newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

13-11-201913-11-2019 13:21:34 IST
Updated On 13-11-2019 13:42:38 ISTUpdated On 13-11-20192019-11-13T07:51:34.625Z13-11-2019 2019-11-13T07:51:29.158Z - 2019-11-13T08:12:38.028Z - 13-11-2019

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతి ప్రాజెక్ట్‌ నుంచి సింగపూర్ సర్కార్ వైదొలగడం ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి విషయంలో కీలక పరిణామంగా భావిస్తున్నారు. అమరావతి క్యాపిటల్ ఏరియా ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు సింగపూర్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడంతో రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై ముందుకు వెళ్ళడం కుదరదని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తెలిపారు. ‘గతంలో 6.84 కిలో చదరపు కిలో మీటర్లు రాజధాని అమరావతి స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ద్వారా సింగపూర్ కన్సార్టియం 2017లో ఏర్పడింది. ఈ ప్రాజెక్టును రద్దు చేసుకోవడం కొన్ని మిలియన్ డాలర్ల మేర మాత్రమే ప్రభావం చూపుతుందని కన్సార్టియం కంపెనీలు చెబుతున్నాయి. 

ఈ నిర్ణయం కారణంగా ఇండియాలో తమ పెట్టుబడులపై పెద్దగా ప్రభావం ఉండదని సింగపూర్ కన్సార్టియం కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలపట్ల సింగపూర్ కంపెనీలు ఆసక్తిగానే ఉన్నాయి. అయితే ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల కొంత ప్రతికూల ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. 


Image may contain: text

Image may contain: text

1691 ఎకరాల్లో మూడు దశల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేసేలా చంద్రబాబు ప్రభుత్వంతో సింగపూర్ సర్కార్‌ ఒప్పందం చేసుకుంది. రాజధాని మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్న వేళ సింగపూర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. 

సింగపూర్‌ కంపెనీలు అమరావతి నుంచి వెళ్ళిపోవడం ఏపీకి చెడు వార్తని కర్ణాటకకు చెందిన పారిశ్రామికవేత్త  వ్యాఖ్యానిస్తే, ఏపీలో ఏం జరుగుతోందని ఆశ్చర్యపోతోంది జాతీయ మీడియా. చంద్రబాబు ఐదేళ్ళ కష్టాన్ని 5 నెలల్లో బూడిదపాలు చేసిన వైసీపీ సర్కారు అసమర్థత గురించి ఇప్పుడు దేశమంతా చర్చిస్తోందని టీడీపీ ట్వీట్ చేసింది. 

మరోవైపు మాజీ సీఎస్, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ఱారావు ఈ వ్యవహారంపై స్పందించారు. ‘‘సింగపూర్ వారికి ఇది కావలసిన కార్యము గంధర్వులే తీర్చినట్లు అయింది. పర్యావరణ సమస్యల దృష్ట్యా, వరదల ప్రభావం వల్ల ఈ ప్రాజెక్టు సాధ్యం కాదని వాళ్లు ఎప్పుడో గ్రహించారు.

Image may contain: text

అందుకనే జాప్యం చేస్తూ కాలం గడిపారు. ఇప్పటి ప్రభుత్వం నిర్ణయం ఒకరకంగా వారికి ప్రాజెక్టు నుంచి విముక్తి కల్పించింది’’అంటూ ఐవైఆర్ ట్వీట్ చేశారు. ఈట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదాలు.. రేవంత్ రెడ్డి‌పై వీహెచ్ నారాజ్

   an hour ago


తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. కేటీఆర్ భూమి పూజ

   2 hours ago


అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

అమ్మకానికి శిశువు... హైటెక్ నగరంలో దారుణం

   2 hours ago


ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

ఇంజనీరింగ్ విద్యార్ధులకు గుడ్ న్యూస్... ఆన్ లైన్ క్లాసెస్ షురూ!

   2 hours ago


కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

కేటీఆర్‌కు లైన్ క్లియ‌ర్‌... ఇక ఆ కుర్చీ ఎక్క‌డ‌మే మిగిలింది..!

   3 hours ago


కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

కోవిడ్ పరీక్షల్లో కొత్త రికార్డ్.. ఒక్కరోజే 23 వేల పరీక్షలు.. 1931 కొత్త కేసులు

   4 hours ago


వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

   16 hours ago


ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

   18 hours ago


టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

   18 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle