newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

అభిమానులకు క్రమశిక్షణ లేదని ఇప్పుడనిపిస్తోందా పవన్?

10-12-201910-12-2019 13:37:54 IST
Updated On 10-12-2019 15:21:28 ISTUpdated On 10-12-20192019-12-10T08:07:54.274Z10-12-2019 2019-12-10T08:07:50.429Z - 2019-12-10T09:51:28.917Z - 10-12-2019

అభిమానులకు క్రమశిక్షణ లేదని ఇప్పుడనిపిస్తోందా పవన్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాన్నాళ్ల తర్వాత ఒక నిజాన్ని బయటపెట్టారు. బయట పెట్టారు అనడం కంటే తన చుట్టూ అభిమానులు చేస్తున్న హడావుడి ఎంత ప్రమాదాలకు దారితీస్తోందో గ్రహించారంటే ఇంకా బాగుంటుంది. రైతులతో సమావేశంలో మాట్లాడుతుంటే సందర్భ శుద్ధి లేకుండా కేరింతలతో ఈలలు వేసిన తన అభిమానులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  పైగా ‘మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోయాను. మీతో నాకు ఇబ్బందిగా ఉంది’ అంటూ ఎన్నాళ్లనుంచో తనలో దాచుకున్న ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలో పర్యటించిన సందర్భంగా స్థానిక బాబు అండ్‌ బాబు కన్వెన్షన్‌ హాలులో రైతులతో జరిగిన సమావేశంలో పవన్‌ మాట్లాడుతుండగా జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కేరింతలతో ఈలలు వేశారు.

దీంతో పవన్‌ స్పందిస్తూ...కార్యకర్తలకు క్రమశిక్షణ ఉండి ఉంటే జనసేన పార్టీ గత ఎన్నికల్లో గెలిచేదని మండిపడ్డారు. సభలో ఎవరూ అరవొద్దని విజ్ఞప్తి చేశారు. 

‘అన్నంపెట్టే రైతు కష్టాలు చెబుతున్నప్పుడు మీరు అరుస్తుంటే నాకు ఎలా వినిపిస్తుంది? నిజంగా ఇబ్బందిగా ఉంది. క్రమశిక్షణ లేకపోతే మీరేమీ చేయలేరు. మీరు సరిగ్గా లేకపోవడం వల్లే నేను ఓడిపోవాల్సి వచ్చింది. అది మర్చిపోకండి. క్రమశిక్షణతో వ్యవహరించి ఉంటే జనసేన గెలిచి ఉండేది’ అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు.

అయితే గత పదేళ్లుగా తన అబిమానులు పలువురి సినిమాల విడుదల సందర్భంగా ఎంత బీభత్సం  సృష్టించారో, నిర్మాతలను, నటీనటులను బహిరంగ సభల్లో ఎంత ఇబ్బంది పెట్టారో దానిపై కూడా పవన్ స్పందించి ఉంటే అలాంటివి మంచిది కాదు నాన్నా అని హితవు పలికి ఉంటే ఇన్నేళ్లుగా తన అభిమానుల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురైన వారందరూ తేలికపడేవారు.

అలాగే గత ఎన్నికల్లో జనం మూడ్ ఒకరకంగా ఉంటే తన ప్రతిమాటకూ, డైలాగుకూ  భూమి బద్దలయ్యేలా అరుస్తూ, చప్పట్లు కొడుతూ తన గెలుపు తధ్యమనేంతగా సీన్ క్రియేట్ చేసి చివరి వరకు తాను భ్రమల్లో కూరుకుపోవడానికి కూడా తన అభిమానులే కారణం అని పవన్ ప్రకటించి ఉంటే ఇంకా బాగుండేది.

పవన్ కల్యాణ్ అలా చేయకపోయినా ఇన్నాళ్లకయినా అభిమానులు క్రమశిక్షణ అతిక్రమిస్తున్నారని గుర్తించి దాన్నిబహిరంగంగా వెల్లడించడం మంచిదే. ఇకఅయినా అభిమానలు పవన్ బహిరంగ సభల్లో అల్లరి మాని బుద్ధిగా ఉంటే జనం కూడా వారిపై, పవన్‌పై తమ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఎంతైనా ఉంది.

ఇకనైనా మారటం, మారినట్లు కనిపించడం పవన్ ఇష్టం. తన ఇభిమానుల ఇష్టం కూడా.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle