట్టిన అమరావతి శ్రీవారి ఆలయ నిర్మాణ వ్యయంలో భారీ కోత విధిస్తూ కొత్త పాలక మండలి తీసుకున్న నిర్ణయం కచ్చితంగా విమర్శలకు తావిస్తుంది.

భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని భక్త జనం కోరుతున్నారు. కేవలం 36 కోట్ల రూపాయలతో అంత: ప్రాకారం వరకూ మాత్రమే ఆలయం నిర్మించాలని కొత్త పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతున్నారు.   

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

   2 hours ago


రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

   3 hours ago


ములుగులో మావోల అరెస్ట్

ములుగులో మావోల అరెస్ట్

   4 hours ago


కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

   4 hours ago


కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

   5 hours ago


రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

   5 hours ago


విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

   6 hours ago


జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

   18 hours ago


గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

   a day ago


ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle