newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

అప్పుల కుప్పల్లో కాపురం ... ఓట్ల కోసం ముంతలు వొలకబోసుకుంటున్న బాబు

21-02-201921-02-2019 12:07:24 IST
Updated On 22-02-2019 18:46:44 ISTUpdated On 22-02-20192019-02-21T06:37:24.181Z21-02-2019 2019-02-21T06:16:09.964Z - 2019-02-22T13:16:44.708Z - 22-02-2019

అప్పుల కుప్పల్లో కాపురం ... ఓట్ల కోసం ముంతలు వొలకబోసుకుంటున్న బాబు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అప్పుల కుప్పల్లో మునిగిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ ధైర్యంతో వరాల మూటలు విసిరేస్తున్నారో? ఎన్నికల వేళ హామీలు మామూలే అయినా బాబు తీరు చూస్తుంటే ఖజానా ఇక కోలుకోలేదనిపిస్తుంది. ఇటీవల అసెంబ్లీలో ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన 2017-18 ఎకనామిక్ సర్వే ప్రకారం రాష్ట్ర అప్పులు రూ.2,25,234 కోట్లకు పెరిగాయి. ఇప్పటికే 15వేల కోట్ల రూపాయల బిల్లు బకాయిలు పేరుకుపోయాయి. 

ఇంత జరిగినా.. ప్రభుత్వం తన చేతి దురదను వదిలించుకోలేకపోతోంది. ఎంతో కాలంగా బకాయిలు పేరుకుపోయి తమ బిల్లులు చేతిలోపెట్టుకుని సచివాలయం చుటూ చక్కర్లు కొడుతున్న అనేకమంది చిన్నచిన్న గుత్తేదార్ల ముఖాలు చూసేవాళ్ళు లేరు. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ‘అన్నదాత సుఖీభవ’ పేరిట మధ్యంతర బడ్జెట్లో రూ. 5వేల కోట్లను కేటాయించారు. రైతుల రుణ మాఫీ కోసం ప్రభుత్వం ఇప్పటివరకు 22వేల కోట్లు ఖర్చు చేసింది. 

సామాజిక భద్రతా పెన్షన్లను, ఉద్యోగుల వేతనాలను, నిరుద్యోగుల భృతిని అమాంతం పెంచేసిన ప్రభుత్వానికి ఇంతటి ఆదాయం లేదు. మళ్ళీ అప్పు చేయాల్సిందే. ఇంతటి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా వాగ్దానాలు ఎలా చేయగలుగుతోందంటూ ఇవ్వాళ 'ది హిందూ'దినపత్రికలో ఒక చిన్న వ్యాసంలో రచయిత పేర్కొన్నారు. ఒక పక్క విభజన మూలంగా తీవ్రంగా నష్టపోయామని, కేంద్రం నిధులివ్వడం లేదని, ఖజానా ఖాళీ అయిపోయిందని మాటలు చెప్తూ ఎన్నికల వేళ ఇటువంటి సంతర్పణలు చేయడం బాధ్యతారహితమే అవుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిపోతున్న రుణభారం, అప్పుల పరిస్థితిపై సీనియర్ పాత్రికేయులు, విశ్లేషకులు తెలకపల్లి రవి తన అభిప్రాయాలను ‘న్యూస్ స్టింగ్’ ప్రతినిధితో పంచుకున్నారు. ‘‘మళ్ళీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఆశతో ప్రభుత్వాధినేతలు అలవిగాని హామీలు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊబిలో కూరుకుపోయింది. మళ్ళీ ఉచిత హామీలతో భారం మరింత పెరిగిపోతోంది. లోటు బడ్జెట్, కేంద్రం సాయం చేయకపోవడంతో జీతాల కోసమే ప్రభుత్వం అప్పులు చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం పేరుతో మళ్ళీ కొత్త అప్పులు తేవడం మరింత భారంగా మారుతోంది. ఇదేవిధంగా అప్పులు చేసుకుంటే పోతే.. వాటిని తీర్చడానికి ప్రజలమీదే భారం మోపాల్సి పరిస్థితి. ఇది రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు. అప్పులకు వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయడం ఎక్కువైపోయింది. రాష్ట్రానికి ఉన్న వనరులు పెరగవు. చేసిన అప్పుల వల్ల ఉత్సాదకత పెరిగే అవకాశం లేదు. ఇవన్నీ కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలు. లక్షల కోట్ల అప్పుల వల్ల రాష్ట్రం ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి లేదు’’ అన్నారు తెలకపల్లి రవి. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle