newssting
BITING NEWS :
*దేశంలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.. మొత్తం కేసులు 6, 25,544, యాక్టివ్ కేసులు.. 2,27,439, డిశ్చార్జి అయినవారు 3,79,891 మరణాల సంఖ్య 18,213 *తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు 1213, మొత్తం కేసులు.. 18,570 *ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత.. గుండెపోటుతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి *ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ను ప్రారంభించనున్న సీఎం జగన్ *199వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు*జేఈఈ, నీట్ నిర్వహణపై ఇవాళ నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్రం ఆదేశం *మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఆస్పత్రికి తరలించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ *ఢిల్లీకి వైసీపీ ఎంపీ బృందం... లోక్ సభ స్పీకర్ కు నర్సాపురం ఎంపీపై అనర్హత పిటిషన్ ఇవ్వనున్న ఎంపీలు * *యూపీలో రెచ్చిపోయిన రౌడీ మూకలు..కాల్పుల్లో 8 మంది పోలీసుల మృతి*ఏపీలో 16,097 కి చేరిన పాజిటివ్ కేసులు.. 5868 మంది డిశ్చార్జ్.. 198 మంది మృతి.. చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,559

అప్పుడు ఆమంచి.. ఇప్పుడు వంశీ..!

16-11-201916-11-2019 08:55:37 IST
Updated On 16-11-2019 12:39:39 ISTUpdated On 16-11-20192019-11-16T03:25:37.082Z16-11-2019 2019-11-16T03:25:32.406Z - 2019-11-16T07:09:39.663Z - 16-11-2019

అప్పుడు ఆమంచి.. ఇప్పుడు వంశీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి వెళ్లే ముందు పాత పార్టీపై, నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం, నింద‌లు వేయ‌డం, త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల‌ను ఏక‌ర‌వు పెట్ట‌డం స‌హ‌జ‌మే.

సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్‌, రేవంత్ రెడ్డి వంటి కొంద‌రు ఇందుకు మిన‌హాయింపు అయినా ఎక్కువ మంది మాత్రం అంత కాలం ఉన్న పార్టీపై ఆరోప‌ణ‌లు చేస్తుంటారు. కొత్తగా చేరే పార్టీలో మార్కులు కొట్టేయాల‌నో లేదా ఇంత‌కాలం పాత పార్టీలో అనుభ‌వించిన ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కాల‌నో విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటారు.

అయితే, ఈ విమ‌ర్శ‌ల‌కు ఒక హ‌ద్దు ఉంటుంది. భ‌విష్య‌త్‌లో కాలం ఎలా తిరుగుతుందో అనే భ‌యం, పాత పార్టీపై, అధినేత‌పై గౌర‌వం ఉన్న‌వారు మాత్రం ఇందుకు మిన‌హాయింపు. పార్టీ నుంచి వెళ్లిపోతున్నా విమ‌ర్శ‌లు చేయ‌కుండా వెళ్లిపోతారు.

కానీ, ఎన్నిక‌ల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌, ఇప్పుడు చేర‌బోతున్న వ‌ల్ల‌భ‌నేని వంశీ మాత్రం ఇందుకు భిన్నం. వీరికి భ‌విష్య‌త్‌పై బెంగ లేదు. దూకుడు స్వ‌భావంతో రాజ‌కీయాలు చేసే వ్య‌క్తులు. పార్టీ క‌న్నా వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను న‌మ్ముకునే నేత‌లు.

ఆమంచి కృష్ణ‌మోహ‌న్ చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన నేత‌. ఎన్నిక‌ల వ్యూహాల్లో ఆయ‌న దిట్ట‌. అందుకే నంద్యాల ఉప ఎన్నిక‌లో చంద్ర‌బాబు నాయుడు పిలిచి మరీ ఆమంచికి ప్ర‌త్యేక బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఈ గెలుపులో ఆమంచిది కీల‌క పాత్ర. చంద్ర‌బాబు ఆయ‌న‌కు బాగా ప్రాధాన్య‌త ఇచ్చేవారు. ఆమంచి పార్టీ నుంచి వెళ్లాల‌నుకున్న‌ప్పుడు ఆయ‌న‌ను బుజ్జ‌గించేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. కానీ, ఆమంచి విన‌కుండా వైసీపీలో చేరిపోయారు.

ఆమంచి వెళుతూ టీడీపీలో త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని చెబుతూ విమ‌ర్శ‌లు చేశారు. దీనికి టీడీపీ ప్ర‌తివిమ‌ర్శ‌లు చేసింది. త‌న‌ను ఇంత‌కాలం వాడుకొని త‌న‌పై ఇంత‌లా విమ‌ర్శ‌లు చేస్తారా అనే కోపంతో ఆమంచి విజృంభించారు.

చంద్ర‌బాబు నాయుడు స్వ‌భావం ఇదీ, టీడీపీలో ఇలా జ‌రుగుతోంది అంటూ పార్టీ అంత‌ర్గ‌త విష‌యాల‌ను సైతం బ‌య‌ట‌పెట్టారు. దీంతో అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ఆమంచి ప్ర‌త్యేకంగా టార్గెట్ చేసి మ‌రీ చీరాల‌లో ఓడించింది. ఇలా అధికార పార్టీ టార్గెట్ చేసి ఉండ‌క‌పోతే త‌న‌కున్న ఇమేజ్‌, జ‌గ‌న్ వేవ్‌తో సునాయ‌స‌నంగా ఆమంచి కృష్ణ‌మోహ‌న్ గెలిచేవారు.

ఇక‌, ఇప్పుడు వ‌ల్ల‌భ‌నేని వంశీ అయితే ఆమంచిని మించిపోయారు. వ‌ల్ల‌భ‌నేని కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టున్న నేత‌. జ‌గ‌న్ ప్ర‌భంజ‌నానికి ఎదురెళ్లి గ‌న్న‌వ‌రంలో విజ‌యం సాధించారు.

అయితే, అధినేత వ‌ద్ద ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌తంగా మంచి అభిప్రాయం, ప్రాధాన్య‌త ఉన్నా జిల్లా పార్టీ ముఖ్యుల‌తో ఏ మాత్రం పొస‌గ‌లేదు. వంశీని బుజ్జ‌గించేందుకు చంద్ర‌బాబు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోవ‌డంతో ఆయ‌న టీడీపీకి గుడ్‌బై చెప్పారు.

వెళుతూ పార్టీపై, చంద్ర‌బాబు, లోకేష్‌పై విమ‌ర్శ‌లు చేశారు. వంశీది దూకుడు స్వ‌భావం. ఈ విష‌యం టీడీపికి బాగా తెలుసు. దీంతో వంశీ వ్య‌వ‌హారంలో న‌లుగురు ఎంపీలు పార్టీ మారిన‌ప్పుడు స్పందించిన‌ట్లుగా స్పందిస్తే అయిపోయేది.

కానీ, విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తివిమ‌ర్శ‌లు గుప్పించే ప్ర‌య‌త్నం చేసింది. స‌హ‌జంగానే వంశీకి కోపం ఎక్కువ‌. పైగా 15 ఏళ్లుగా టీడీపీలో ఉంటున్న త‌న‌కు ఆ పార్టీలోని లోటుపాట్లు అన్నీ తెలుసు.

దీంతో ఒక్క‌సారిగా రెచ్చిపోయారు. టీడీపీకి శ‌త్రువుగా మారిపోయారు. విమ‌ర్శ‌లు దాటి తిట్ల దండ‌కాన్ని అందుకున్నారు. లాజిక‌ల్‌గా మాట్లాడే మాట‌కారి కావ‌డంతో టీడీపీ వంశీకి స‌రైన కౌంట‌ర్ ఇవ్వ‌లేక‌పోతోంది.

ఎవ‌రు వంశీపై మాట్లాడితే వారి గురించి వంశీ అంత‌ర్గ‌త విష‌యాలు, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో వంశీకి కౌంట‌ర్ ఇచ్చేందుకు నేత‌లు ముందుకు రాని ప‌రిస్థితి.

ఎన్నిక‌ల ముందు ఇలానే ఆమంచితో ఇబ్బంది ప‌డ్డ టీడీపీ ఇప్పుడు వంశీ విష‌యంలోనూ ఇబ్బంది ప‌డుతోంది. వంశీ మాట‌లు, తిట్ల వ‌ల్ల ఆయ‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్ త‌గ్గినా అంత‌కు మించి తెలుగుదేశం పార్టీకి న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంది. మ‌రి, వంశీ వ్య‌వ‌హారాన్ని టీడీపీ ఇప్ప‌టికైనా ప‌క్క‌న‌పెడుతుందా లేదా కొన‌సాగించి మ‌రింత ప‌లుచ‌న అవుతుందా చూడాలి.

ఇక‌, టీడీపీ వ్య‌వ‌హారం చూస్తున్న వైసీపీ ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌, వ‌ల్ల‌భ‌నేని వంశీ విష‌యంలో కొంత జాగ్ర‌త్త‌గా ఉంటే మేల‌ని రాజ‌కీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. లేక‌పోతే ఇప్పుడు టీడీపీ ప‌రిస్థితి రేపు వైసీపీ రాద‌నే న‌మ్మ‌కం లేదు క‌దా.

 

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

ఈఎస్ఐ స్కాం... అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరణ

   4 hours ago


సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

సీఎం జగన్ పై పవన్ ప్రశంసలు.. ఆ నిర్ణయం అభినందనీయం

   4 hours ago


వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

వరదలతో అసోం విలవిల.. 34మంది మృతి

   4 hours ago


ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

ప్రగతి భవన్‌ను తాకిన కరోనా సెగ.. ఐదుగురికి పాజిటివ్

   8 hours ago


ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

ఏపీలో కరోనా నివారణకు అన్ లాక్ 2.0 మార్గదర్శకాలు

   10 hours ago


హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

హైకోర్టుకి ఎంపీ... అనర్హత, సస్పెన్సన్ అడ్డుకోవాలని రఘురామ పిటిషన్

   13 hours ago


కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

కేబినెట్ విస్తరణకు జగన్ రెడీ.. బెర్త్‌లు దక్కే అదృష్టవంతులెవరో?

   13 hours ago


కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

కలవరం కలిగిస్తున్న కరోనా భూతం .. సగం హైదరాబాద్ ఖాళీ

   14 hours ago


ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

ఆ మూడు విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఫుల్ మార్కులు ప‌డ్డ‌ట్లే..!

   15 hours ago


ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

ప‌ట్టు కోల్పోతున్న చోట మ‌ళ్లీ క‌విత న‌జ‌ర్‌..!

   15 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle