newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

అన్నీ విన్నారు.. జ‌గ‌న్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా..?

28-08-201928-08-2019 08:13:15 IST
Updated On 28-08-2019 15:21:32 ISTUpdated On 28-08-20192019-08-28T02:43:15.904Z28-08-2019 2019-08-28T02:42:26.405Z - 2019-08-28T09:51:32.329Z - 28-08-2019

అన్నీ విన్నారు.. జ‌గ‌న్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ జ‌గ‌న్‌తో స‌ఖ్య‌త‌గా ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇప్పుడు ఆయ‌న‌ను శ‌త్రువుగా భావిస్తోంది. రాష్ట్రంలో బ‌లోపేతం కావాల‌నే ల‌క్ష్యంతో ఉన్న ఆ పార్టీ.. వైసీపీని టార్గెట్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంది.

టీడీపీ కంటే ఎక్కువ‌గా వైసీపీపై విమ‌ర్శ‌లు చేయ‌డం ద్వారా నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించాల‌ని ఆ పార్టీ నేత‌లు అనుకుంటున్నారు. అందుకు త‌గ్గ‌ట్లుగా ఇటీవ‌ల వైసీపీపై విమ‌ర్శ‌ల స్పీడ్ పెంచారు. ఇదంతా కేంద్ర పెద్ద‌ల ఆదేశాలు, మార్గ‌ద‌ర్శ‌కంతోనే అనేది వేరే చెప్ప‌క్క‌ర్లేదు.

ఇటీవ‌ల జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌కు కూడా కేంద్రం మోకాల‌డ్డుతోంది. పీపీఏల స‌మీక్ష‌, పోల‌వ‌రం రివ‌ర్స్‌టెండ‌రింగ్ వంటి వాటి ప‌ట్ల కేంద్రం జ‌గ‌న్ నిర్ణ‌యాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం లేదు. దీంతో రాష్ట్ర బీజేపీ నేత‌లు సైతం ఈ విష‌యాల‌పై జ‌గ‌న్ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

తాజాగా రాజ‌ధాని వ్య‌వ‌హారంలో తెలుగుదేశం కంటే బీజేపీనే దూకుడుగా వెళుతోంది. రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్య‌టించి రాజ‌ధాని ఎక్క‌డికి వెళ్ల‌ద‌ని, వెళితే బీజేపీ చూస్తూ ఊరుకోద‌ని భ‌రోసా ఇస్తున్నారు.

ఎన్నిక‌ల త‌ర్వాత జ‌గ‌న్ స‌ర్కార్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని నరేంద్ర మోడీ, అమిత్ షా చెప్పినా నిధుల విష‌యంలో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కైతే ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

ఇక‌, జ‌గ‌న్ నిర్ణ‌యాల‌కు కూడా కేంద్రం నుంచి సానుకూల‌త ల‌భించ‌క‌పోవ‌డం, పైగా ఈ అంశాల‌ను బీజేపీ రాజ‌కీయంగా వాడుకుంటుండ‌టం జ‌గ‌న్‌ను డిఫెన్స్‌లో ప‌డేసింది. కేంద్రంతో స‌త్సంబంధాల‌తోనే ప‌నులు జ‌రిపించుకోవాల‌నేది జ‌గ‌న్ విధానం.

దీంతో ఆయ‌న మ‌రో ప్ర‌య‌త్నంగా ఢిల్లీ వెళ్లి వ‌చ్చారు. కేంద్ర మంత్రుల‌కు సావ‌ధానంగా త‌మ వాద‌న వినిపించి వారిని ఒప్పించేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నించారు. అమిత్ షాతో సుమారు గంట పాటు జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు.

తాను తీసుకునే నిర్ణ‌యాలు ఎందుకు అవ‌స‌ర‌మో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, అమిత్ షా నుంచి ఎటువంటి భ‌రోసా వ‌చ్చిందో రానున్న రోజుల్లో జ‌గ‌న్ అడుగుల‌ను బ‌ట్టి తెలియ‌నుంది.

ఇక‌, పోల‌వ‌రం విష‌యంలో జ‌గ‌న్ మ‌రింత సీరియ‌స్‌గా ఉన్నారు. రివర్స్ టెండ‌రింగ్‌కు కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ శేకావ‌త్ అస‌లు ఇష్ట‌ప‌డ‌టం లేదు. దీంతో ఆయ‌న‌ను సైతం జ‌గ‌న్ నేరుగా క‌లిసి న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

రివర్స్ టెండ‌రింగ్ వ‌ల్ల ప‌నులు ఆల‌స్యం కావ‌ని, వ్య‌యం కూడా పెర‌గ‌ద‌ని ఆయ‌న హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌నే నేరుగా రాష్ట్రానికి వ‌చ్చి పోల‌వ‌రం ప్రాజెక్టును ప‌రిశీలించాల‌ని జ‌గ‌న్ కోరారు.

అయితే, అమిత్ షా, గ‌జేంద్ర సింగ్ వ‌ద్ద నుంచి ఇప్ప‌టికైతే జ‌గ‌న్ ఆశిస్తున్న ప్ర‌క‌ట‌న‌లు ఏమీ రాలేదు. మ‌రి, ఒక నిర్ణ‌యం తీసుకుంటే ఎటువంటి ప‌రిస్థితులు ఎదురైనా ముందుకెళ్లే స్వ‌భావం ఉండే జ‌గ‌న్‌.. ఇన్నిసార్లు విన‌వించినా కేంద్రం నుంచి సానుకూల‌త రాక‌పోతే ఏం చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

 

జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

   an hour ago


తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు..

   an hour ago


ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

ఆ రెండు జ‌రిగితే రాపాక ఫుల్ హ్యాపీ అంట‌..!

   2 hours ago


విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

విద్యార్థి సంఘం.. విద్యార్థుల పోరాటం అంటే ఇలానే ఉండాలి క‌దా..!

   2 hours ago


 జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

జీవ‌న్ రెడ్డి ఇచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టిక్కెట్ రేస్‌

   2 hours ago


  పైలెట్ ని క్షమించేద్దాం.. అశోక్ గెహ్లాట్

పైలెట్ ని క్షమించేద్దాం.. అశోక్ గెహ్లాట్

   4 hours ago


సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

సీతానగరం శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి సీరియస్

   15 hours ago


తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

తెలంగాణలో కరోనా కేసులు.. తగ్గిన కంటైన్మెంట్ జోన్లు

   16 hours ago


ఇళ్ళ పట్టాల పంపిణీ  మళ్లీ మళ్లీ వాయిదా

ఇళ్ళ పట్టాల పంపిణీ మళ్లీ మళ్లీ వాయిదా

   16 hours ago


విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

విద్యార్ధుల ప్రాణాలు కంటే పరీక్షలే ముఖ్యమా?

   18 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle