newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

అప్పటి స్పీకర్ కొడుకే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్

18-06-201918-06-2019 14:56:08 IST
Updated On 21-06-2019 15:23:58 ISTUpdated On 21-06-20192019-06-18T09:26:08.942Z18-06-2019 2019-06-18T09:26:06.661Z - 2019-06-21T09:53:58.474Z - 21-06-2019

అప్పటి స్పీకర్ కొడుకే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ప్రతిపక్షనేత చంద్రబాబు తదితరులు కోన రఘుపతిని స్పీకర్‌ స్థానం దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు.

బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల అనంతరం కోన రఘుపతి స్పీకర్ అవుతారని వార్తలు వచ్చాయి. అయితే స్పీకర్ గా తమ్మినేని సీతారాంని ఎంపికచేసిన సీఎం జగన్. డిప్యూటీ స్పీకర్ అవకాశాన్ని గుంటూరు జిల్లాకు ఇచ్చారు. గతంలో స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ రావుది కూడా గుంటూరు జిల్లా కావడం విశేషం. 

ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ అయిన కోన రఘుపతి రాజకీయ కుటుంబానికి చెందిన వారు. ఆయన తండ్రి కోన ప్రభాకరరావు 1967, 1972, 1978 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా, స్పీకర్‌గా, మహారాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు.

అప్పుడు తండ్రి స్పీకర్‌గా పనిచేయగా.. కొడుకు కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక కావడం విశేషంగా చెబుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నిక సమయంలో ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టేందుకు తన పార్టీ ఎమ్మెల్యేలను పంపిన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఈసారి తనే స్వయంగా హాజరు కావడం విశేషం.  డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో మళ్లీ వివాదం ఉండకూడదని భావించిన చంద్రబాబు.. కోన రఘుపతిని స్పీకర్ చైర్‌లో కూర్చోబెట్టేందుకు జగన్‌తో కలిసి వెళ్లారు. 

కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకర్ రావు 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle