newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

అమరావతిలో అసలేం జరుగుతోంది?-2

04-10-201904-10-2019 12:20:51 IST
Updated On 04-10-2019 12:27:45 ISTUpdated On 04-10-20192019-10-04T06:50:51.097Z04-10-2019 2019-10-04T06:50:30.778Z - 2019-10-04T06:57:45.824Z - 04-10-2019

అమరావతిలో అసలేం జరుగుతోంది?-2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
(మొదటి భాగం తరువాయి)

అమరావతిలో అసలేం జరుగుతోంది?-1

నిర్మాణ పనుల వద్ద చిన్న చిన్న కొట్లు పెట్టుకున్నవారు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిర్మాణ పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు చాలా మంది తిరిగివెళ్లిపోయారు. చాలామంది అమరావతి నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పనులకు షిఫ్ట్ అయిపోయారు.

గత నాలుగునెలల నుంచి అమరావతి నుంచి హైదరాబాద్ కు వచ్చిన వారి సంఖ్య 5 లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఇక్కడ కార్మికుల కోసం వివిధ స్టోర్స్ కూడా ప్రారంభించారు. అయితే, రాజధాని నిర్మాణ పనులలో జాప్యం కారణంగా సూపర్ మార్కెట్లు పెట్టినవారు తమ షాపులను నిర్వహించలేకపోతున్నారు. 

రాజధాని ప్రాంతానికి చెందిన గణేష్ ‘న్యూస్ స్టింగ్’తో మాట్లాడారు. ఇక్కడ మే నెలతో పోలిస్తే మూడునెలలుగా పరిస్థితులు బాగా మారిపోయాయని, తమ బంధువులు అద్దెల కోసం కట్టిన ఇళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళన వ్యక్తంచేస్తేనే... కౌలు నిధులు విడుదలచేశారని గణేష్ చెబుతున్నారు. తమ ఆశలన్నీ ఆవిరైపోయాయని, భూముల ధరలు బాగా పడిపోయాయని, గతంలో5 కోట్ల వరకూ పలికిన భూములు కొనేందుకు ఎవరూ రావడం లేదంటున్నారు. అమరావతి రైతులు ఆందోళనలో ఉన్నారని మరో స్థానికుడు కోటేశ్వరరావు ‘న్యూస్ స్టింగ్’ తో అన్నారు.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్పు సాధ్యం కాదని తుళ్ళూరుకి చెందిన రమేష్ బాబు ‘న్యూస్ స్టింగ్’ తో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో తుళ్ళూరు, రాయపూడి ప్రాంతాల్లో ఎకరం 3-4 కోట్లు పలికిన భూములు ప్రస్తుతం సగానికి సగం తగ్గిపోయాయని అన్నారు. గతంలో 32-33 వేలు గజం భూమి ధర ప్రస్తుతం 17-18 వేల రూపాయలకు పడిపోయిందన్నారు.

ఇప్పటికే 10 వేల కోట్ల రూపాయలకు పైగా పనులు జరిగాయని, అసెంబ్లీ, హైకోర్టు, అధికారుల నివాసాలు పూర్తయ్యాయని, రాజధాని విషయంలో గందరగోళం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 33వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారని, ప్రస్తుతం 250 అడుగుల వెడల్పైన రోడ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని  రమేష్ బాబు ‘న్యూస్ స్టింగ్’ తో చెప్పారు. 

రాజధాని మారదని, అయితే జగన్ ప్రభుత్వం, మంత్రులు ఈ విషయంలో విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారన్నారు. రైతులకు టీడీపీ, జనసేన, బీజేపీ వంటి విపక్షాలు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. రాజధాని ప్రాంతం అమరావతి అన్ని విధాలా అనుకూలమయినది, ఒక కులంపై కక్షతో తెరమీదకు దొనకొండను తెస్తున్నారని రమేష్ బాబు చెప్పారు.

రాయపూడి, మందడం, తుళ్ళూరు, ఉండవల్లి ప్రాంతాల్లో అద్దెకు వందలాది భవనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఉద్యోగులు అమరావతి నుంచి వెళ్లిపోవడంతో భవనాలు ఖాళీ అయ్యాయన్నారు. అమరావతి అభివృద్ది తాత్కాలికంగా ఆగిందని, మరికొద్దిరోజుల్లో మళ్ళీ పూర్వవైభవానికి రావడం అసాధ్యం ఏమీ కాదంటున్నారు.

రైతులకు సకాలంలో కౌలు చెల్లించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు మారినా గతంలో చేసిన ఒప్పందాలు అమలుచేయాలని ఆయన కోరారు. రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ‘న్యూస్ స్టింగ్’ తో రమేష్ బాబు.

అమరావతి రాజధాని కాకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ అక్కడే కూర్చుని ఎందుకు పనిచేస్తున్నారని టీడీపీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సైతం రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు భరోసా కల్పిస్తున్నారు.

అమరావతి రాజధాని ప్రాంత రైతులకు బీజేపీ కొండంత అండగా ఉంటుందంటున్నారు ఎంపీ సుజనా చౌదరి. మందడం, రాయపూడి, వుద్ధండరాయునిపాలెం, నెక్కల్లు, తుళ్లూరు గ్రామాలలో రైతులతో  ఎంపీ సుజనా చౌదరి ముఖాముఖి నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం మీద జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి అభివృద్ధి మాట ఎలా ఉన్నా.. గందరగోళం సృష్టించారన్న మాట వాస్తవం. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగడం అంతమంచిది కాదన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం. కాదంటారా? 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle