newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

అమరావతిలో నిరసనల సెగ.. ఫ్లకార్డులతో ఆందోళన

22-12-201922-12-2019 12:25:30 IST
Updated On 23-12-2019 11:49:45 ISTUpdated On 23-12-20192019-12-22T06:55:30.666Z22-12-2019 2019-12-22T06:55:19.556Z - 2019-12-23T06:19:45.243Z - 23-12-2019

అమరావతిలో నిరసనల సెగ.. ఫ్లకార్డులతో ఆందోళన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రైతులు, స్థానికుల నిరసనలతో అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రాజధాని గ్రామాల్లో రైతులు రోడ్డెక్కారు. మూడు రాజధానుల నిర్ణయంపై రైతులు భగ్గుమంటున్నారు. మందడంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు. రోడ్డుకు అడ్డంగా పడవ పెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. రాజధాని రైతుల ఆందోళనకు వివిధ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. ఇవాళ ఆదివారం కావడంతో రైతులతో పాటు విద్యార్ధులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు.

అమరావతిలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మందడం నుంచి వెలగపూడి వరకు భారీ ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు సచివాలయం వైపు ముందుకు సాగారు. దీంతో సచివాలయం దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. 29 గ్రామాల రైతులతో సహా మహిళలు కూడా రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తచేస్తున్నారు.  ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మహిళలు, రైతులు, చిన్నారులు కూడా ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

ఈ సందర్బంగా ఓ మహిళ మాట్లాడుతూ..సాక్షాత్తు దేశ ప్రధానిగారు వచ్చి అమరావతిని రాజధానిగా అంగీకరిస్తు శంకుస్థాపన చేశారని.. ఇప్పుడు అమరావతికి అన్యాయం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన మాటలను తుంగలో తొక్కి తమకు అన్యాయం చేస్తున్నారనీ దీనికి కేంద్ర ప్రభుత్వం కల్పించుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి అదనపు భారం పడుతుందన్నారు. రక్తాన్నైనా చిందిద్దాం... అమరావతిని సాధిద్దాం అంటూ చిన్నారులు సైతం నినాదాలు చేస్తున్నారు.

పరిపాలనంతా అమరావతి నుంచే సాగాలి, జీఎన్ రావు కమిటీని వ్యతిరేకిద్దాం, ముఖ్యమంత్రి జగన్ వైఖరి నశించాలి అంటూ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న అమరావతిని మార్చితే మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసినా . .  ఒక్క రాజధాని నిర్మాణానికే అతీగతీ లేదని .. ఇప్పుడు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని తుళ్లూరు, వెలగపూడి, మందడం రైతులు ప్రశ్నిస్తున్నారు.రాజధానిని మార్చవద్దని డిమాండ్ చేస్తూ .. టీడీపీ నేతలు రైతులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించారు. 'మా పై ఎందుకీ పగ' అని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసన తెలుపుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీడం లేదంటున్నారు స్థానికులు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle