newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

అమరావతిపై మాట తప్పి మడమ తిప్పిన జగన్

23-12-201923-12-2019 18:05:24 IST
Updated On 24-12-2019 14:16:34 ISTUpdated On 24-12-20192019-12-23T12:35:24.506Z23-12-2019 2019-12-23T12:35:21.181Z - 2019-12-24T08:46:34.810Z - 24-12-2019

అమరావతిపై మాట తప్పి మడమ తిప్పిన జగన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీకి మూడు రాజధానులు, అమరావతి నుంచి సచివాలయం, హైకోర్టు తరలింపుపై అక్కడి రైతులు, సామాన్య ప్రజలు ఆందోళన చేస్తున్నవేళ తుళ్ళూరులో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. జై అమరావతి... జై అమరావతి అంటూ నినాదాలు చేశారు చంద్రబాబు. తాను ఎన్నో ఆశలతో అమరావతికి భూములు సేకరించానని, కానీ జగన్ ప్రభుత్వంలో అమరావతి రైతుల్ని ఈ పరిస్థితుల్లో చూస్తాననుకోలేదన్నారు చంద్రబాబు.

రాష్ట్రంకోసం ఎంతోమంది రైతులు ముందుకొచ్చారని, అందరికీ ఆమోదయోగ్యమైన ప్యాకేజి నాడు ప్రకటించానన్నారు చంద్రబాబు. ఇది ఓ మహానగరంగా అభివృద్ధి చెందుతుందని మీరంతా భూములిచ్చారని, రైతులకు న్యాయం కోసమే రైతు దినోత్సవం జరుపుకుంటామని, కానీ రైతు దినోత్సవం రోజే రైతులంతా రోడ్డు పై ఉండటం బాధ కలిగిస్తోందన్నారు. 

తాను సీఎంగా హామీ ఇచ్చానని, చంద్రబాబుగా కాదన్నారు. వ్యక్తులు శాశ్వతం కాదని, సమాజం శాశ్వతం అన్నారు చంద్రబాబు. అమరావతి లో రైతులు ప్రథమ పౌరులుగా ఉంటారని ఆశించానని, కానీ ప్రస్తుతం పరిస్థితి దారుణంగా మారిందన్నారు. రైతులకు న్యాయం జరగాల్సిందేనని మీకు తాను అండగా ఉంటానన్నారు. అమరావతి పై జగన్ ఎందుకు మాట తప్పి మడం తిప్పారని చంద్రబాబు ప్రశ్నించారు. తానెవరికీ భయపడడం లేదని, అమరావతి రైతులకు న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తానన్నారు. 

30వేల ఎకరాలు కావాలని అన్నారని, ఇప్పుడెందుకు రెండు వందల ఎకరాలు చాలని అంటున్నారని, ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటూ అమరావతిని చంపేయటం అన్యాయం, దుర్మార్గం అన్నారు. అమరావతిలో ఇన్ సైడ్  ట్రేడింగ్ పై న్యాయ విచారణ జరిపించాలని, తాము విచారణకు సహకరిస్తాం. తప్పు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధం అన్నారు చంద్రబాబు. జీఎన్ రావు నివేదికకు విశ్వసనీయత లేదన్నారు.

కమిటీ ఎవరినీ సంప్రదించకుండానే నివేదిక రూపొందించిందన్నారు. ముఖ్యమంత్రి పేపర్ లీక్ చేస్తే జీఎన్ రావు పరీక్ష రాసినట్లుందని, అది జీఎన్ రావు నివేదిక కాదు జగన్ నివేదిక అన్నారు చంద్రబాబునాయుడు. రాయపూడి నుంచి చంద్రబాబు నాయుడు పర్యటనకు మద్దతుగా బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు వేలాదిమంది యువకులు. 

రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఇద్దరు ఎస్పీలు, ఆరుగురు సీఐలు, 20 మంది ఎస్సైలు, వంద మంది కానిస్టేబుల్స్‌, 50 మంది మహిళా పోలీసులు విధుల్లో ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.గతంలో రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటనలో కాన్వాయ్‌పై రాయి, చెప్పు విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. 

భూమిపూజలో దళిత సాధువులను దూరం పెట్టారు.. కోవింద్ కూడా కనబడలేదా.. మాయావతి ధ్వజం

భూమిపూజలో దళిత సాధువులను దూరం పెట్టారు.. కోవింద్ కూడా కనబడలేదా.. మాయావతి ధ్వజం

   a minute ago


పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

పారిశ్రామికీకరణపై సీఎం జగన్ మార్కు నిర్ణయం.. జగన్ కి ఆ లోటు తీరినట్టేనా…!!

   an hour ago


‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

‘పర్ఫెక్ట్’ స్కెచ్.. 16మంది ప్రాణాలు గాల్లోకి... శానిటైజర్ కంపెనీ కథాకమామీషు

   2 hours ago


14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

14 నెలల్లో మీరేం చేశారు? జగన్ సర్కార్‌‌పై బాబు ప్రశ్నాస్త్రాలు

   2 hours ago


సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

సచిన్ పైలట్ పయనం ఎటువైపు? స్వంత గూటికి చేరేనా?

   2 hours ago


తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

తెలంగాణలో ఆగని కరోనా కేసులు.. కొత్తగా 1896 కేసులు

   2 hours ago


ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

ప్లాస్మా దానం ఎవరు చేయాలి? ఎలా చేయాలి?

   3 hours ago


హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   3 hours ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   4 hours ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   4 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle