newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

అప్పుడు కేబినెట్ బెర్త్ రాకున్నా.. ఇప్పుడు కేబినెట్ ర్యాంకు ద‌క్కింది..!

24-07-201924-07-2019 15:55:08 IST
Updated On 25-07-2019 10:48:35 ISTUpdated On 25-07-20192019-07-24T10:25:08.168Z24-07-2019 2019-07-24T10:25:04.815Z - 2019-07-25T05:18:35.923Z - 25-07-2019

అప్పుడు కేబినెట్ బెర్త్ రాకున్నా.. ఇప్పుడు కేబినెట్ ర్యాంకు ద‌క్కింది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొంద‌రికి ఏటికి ఎదురీదడమే ఇష్టం. అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ శాస‌న‌స‌భ్యులు ప‌య్యావుల కేశ‌వ్ కూడా ఇంతే. రాయ‌ల‌సీమ తెలుగుదేశం పార్టీ నేత‌ల్లో అత్యంత దుర‌దృష్టకరమయిన నేత ఎవ‌రైనా ఉన్నారా అంటే అది కేశ‌వ్ అనే స‌మాధాన‌మే వ‌చ్చేది. అయితే, ఇది నిన్నటి వ‌ర‌కు. ఇప్పుడు ఆయ‌న ఆయన జాత‌కం మార‌నుంది. క్యాబినెట్ ర్యాంక్ ప‌ద‌విలో ఆయ‌న కొలువుదీర‌నున్నారు. పీఏసీ ఛైర్మన్ ప‌ద‌వికి ప‌య్యావుల కేశ‌వ్ పేరును ప్రతిప‌క్ష నేత చంద్రబాబు నాయుడు ఖ‌రారు చేశారు.

అనంత‌పురం జిల్లా తెలుగుదేశం పార్టీ ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క నేత‌. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌కు మంచి ప‌ట్టుంది. మంచి వాక్ఛాతుర్యం ఆయ‌న సొంతం. అధినేత‌కు స‌న్నిహితంగా ఉండే ఆయ‌న‌కు అదృష్టం మాత్రం లేదు. మంత్రి ప‌ద‌వికి అన్ని విధాలుగా ఆయ‌న అర్హులు. కానీ, ఆయ‌నకు ఓ సెంటిమెంట్ ఎప్పుడూ అడ్డొచ్చేది. ఉర‌వకొండ నియోజ‌క‌వ‌ర్గంలో 1999 నుంచి ఓ సెంటిమెంట్ ఉంది. అక్కడ గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదు.

ఈ సెంటిమెంట్‌కు ప్రధాన బాధితుడు ప‌య్యావుల కేశవ్‌. 1994లో మొద‌టిసారి ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచారు. త‌ర్వాత 1999లో ఆయ‌న ఓడిపోగా కాంగ్రెస్ అభ్యర్థి శివ‌రామిరెడ్డి గెలిచారు. కానీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. 2004, 2009 ఎన్నిక‌ల్లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌వాను త‌ట్టుకొని ప‌య్యావుల కేశ‌వ్ గెలిచారు. కానీ, ఈ రెండు ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. దీంతో మూడుసార్లు గెలిచినా కేశ‌వ్‌కు మంత్రి ప‌ద‌వి అంద‌ని ద్రాక్షగానే మిగిలిపోయింది.

ఇక‌, 2014లో త‌న‌కు మంత్రి ప‌ద‌వి ప‌క్కా అని అంతా భావించారు. అయితే, టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చినా ఉర‌వ‌కొండ‌లో మాత్రం ఆయ‌న స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో జిల్లా వ్యాప్తంగా టీడీపీ గాలి వీచినా కేశ‌వ్ మాత్రం ఓడిపోయారు. అప్పుడు ఆయ‌న గెలిచి ఉంటే క‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి ద‌క్కేది. అయినా, కేశ‌వ్‌ను ఎమ్మెల్సీని చేశారు చంద్రబాబు.

ఈ ఎన్నిక‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా జ‌గ‌న్ ప్రభంజ‌నం వీయ‌గా ప‌య్యావుల కేశ‌వ్ అనూహ్యంగా స్వల్ప తేడాతో విజ‌యం సాధించారు. పార్టీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో నాలుగోసారి గెలిచినా ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కలేదు. ఇలా ప‌య్యావుల కేశ‌వ్ క్యాబినెట్ మంత్రి అవుతార‌ని ఆశ‌లు పెట్టుకున్న ఆయ‌న అనుచ‌రులకు ఎప్పుడూ నిరాశే మిగిలేది. ఎట్టకేల‌కు ఆయ‌న‌కు క్యాబినెట్ మంత్రి ప‌ద‌వి ద‌క్కక‌పోయినా క్యాబినెట్ ర్యాంకు క‌లిగిన పీఏసీ ఛైర్మన్ ప‌ద‌వి ద‌క్కనుంది.

ప్రతిప‌క్షానికి ఇచ్చే ఈ ప‌ద‌వి కోసం అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌద‌రి, గంటా శ్రీనివాస‌రావు పేర్లు వినిపించినా చంద్రబాబు మాత్రం కేశ‌వ్ వైపే మొగ్గు చూపారు. అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టడానికి కీల‌క‌మైన ఈ ప‌ద‌విలో కేశ‌వ్ అయితే మేల‌ని భావించిన చంద్ర‌బాబు ఆయ‌న పేరును ఈ ప‌ద‌వికి ఖ‌రారు చేశారు.

ఇలా, ఎట్టకేల‌కు పాతికేళ్ల రాజ‌కీయ జీవితం త‌ర్వాత ప‌య్యావుల క్యాబినెట్ ర్యాంక్ ప‌ద‌వి ద‌క్కించుకుంటున్నారు. టీడీపీ అధికారంలో ఉండగా ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పీఏసీ ఛైర్మన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా పీఏసీ ఛైర్మన్ పదవి రాయలసీమకే దక్కింది. ఇప్పుడు కూడా అంతే!

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle