newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

అమరావతిపై అయోమయం- సర్కార్ నుంచి కొరవడిన స్పష్టత

16-10-201916-10-2019 07:44:22 IST
Updated On 16-10-2019 12:52:09 ISTUpdated On 16-10-20192019-10-16T02:14:22.155Z16-10-2019 2019-10-16T02:13:36.893Z - 2019-10-16T07:22:09.654Z - 16-10-2019

అమరావతిపై అయోమయం- సర్కార్ నుంచి కొరవడిన స్పష్టత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ స్థాయి నగరంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి అన్న ప్రచారంలో ఏపీ రాజధానిగా అమరావతికి గత ప్రభుత్వ హయాంలో బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన ఈ ఐదు నెలలలోనూ ఆ ఇమేజ్ కరిగిపోవడమే కాకుండా అమరావతి పురోగతిపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. రాజధానికి భూములిచ్చిన రైతులలోనే కాదు...ఏపీ రాజధానిగా ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్న భావనతో అక్కడకు తమ వ్యాపారాలను తరలించిన వారిలోనూ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని భావించిన యువతలోనూ కూడా తీవ్ర ఆందోళన నెలకొని ఉంది.

అసలు ఏపీకి రాజధాని నిర్మాణం జరుగుతుందా? ఒక వేళ జరిగితే అది అమరావతేనా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు స్వయంగా బొత్స సత్యనారాయణ వంటి మంత్రులు చేసిన వ్యాఖ్యలు కారణమైతే...వాటిని తొలగించేందుకు ప్రభుత్వం ఏ మాత్రం ప్రయత్నించకపోవడంతో అవి బలపడుతున్నాయి.

గత తెలుగుదేశం హయాంలో అమరావతికి సంబంధించి నిత్యం ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ వార్తలలో నిలిచేది. ఇప్పుడు అసలు అమరావతి గురించిన సమాచారమే లేని పరిస్థితి నెలకొంది. దానికి తోడు ఒక్కో మంత్రి ఒక్కో తీరుగా అమరావతిపై చేస్తున్న ప్రకటనలు అమరావతి పురోగతిపై అనుమాన మేఘాలు కమ్ముకునేలా చేస్తున్నాయి.

గతంలో అమరావతిని రాజధానిగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించినప్పుడు అప్పటికి విపక్షంలో ఉన్న వైకాపా దొనకొండను తెరమీదకు తీసుకువచ్చింది. దొనకొండ అయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందంటూ అప్పట్లో వైకాపా విస్తృతంగా ప్రచారం చేసింది.

ఇప్పుడు అధికారంలోనికి వచ్చిన తరువాత వైకాపా సర్కార్ అమరావతి అభివృద్ధి విషయంలో అనుసరిస్తున్న విధానం అమరావతి రాజధానిగా ఉంటుందా అన్న అనుమానాలను రేకెత్తిస్తున్నది. ఈ నేపథ్యంలోనే అమరావతిలో భూముల ధరలు గణనీయంగా పడిపోయాయి. అదే సమయంలో దొనకొండ ప్రాంతంలో భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపుతున్నారు.

అమరావతి పురోగతి, అభివృద్ధిపై ఏర్పడిన గందరోగోళ పరిస్థితి కారణంగా పెట్టుబడి దారులు  వెనక్కు మళ్లుతున్నారు. రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టిన ఎన్నారైలు ఇప్పుడు వెనక్కు తగ్గుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఇదెంత మాత్రం మంచిది కాదని నిపుణులు, రాష్ట్ర ప్రగతిని కాంక్షించే వారు  చెబుతున్నారు.  

రాష్ట్ర రాజధాని విషయంలో ఇటువంటి సందిగ్ధత ఏ మాత్రం మంచిది కాదు. సచివాలయాన్ని మంగళగిరి తరలించనున్నారంటూ వస్తున్న  వార్తలు అమరావతి భవిష్యత్ ను అయోయమంలో పడేస్తున్నాయి. రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ ద్వారా భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

భవిష్యత్ పై బెంగపడుతున్నారు. వాటిని జాప్యం లేకుండా నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  పైగా గత ప్రభుత్వం తలపెట్టిన ఏ పనినీ తాము ముందుకు సాగనీయమన్న ధోరణిలో ప్రస్తుత సర్కార్ వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. అధికారం శాశ్వతం కాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు తీసుకునే చర్యలు శాశ్వతంగా ఉండాలి.

సంక్షేమం, అభివృద్ధి ఒక్కో ప్రభుత్వంలో ఒక్కో రకంగా మారిపోవు. అవి శాశ్వతం. ఒక ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వ కార్యక్రమాలన్ని రద్దు చేస్తే  ఆ తరువాత వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వ కార్యక్రమాలను, చేపట్టిన పనులను రద్దు చేయదన్న గ్యారంటీ ఏమిటి? రాజకీయాలు ప్రభుత్వాలను నడిపే విధానం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదు. ఇప్పటికైనా ఏపీ సర్కార్ అమరావతి విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle