newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

అబ్బో బాబు మళ్ళీ వేసేశాడు...

14-12-201814-12-2018 11:34:59 IST
Updated On 14-12-2018 11:35:10 ISTUpdated On 14-12-20182018-12-14T06:04:59.970Z14-12-2018 2018-12-14T06:04:57.246Z - 2018-12-14T06:05:10.727Z - 14-12-2018

అబ్బో బాబు మళ్ళీ వేసేశాడు...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
 "తెలుగు దేశం పోషించిన పాత్రవల్లే రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది"అంటూ  నిన్న విశాఖ జిల్లా తగరపువలసలో ఏర్పాటు చేసిన ఒక సభలో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సెటైర్లను జోడించుకుని  సోషల్ మీడియాలో స్వైరవిహారం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కనీసం తన వాళ్ళను గెలిపించుకోలేని వ్యక్తి ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాల్లో తన ప్రాబల్యం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగిందంటూ గొప్పలు పోవడంలో ఔచిత్యం ఏంటంటూ వ్యాఖ్యానాలు. ఆయనకు అన్నీ తానే చేశానని చెప్పుకునే స్వభావం ఎప్పటినుంచో ఉన్నదేనని, ఇప్పుడు కొత్తగా దాని గురించి చెప్పేదేంటంటూ తెలుగుదేశానికి చెందిన ఒక మాజీ మంత్రి చురకలేశారు. 

హైదరాబాద్ తన సృష్టేనంటూ మొదట్లో ఊదరగొట్టిన బాబు ఆ తరువాత సైబరాబాద్ మాత్రమే తన హయాంలో అభివృద్ధి చెందిందంటూ సరిదిద్దుకోవాల్సి వచ్చింది. హైద్రాబాద్‌లో  సాఫ్ట్‌వేర్ అభివృద్ధి- అందుకు తగిన మౌలిక సౌకర్యాల కల్పనలో ఆయన పాత్రను ఎవరూ తక్కువ చేసి మాట్లాడలేదు. అయితే ఆయన అమరావతి వెళ్లిన తరువాత తరచూ సమావేశాల్లో పదేపదే ‘హైద్రాబాద్ తన సృష్టిగా’ చెప్పడంతో కెసిఆర్ నోటికి దొరికిపోయారు బాబు. ఇక అదే సందర్భంలో తన మాటల్ని బాబు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. తన మాటల్ని తప్పుగా అర్ధం చేసుకున్నారని..తన ఉద్దేశం హైద్రాబాద్ కాదని..సైబరాబాదంటూ సవరించుకున్నారు. 

తెలంగాణలో తెలుగుదేశం ఎదుర్కొన్న ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని దిద్దుబాటలో ఉండాల్సిన నాయకుడు ఇక్కడి వ్యవహారాల్ని పూర్తిగా పక్కన పడేసి ఎక్కడో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తన కృషి వల్లే కాంగ్రెస్ గెలిచిందంటూ లేనిపోని గొప్పలు చెప్పుకోవడం ద్వారా తానే చులకనవుతున్నారని మాత్రం చెప్పవచ్చు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle