newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

అమరావతిలో మీడియాపై దాడి.. పలువురికి గాయాలు

27-12-201927-12-2019 13:09:56 IST
Updated On 27-12-2019 13:09:54 ISTUpdated On 27-12-20192019-12-27T07:39:56.191Z27-12-2019 2019-12-27T07:39:45.679Z - 2019-12-27T07:39:54.371Z - 27-12-2019

అమరావతిలో మీడియాపై దాడి.. పలువురికి గాయాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. మూడురాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రైతులు, ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్దండరాయునిపాలెం దగ్గర మీడియా కవరేజి నిమిత్తం వెళ్లిన మీడియా ప్రతినిధులపై రైతులు దాడికి దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష కవరేజి కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై కొందరు దాడి చేశారు. 

ఓ ఛానెల్ లేడీ రిపోర్ట్ర్ తో పాటు మరో ఇద్దరు మీడియా ప్రతినిధులు ఈ ఘటనలో గాయపడ్డారు. అయితే తాము ఎవరిపై దాడి చేయలేదంటూ స్ధానిక రైతులు చెబుతున్నారు. మీడియా ప్రతినిధులపైన దాడిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై కూడా కొందరు దాడికి దిగారు. దీంతో కొందరు పోలీసులు గాయపడ్డారు. ఓ మీడియా లైవ్ వెహికల్ అద్దాలను కర్రలతో ధ్వంసం చేశారు. దీంతో కారు అద్దాలు పగిలి రిపోర్లరకు గాయాలయ్యాయి. 

రైతుల దాడి నుంచి తప్పించుకొని బయటికి వచ్చే క్రమంలో వెలగపూడి దగ్గర మరోసారి దాడికి తెగబడ్డారు రైతులు,ఆందోళనకారులు. మీడియా ప్రతినిధులపై పిడిగుద్దులతో దాడిచేశారు. తీవ్రగాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు మీడియా ప్రతినిధులు. దాడి చేసిన వారిలో అత్యధిక శాతం మహిళలు ఉన్నారని అంటున్నారు. రైతుల ఆందోళనలు ప్రపంచానికి చూపిస్తున్న మీడియా పై దాడికి తెగబడటంపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల నిరసనల కవరేజిని బాయ్ కాట్ చేయాలనే ఆలోచనలో వున్నారు విలేకరులు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle