newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

అమరావతికి వైసీపీ రెబల్ ఎంపీ మద్దతు.. రాష్ట్రపతికి వినతి

21-07-202021-07-2020 18:31:03 IST
Updated On 21-07-2020 18:24:06 ISTUpdated On 21-07-20202020-07-21T13:01:03.101Z21-07-2020 2020-07-21T12:52:29.762Z - 2020-07-21T12:54:06.463Z - 21-07-2020

అమరావతికి వైసీపీ రెబల్ ఎంపీ మద్దతు.. రాష్ట్రపతికి  వినతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఏపీ రాజధాని విషయంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సంచలన కామెంట్లుచేసారు.ఏపి రాజధాని గా అమరావతి ఉండే విధంగా అందరూ కలసి రావాలన్నారు. భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్న విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లానని తెలిపారు. అమరావతి భూముల వ్యవహారం, బిల్లులను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న విషయాన్ని రాష్ట్రపతి దృష్టి కి తీసుకు వెళ్లానని అన్నారు. ఈ విషయంలో అటార్నిజనరల్ సలహా తీసుకోవాల్సిందిగా గవర్నర్ కు సూచించాలని రాష్ట్రపతిని కోరానని తెలిపారు. తన విషయంలో మొదటి నుంచి జరుగుతున్న పరిణామాలను వివరించానని తెలిపారు. 

తెలుగు భాష విషయంలో రాజ్యాంగం కంటే పార్టీ మ్యానిఫేస్టోనే ముఖ్యం అన్న విధంగా తమ పార్టీ వ్యవహరిస్తుందని అన్నారు. తెలుగు భాష విషయంలో లోక్ సభలో మాట్లాడిన విషయాన్ని, ఆయనకు జారీ చేసిన షోకాజు నోటీసును అనర్హత పిటిషన్ లో ప్రస్తావించానని తెలిపారు. తప్పనిసరి పరిస్థితులలోనే తన భద్రత గురించి లోక్ సభ స్పీకర్ , కేంద్ర హోం మంత్రికి లేఖ రాసారని ఆయన అన్నారు. భద్రత కల్పించే అంశం బాగా ఆలస్యం అవుతున్నందున కోర్టుకు వెళ్లానని అన్నారు.

ఈ విషయాలన్నింటినీ రాష్ట్రపతికి వివరించారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన భాధ్యతలలో భాగంగా ప్రజాసమస్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లానని అన్నారు. ప్రభుత్వం, పార్టీ మధ్య తేడా తమ పార్టీ నేతలకు తెలియదని, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ప్రకారం తనకు ఉందని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో ని ఆర్టికల్ 19 ప్రకారం ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించవచ్చని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని అన్నారు. 

అమరావతికి భూములు ఇచ్చింది ఒక కులం వారు కాదని కమ్మ కులం వారు 18 శాతం, రెడ్డి కులం వారు 20 శాతం పైగా, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం వారు ఎక్కువ సంఖ్యలో భూములు ఇచ్చారని అన్నారు. మాటతప్పని, మడమ తిప్పని సీఎం రాజధాని అమరావతి విషయంలో మాట నిలబెట్టుకోవాలని అన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను రఘురామ కలిసి రెండు లేఖలు అందజేశారు. శాసనమండలిలో బిల్లు పాస్ కాకపోతే.. ఆ బిల్లు మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించారు. కానీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మండలి సెక్రటరీ మాత్రం దాన్ని పక్కన పెట్టారన్నారు. శాసనమండలి ఛైర్మన్ నిర్ణయాన్నే సెక్రటరీ ఒప్పుకోకపోవడం ఆ వ్యవస్థకే మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు శాసనమండలి అయింది.. రేపు శాసనసభలో కూడా అలానే జరగొచ్చు. అయినా ప్రభుత్వం ఇటువంటి వాటికి సహకరించకూడదని హితవు పలికారు. అంతటితో ఆగారంటే.. బిల్లులు పాస్ కాలేదని ఏకంగా ఆవేశంలో శాసనమండలినే రద్దు చేసేశారన్నారు. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.

'మడమ తిప్పను.. మాట తప్పను' అని చెప్పి అమరావతి రాజధాని విషయంలో ఇప్పుడెందుకు మాట తప్పారంటూ ఎంపీ నిలదీశారు.  విశాఖలో రాజధాని కట్టడానికి అంత డబ్బు ఎక్కడిది.. దీన్ని కూడా ప్రజలు నిలదీయాలి'' అని అన్నారు. '’రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తికే పార్టీ నోటీసు ఇస్తే.. ఇప్పుడు ఆ పార్టీయే రద్దయ్యే పరిస్థితి దాపురించింది. కనీసం ఆ ప్రమాదాన్ని కూడా గుర్తించకుండా నాకు నోటీసు ఇచ్చారు. తెలుగు భాష గురించి పార్లమెంట్‌లో మాట్లాడా.. దానిపై గతంలోనే వివరణ ఇచ్చా. కానీ షోకాజ్ నోటీసులో మళ్లీ దాన్ని పొందుపరిచారు. టీటీడీ భూములు అమ్మాలనుకోవడమే క్షమించరాని నేరం. ఇసుక, ఇళ్ల పట్టాల అక్రమాల గురించి ప్రశ్నించనందుకు నోటీసు ఇచ్చారు. సమాధానం చెప్పినా.. శాంతించకుండా మంత్రులు, ఎమ్మెల్యేలతో కేసులు పెట్టించడం. దిష్టిబొమ్మలు తగలబెట్టించడం. వీటిన్నింటి గురించి రాష్ట్రపతికి వివరించాను. రాష్ట్ర ప్రభుత్వమే ఇవన్నీ చేస్తుందన్నట్టుగా అనిపిస్తోంది'' అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాష్ట్రపతికి ముందే తెలిసినట్టుగా ఉందని చెప్పుకొచ్చారు. నేను చెప్పాలనుకున్న సమాచారం అంతా రాష్ట్రపతి దగ్గర ముందే ఉందన్నారు. కోర్టు ఆర్డర్ గురించి కూడా రాష్ట్రపతి వాకబు చేశారని.. వాస్తవంగా ఆ విషయం లేఖలో ప్రస్తావించలేదన్నారు. అయినా రాష్ట్రపతే అడిగి మరి తెలుసుకున్నారు. దీని బట్టి అర్థమైంది ఏంటంటే రాష్ట్రపతికి అన్ని విషయాలు ముందుగానే తెలుసు అని అభిప్రాయపడ్డారు.

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

హోదాని పక్కన పెట్టి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన పనికి సలాం

   20 minutes ago


పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

పిలిచి అన్నం పెడితే సున్నం రాస్తారా.. జగన్ పై కేసీయార్ నిప్పులు

   31 minutes ago


విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

విశాఖలో మరో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

   an hour ago


గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.. అగ్నిప్రమాదానికి ఇదా కారణం?

   2 hours ago


మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

మనసులో మాట బయటపెట్టిన జగ్గారెడ్డి

   15 hours ago


సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా

సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా

   15 hours ago


ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

ఈ 3 లక్షణాలు ఉంటే ఆసుపత్రికి పోవలసిందే.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

   16 hours ago


రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ

రికార్డు స్థాయిలో 64వేలకు పైగా కరోనా కేసులు.. ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభణ

   18 hours ago


మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు

మూడురోజుల పాటు తెలంగాణ, ఏపీలో భారీవర్షాలు

   20 hours ago


ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?

ఏపీ గవర్నర్ మార్పు తథ్యమా? బిబి హరిచందన్ స్థానంలో కిరణ్ బేడీ?

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle