newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

అప్పుడు ఈసీ బెస్ట్... ఇప్పుడు వేస్టా..?

30-03-201930-03-2019 08:16:57 IST
Updated On 30-03-2019 13:38:45 ISTUpdated On 30-03-20192019-03-30T02:46:57.741Z30-03-2019 2019-03-30T02:46:51.543Z - 2019-03-30T08:08:45.869Z - 30-03-2019

అప్పుడు ఈసీ బెస్ట్... ఇప్పుడు వేస్టా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తాను చేస్తే సంసారం, పక్కవాళ్లు చేస్తే ...అన్నట్టుగా ఉంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు. ఏపీ ఇంటెలిజెన్స్ బాస్ ఏ.బి.వెంకటేశ్వర్రావు పాలక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం ఆయనతో పాటు మరో ఇద్దరు ఎస్పీలను తప్పించింది. దీన్ని బూతద్దంలో పెట్టి చూస్తున్న చంద్రబాబు అండ్ కో గగ్గోలు పెట్టేస్తోంది.

ఇది రాజకీయ కుట్రేనంటూ ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్యక్షంగా అంటోంటే.. ఆ రెండు పత్రికలు, వాటి ఛానెళ్లు ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రచారం చేస్తున్నాయి. చివరికి స్వయంత్రప్రతిపత్తిగల ఎన్నికల సంఘాన్ని ఏపీపై దండయాత్ర చేస్తోంది అని కూడా చంద్రబాబు అనేశారు. చిత్రం ఏంటంటే..ఎన్నికల్లో పోలీస్ బాసులు అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వస్తే.. ఎన్నికల సంఘం వారిని ఎలక్షన్ విధుల నుంచి తప్పిస్తుంది. 

2009లో ఇదే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులను వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తొత్తులుగా వాడుకుంటున్నాడంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఈసీ ఏకంగా నాటి డీజీపీ ఎస్.ఎస్.పి. యాదవ్‌‌ను విధుల నుంచి తప్పించింది. అప్పుడు టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలతో కలిసి మహాకటమి పెట్టిన చంద్రబాబు ఎన్నికల సంఘం తీరును ఆకాశానికి ఎత్తి పొగిడారు. ఎన్నికల వేళ ప్రభుత్వంపై పూర్తి పట్టు ఎన్నికల సంఘానిదే అన్నారు.

కానీ.. అదే ఈసీ ఇప్పుడు ఎస్పీలను బదిలీ చేస్తే కుట్ర, దగా అంటూ కోర్టుకు ఎక్కారు. అంటే.. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈసీ తీసుకున్న నిర్ణయం అద్భుతంగా కనిపించిన చంద్ర‌బాబుకు.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే ఈసీ తన అధికారాన్ని అమలు చేస్తే మాత్రం చంద్రబాబుకు ఘోరంగా కనిపిస్తోంది. కేంద్రం, జగన్ కలిసి తనను ఓడించేందుకు చేస్తున్న కుట్రగా ఆయన భావిస్తున్నారు. బాబు రెండునాల్కల ధోరణిపై విపక్షాలు మండిపడుతున్నాయి. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle