newssting
BITING NEWS :
*దిశ కేసులో నలుగురు నిందితులను షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు*దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ *దిశ ఘటన హెచ్చరిస్తోంది - పవన్ కళ్యాణ్ * నర పీడితులకు సరైన శిక్ష పడింది - మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ *దేశంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది, మీరు నిందితులను చంపకూడదు- ఎంపీ మేనకాగాంధీ * దిశకు తగిన న్యాయం జరిగింది - అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, నాని, పూరీజగన్నాధ్ * రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు *దిశ ఘటన తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది - కేజ్రీవాల్*కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్*రేపిస్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. రేపిస్టులపై దయ అవసరంలేదు.. నిందితులు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశమే ఉండకూడదన్న రాష్ట్రపతి *నిందితుల హత్యకేసుపై దిశ తల్లిదండ్రుల స్పందన.. మా బిడ్డకు తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్య

అప్పు ఎలా తీరుస్తారు? స్టేట్ బ్యాంకు ప్రశ్నకు జగన్ షాక్!

04-10-201904-10-2019 12:13:10 IST
2019-10-04T06:43:10.622Z04-10-2019 2019-10-04T06:43:08.507Z - - 06-12-2019

అప్పు ఎలా తీరుస్తారు? స్టేట్ బ్యాంకు ప్రశ్నకు జగన్ షాక్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అప్పు అడిగారు బాగానే ఉంది.. కానీ మీరు ఆ అప్పును ఎలా తీరుస్తారు? అంత భారీ మొత్తాన్ని అప్పు కావాలన్నారు.. అంత భారీ మొత్తానికి తిరిగి ఎలా కడతారు? ఇప్పటికే మీరు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. కొత్తగా ఇంకా కావాలని ఎలా అడుగుతారు? మీ సిబిల్ రేట్ ఏంటో మీరు చూసుకున్నారా? ఇది ఓ సామాన్యుడో.. లేక ఉద్యోగో బ్యాంకుకు అప్పుకోసం వెళ్తే బ్యాంకు అధికారి నుండి వచ్చిన సమాధానం కాదు. అక్షరాలా స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అనబడే ప్రభుత్వ రంగ బ్యాంకు నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చిన సమాధానం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 23వ తేదిన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ పేరున 3 వేల కోట్ల రూపాయల ఋణం కావాలని స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంది. పేరు కార్పొరేషన్ అని అడిగినా అది ప్రభుత్వానికే కనుక ఆ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వడానికి కూడా అంగీకరించినట్లుగా బ్యాంకుకు తెలిపింది. దీనికి ఎస్‌బిఐ అప్పు ఇచ్చేది లేదని తెగేసి చెప్పలేదు కానీ దాదాపుగా అంత పనీ చేసింది. చాంతాడంత లిస్టులో అనేక ప్రశ్నలు సంధించి, సరైన ఆధారాలతో సహా వాటికి జవాబివ్వాలని కోరింది. సెప్టెంబర్‌ 30నే ఎస్‌బిఐ రాసిన ఆ లేఖ కొంచెం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.

అసలు ఈ అప్పు ఏంటి? లేఖ ఏంటి? అన్నది కొద్దిగా వివరాలలోకి వెళ్తే.. ఏ ప్రభుత్వానికైనా ద్రవ్యసంస్థల నుండి నేరుగా రుణం తీసుకోవడానికి ఒక పరిమితి ఉంటుంది. కానీ ఏపీ ప్రభుత్వం ఆ పరిమితిలో అధికభాగం ఇప్పటికే తీసుకోవడంతో వివిధ కార్పొరేషన్ల పేరిట రుణాలు తీసుకుంటుంది. ఆ రుణాలను యధావిధిగా ప్రభుత్వ అవసరాలకే ఉపయోగించుకుంటుంది. ఎలాగూ ఋణం ప్రభుత్వానికే కనుక ఆ ప్రభుత్వమే ష్యూరిటీ ఇస్తుంది. దీనినే ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ అంటారు. ఇలాంటి వారిలో అపార చాణక్యుడైన గత సీఎం చంద్రబాబుకు ఇలాంటి తెలియదా.. గత ప్రభుత్వం ఈ వాడకం కూడా పూర్తిచేసేశారు.

అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే ప్రాసెస్ లో తమకు ఋణం కావాలని గత నెల 23వ తేదిన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ తరపున మూడు వేల కోట్ల రూపాయల రుణానికి దరఖాస్తు చేసుకుంది. కానీ ఎస్బీఐ మాత్రం ఇప్పటి గవర్నమెంట్ ఇస్తామన్న ష్యూరిటీ మీద అనుమానాలు వ్యక్తం చేసింది. ఇప్పటికే మీ రాష్ట్ర సొంత నిధులకూ, అప్పులకు పొంతన లేకుండా పోయిందన్న బ్యాంక్ తన అనుమానాలను తీరిస్తే ఆలోచిస్తామని ఓ జాబితాను సిద్ధం చేసి లేఖను ప్రభుత్వానికి పంపింది.

ఇక ఆ లేఖలో ఏముందంటే.. గత ఆర్థిక సంవత్సరాంతానికి మీ అప్పు రూ2.50 లక్షల కోట్లుంటే ఇప్పుడు అది రూ3 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక 2017లో రూ9,6 కోట్లుగా ఉన్న పూచీకత్తులు 2018 నాటికి రూ.36 కోట్లకు చేరింది. ఇప్పటికే మీ సొంత నిధులతో పోలిస్తే అప్పులు 714 రెట్లు అధికంగా ఉన్నాయి. ఇక ప్రభుత్వ బాండ్లకు క్రిసిల్‌ 'డి' గ్రేడ్‌ ఇచ్చిందంటే మీ బాండ్లకు ఉన్న చెల్లింపుల సామర్ధ్యం ఏమిటో మీరే ఆలోచించుకోండి.

పైగా మీరు గత ప్రభుత్వం ఇచ్చిన ష్యూరిటీని ఆమోదించడం లేదు. కనుక భవిష్యత్ మీద మాకు ష్యూరిటీ ఏంటి? అని బ్యాంక్ విఫులంగా లేఖరాసింది. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమని సమాధానం ఇస్తుందో చూడాల్సి ఉండగా కార్పొరేట్ సంస్థలకు, బడా బడా ఆసాములకు కోటాను కోట్లను అప్పిచ్చి వాళ్ళ చుట్టూ తిరిగీ తిరిగి చివరికి మాఫీలు చేసే బ్యాంకులకు ఇంత తెలివి ఎలా వచ్చిందబ్బా అని సామాన్యులు వాళ్ళను వాళ్లే ప్రశ్నించుకుంటున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle