newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

అమరావతిలో పోలీస్ Vs రైతులు

03-01-202003-01-2020 13:25:21 IST
Updated On 04-01-2020 13:13:04 ISTUpdated On 04-01-20202020-01-03T07:55:21.250Z03-01-2020 2020-01-03T07:55:19.005Z - 2020-01-04T07:43:04.672Z - 04-01-2020

అమరావతిలో పోలీస్ Vs రైతులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజధాని అమరావతిలో రాజధాని మంటలు ఇంకా చల్లారలేదు. మందడం గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆందోళనకు దిగిన రైతులు-పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. నిరసన తెలుపుతున్న మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో వారు మండిపడుతున్నారు. రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి.

రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని రైతులు అంటున్నారు. ఇవాళ్టి నుంచి సకలజనుల సమ్మెకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలు బంద్ చేయాలని నిర్ణయించారు.

దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సకల జనుల సమ్మెలో భాగంగా రాజధాని గ్రామంలో రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. సచివాలయం రోడ్డు వద్ద రైతులు.. పోలీసుల బూట్లు తుడిచారు. తమకు సంఘీభావం తెలపాలని పోలీసులను కోరడం చర్చనీయాంశంగా మారింది. అటు రాజధానిని అమరావతిలోనే ఉంచాలని పెద్దవడ్లపూడిలో రైతులు నిరసన దీక్ష చేపట్టారు. 

మరోవైపు వెలగపూడి, మల్కాపురం గ్రామాల రైతులకు నోటీసులిచ్చిన వ్యవహారంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పలువురు రైతులకు నోటీసులు జారీ చేశారు. 307 హత్యాయత్నంతో పాటు మరో 7సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇవాళ సాయంత్రం 5గంటలకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఆధార్ కార్డుతో రావాలని 15 మందికి పైగా రైతులు, రైతు కూలీలకు నోటీసులు అందాయి.

ఈ నోటీసులపై రైతులు స్పందిస్తూ.. ఉద్యమం అణిచివేతకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉద్యమం ఆగదంటున్నారు. తుళ్ళూరులో కాకుండా చిలకలూరిపేట, తెనాలి, గుంటూరు స్టేషన్లలో హాజరు కావాలని రైతులకు ఇచ్చిన నోటీసుల్లో ఉండడంతో వారు అసలేం జరుగుతోందని ఆరా తీస్తున్నారు. 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle