newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

అమరావతిలో ఉద్రిక్తత.. సీఎం ఫ్లెక్సీల దగ్ధం

21-12-201921-12-2019 13:11:02 IST
Updated On 21-12-2019 13:11:01 ISTUpdated On 21-12-20192019-12-21T07:41:02.950Z21-12-2019 2019-12-21T07:40:29.495Z - 2019-12-21T07:41:01.386Z - 21-12-2019

అమరావతిలో ఉద్రిక్తత.. సీఎం ఫ్లెక్సీల దగ్ధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో అమరావతి ప్రాంతంలోని రాజధాని గ్రామాలు అట్టుడుకుతున్నాయి. ప్రశాంతంగా ఉండే ప్రాంతమంతా.. రైతుల నిరసనలతో హోరెత్తుతోంది. వెలగపూడిలో రైతులు దీక్షలు కొనసాగిస్తుండగా.. మందడంలో ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఏపీలో రాజధాని మార్పు అంశంపై రైతులు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకీ ఉద్రికత్తలకు దారితీస్తున్నాయి.

Image

శనివారం ఉదయం మందడంలో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం నుంచే ఆందోళనకు దిగిన రైతులు, గ్రామస్తులు రోడ్డుపై టైర్లు తగులబెట్టేందుకు యత్నించారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొంత సేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

కొంతమంది రైతులు రోడ్లకు అడ్డంగా ఫ్లెక్సీలు కట్టి నిరసన తెలుపుతున్నారు. జీఎన్‌రావు కమిటీ రిపోర్టు అంతా బూటకమని, అది జీఎన్ రావు కమిటీ కాదు.. జగన్ కమిటీ అని కొంతమంది రైతులు మండిపడుతున్నారు.  చిన్నా, పెద్ద తేడా లేకుండా అంతా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతుండడంతో వారిని నిలువరించడం పోలీసులకు సాధ్యం కావడంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ధర్నా శిబిరంలో రోడ్లపై పడుకుని నిరసన తెలుపుతున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

మరోవైపు సచివాలయం వైపు సందర్శకులు, మంత్రులు, అధికారుల వాహనాలను రానివ్వకుండా మందడం గ్రామంలో రోడ్లకు అడ్డంగా సిమెంట్‌ బెంచ్‌లు, ట్రాక్టర్లు అడ్డు పెట్టారు. దీంతో  పోలీసులు, రైతులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరుగుతోంది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండటంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఇటు వెలగపూడిలో రైతులు తమ దీక్షలు కొనసాగిస్తున్నారు. భూములిచ్చిన రైతుల ఉసురు తీస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వం దిగిరాకుంటే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులందరినీ కూడగట్టుకుని భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు. రైతుల ఉద్యమానికి టీడీపీ సంఘీభావం ప్రకటించింది. 

ఇదిలాఉంటే.. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని.. స్వార్థ ప్రయోజనాలు తమకు లేవంటున్నారు మంత్రి అవంతి శ్రీనివాస్‌. 13 జిల్లాలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోనే మూడు రాజధానులు ఆలోచనతో ముందుకెళతామంటున్నారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదన్నారు. విశాఖ రాజధానిని చేయడంతో ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. 

 

ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

   4 minutes ago


జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

   an hour ago


తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

   an hour ago


ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

   2 hours ago


విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

   2 hours ago


 జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

   2 hours ago


  పైలెట్ ని క్షమించేద్దాం.. అశోక్ గెహ్లాట్

పైలెట్ ని క్షమించేద్దాం.. అశోక్ గెహ్లాట్

   4 hours ago


సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

   15 hours ago


తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

   16 hours ago


ఇళ్ళ పట్టాల పంపిణీ  మళ్లీ మళ్లీ వాయిదా

ఇళ్ళ పట్టాల పంపిణీ మళ్లీ మళ్లీ వాయిదా

   16 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle