newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

అమరావతిని తరలిస్తే అడ్డుకుంటాం

29-12-201929-12-2019 17:11:28 IST
Updated On 29-12-2019 17:17:38 ISTUpdated On 29-12-20192019-12-29T11:41:28.508Z29-12-2019 2019-12-29T11:41:21.173Z - 2019-12-29T11:47:38.318Z - 29-12-2019

అమరావతిని తరలిస్తే అడ్డుకుంటాం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మూడురాజధానులంటూ ఏపీ ప్రభుత్వం అమరావతి వాసుల్లో గందరగోళం సృష్టిస్తోందని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. తుళ్ళూరు ప్రాంతంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి వేలాదిమంది అమరావతి ప్రాంత యువకులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Image may contain: crowd and outdoor

అమరావతి ప్రాంత ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దు. ఈ రాజధాని మన హక్కు. రాజధాని ఇక్కడ కావాలని ఎవరూ అడగలేదు. రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో పూజలు చేసి అక్కడినుంచి బీజేపీ బృందం తుళ్ళూరులో పర్యటించింది. 

ప్రభుత్వం నిర్ణయిస్తేనే  రైతులు భూములిచ్చారు. రాజధాని మార్పు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని‌విధాలా నష్టపోతుంది. అవినీతి జరిగితే.. వాస్తవాలు‌ బయట పెట్టి అరెస్టు చేయాలని సుజనా చౌదరి డిమాండ్ చేశారు.

Image may contain: one or more people, crowd and outdoor

జగన్ తన పాలనలో తప్పుల నుంచి పక్కదారి పట్టించేలా రాజధాని మార్పు ప్రకటన చేశారని,  రాజు మారినప్పుడల్లా రాజధాని మారడం జరగదన్నారు. తుగ్లక్ పాలనలోనే ఇలాంటి పరిణామాలు జరిగాయని ఎద్దేవా చేశారు. జీఎన్ రావు కమిటీ నివేదికపై ఆయన మండిపడ్డారు.  జగన్ చెప్పింది రాసిచ్చినట్లుగా ఉందని,  జి.యన్.రావు కమిటీ నివేదిక కాదని జగన్ నివేదిక అన్నారు బీజేపీ నేతలు. 

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమిస్తుందన్నారు.  రాజధాని‌ వాసులు ఆందోళన చెందవద్దని, రాజధాని తరలిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదన్నారు. .ఇక నుంచి సేవ్ ఆంధ్రప్రదేశ్.. అనే నినాదంతో ముందుకు వెళదాం అని పిలుపునిచ్చారు.  ఇదిలా ఉంటే.. అమరావతిలో 12వ రోజు ఆందోళనలు కొనసాగాయి.

Image may contain: 21 people, people smiling, crowd and child

ఉద్దండరాయునిపాలెంలో మీడియాపై జరిగిన దాడిలో నలుగురు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారో తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. రైతులు, రైతుకూలీలు, మహిళలు రోడ్లపైకి చేరుకుని దీక్షా శిబిరాల్లో పాల్గొన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle