newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

అమరావతిలో బంద్.. పెల్లుబికిన ఆందోళనలు

21-01-202021-01-2020 13:03:29 IST
2020-01-21T07:33:29.028Z21-01-2020 2020-01-21T07:33:27.506Z - - 24-02-2020

అమరావతిలో బంద్.. పెల్లుబికిన ఆందోళనలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో మూడురాజధానులకు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్నాయి. అమరావతి అసెంబ్లీ ముట్టడి కారణంగా మహిళలు, రైతులపై పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా ఆందోళనలకు పిలుపునిచ్చిన అమరావతి పరిరక్షణ సమితి నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. 

మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనలు సాగుతున్నా ప్రభుత్వం చెవిటి, మూగ, గుడ్డి తనంగా వ్యవహరిస్తోందని సమితి నేతలు దుయ్యబడుతున్నారు.  24 మంది రైతులు ప్రాణాలు కోల్పోతే పట్టించుకోవడం లేదన్నారు. ఇటు బెజవాడలో పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల నేపథ్యంలో నగరంలో ఎక్కడికక్కడ మోహరించారు పోలీసులు. 

ప్రకాశం బ్యారేజి, బెంజ్ సర్కిల్ , ధర్నాచౌక్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇటు రాజధాని గ్రామాలైన తాడేపల్లి, ఉండవల్లి,  ప్రకాశం బ్యారేజి వద్ద తీవ్ర ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. పోలీసుల చర్యలతో విజయవాడ వాసులు గగ్గోలు పెడుతున్నారు. స్కూల్ ,కాలేజి  విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయి అని చెప్పినప్పటికీ బ్యారేజ్  నుండి విజయవాడ వైపు అనుమతి ఇవ్వడం లేదు పోలీసులు.

దీంతో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం బ్యారేజీ మీదుగా తాడేపల్లి నుండి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను నిలిపివేసి విజయవాడ నుండి తాడేపల్లి వచ్చే వాహనాలకు మాత్రమే అనుమతినిస్తున్నారు పోలీసులు. ప్రకాశం బ్యారేజి నుండి భారీ వాహనాలకు అనుమతి లేనప్పటికీ ఆర్టీసీ బస్సులకు బ్యారేజీ మీదుగా రాకపోకలకు అనుమతిస్తున్నారు పోలీసులు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle