newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

అన్నా క్యాంటీన్లు కాదు.. ఇక రాజన్న క్యాంటీన్లు

01-06-201901-06-2019 07:46:48 IST
Updated On 25-06-2019 13:21:18 ISTUpdated On 25-06-20192019-06-01T02:16:48.079Z01-06-2019 2019-06-01T02:16:43.299Z - 2019-06-25T07:51:18.989Z - 25-06-2019

అన్నా క్యాంటీన్లు కాదు.. ఇక రాజన్న క్యాంటీన్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హ‌యాంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్ల రూపురేఖ‌లు మారుతున్నాయి. వాటిని రాజ‌న్న క్యాంటీన్లుగా నామ‌క‌ర‌ణం చేయ‌నుంది కొత్త ప్ర‌భుత్వం. అలాగే- అన్న క్యాంటీన్ల‌కు వేసిన ప‌సుపురంగు స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌తాకంలో ఉన్న రంగుల‌ను వేస్తున్నారు.2014లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్పడిన త‌రువాత‌.. రాజీవ్ ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి ఎన్టీఆర్ పేరును పెట్టిన విష‌యం తెలిసిందే. 

రాజీవ్ గాంధీ లేదా కాంగ్రెస్ పెద్ద‌ల పేర్ల‌తో దివంగ‌త ముఖ్యమంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న ప్ర‌భుత్వ హ‌యాంలో అమ‌లు చేసిన ప‌థ‌కాల‌కు చంద్ర‌బాబు పేర్లను మార్చారు. ఎన్టీఆర్, లేదా త‌న పేరును పెట్టుకున్నారు. చంద్ర‌న్న కానుక‌ అంటూ వాటిని అమ‌లు చేశారు.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అందుకుంది.

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టారు. ఇక త‌న తండ్రి హ‌యాంలో ఆరంభ‌మైన ప‌థ‌కాల‌తో పాటు- తెలుగుదేశం పార్టీ అమ‌లు చేసిన అన్నక్యాంటీన్ల వంటి ఒక‌టి, అరా ప‌థ‌కాల‌కు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేరును పెట్ట‌బోతున్నారు. రాజ‌న్న క్యాంటీన్ అని పేరు పెట్టి, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిలువెత్తు చిత్ర‌ప‌టాన్ని త‌గిలించిన రాజన్న క్యాంటీన్ ఫోటో వైరల్ అవుతోంది.

గతంలో మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కె ఏర్పాటుచేసిన క్యాంటీన్ ఫోటో. తాజాగా నరసరావుపేటలో అన్నా క్యాంటీన్ పేరు మార్చేసి రాజన్న క్యాంటీన్ అని బోర్డు తగిలించారు అదీ సంగతి ! మొత్తం మీద మళ్ళీ రాజన్ప రాజ్యం రాబోతోందని వైసీపీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle