newssting
BITING NEWS :
*శాసనమండలి రద్దుకి జగన్ తీర్మానం..ఆమోదం *భోగాపురం పోర్ట్‌, మచిలీపట్నం ఎయిర్‌పోర్ట్‌లపై చర్చించనునున్న కేబినేట్‌*ఏపీలో నేటి శాసనసభ సమావేశాలకు టీడీపీ దూరం*ఆంధ్రప్రదేశ్‌: నేడు ఉదయం 11గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు*దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు *అసోంలో బాంబుపేలుళ్ళు *హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో భరతమాత మహా హారతి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ తమిళిసై*మేడారం జాతరకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆహ్వానం. సమ్మక్క... సారలమ్మ జాతరకు రావాలని ఆహ్వానం. ఆహ్వానించిన మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్*మండలి రద్దు జగన్ అనుకున్నంత సులభంకాదన్న నేతలు. కేంద్రం అంత సులభంగా రద్దుపై నిర్ణయం తీసుకోదు *ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమం. రాజకీయ, వివిధ రంగాల్లోని ప్రముఖులకు గవర్నర్ విందు. ఎట్ హోమ్ కు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, స్పీకర్ తమ్మినేని, మండలి చైర్మన్ షరీఫ్ *సెలక్ట్ కమిటీ ఏర్పాటులో తోలి అడుగు. కమిటీకి సభ్యుల పేర్లను ఇవ్వాలని పార్టీలకు చైర్మన్ లేఖ*ఏపీలో స్పీకర్, ఛైర్మన్లతో విడి విడిగా భేటీ అయిన గవర్నర్..కీలక సమయంలో స్పీకర్, ఛైర్మన్లతో గవర్నర్ భేటీపై ఆసక్తి

అన్నా అంటూనే తప్పించేశారు.. కోటరీకి సీఎస్ బలి

06-11-201906-11-2019 07:09:32 IST
2019-11-06T01:39:32.075Z06-11-2019 2019-11-06T01:39:27.679Z - - 27-01-2020

అన్నా అంటూనే తప్పించేశారు.. కోటరీకి సీఎస్ బలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల సంఘం స్వయంగా నియమించిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంని అవమానకరమైన రీతిలో పదవినుంచి తప్పించిన తీరు జాతీయ వ్యాప్తంగా సంచలనానికి దారితీస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఎల్వీని అన్నా అంటూ తలపై పెట్టుకున్న జగన్, ప్రధానితో భేటీకి ఎప్పుడూ లేనట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తన వెంటబెట్టుకుని గౌరవించిన జగన్ ఆరునెలలు కాకముందే నిర్దాక్షిణ్యంగా సీఎస్‍‌ను పక్కన బెట్టడం ఉన్నతాధికారుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 

కేంద్రంలో కానీ, రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వాలు నియమించుకునే పీఎంఓలు, సీఎంఓలకు అపరిమిత అధికారాలు ఉంటోన్న విషయం తెలీంది కాదు. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పూచికపుల్లలాగా తీసిపడేయకుండా విధివిధానాల్లో నియమ భంగం గురించి ప్రశ్నించిన నేరానికి సీఎస్‌నే తప్పించిన వైనం దేశచరిత్రలో ఎన్నడూ జరగలేదు. సాక్షాత్తూ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వంటి సౌమ్యుడే వైఎస్ జగన్ నిర్ణయాన్ని తప్పుపడాల్సి వచ్చిందంటే ఏపీ పాలనా వ్యవస్థలో అంతర్గత పోరు ఏ స్థాయికి చేరుకుందో స్పష్టమవుతూనే ఉంది.

దీనికంటే మించిన వ్యవహారం పేషీ ముఖ్య కార్యదర్శిగా ఇటీవలే నియమితులైన ప్రవీణ్ ప్రకాష్ ఢిల్లీలోని ఏపీ రెసిడెన్సీలో పనిచేస్తున్నప్పుడు జరిగిన అవకతవకలపై సాధారణ పోలీసు అధికారితో విచారణ జరిపించి మరీ అవమానించిన వైకాపా ప్రభుత్వం అదే వ్యక్తిని నేరుగా సీఎం పేషీలోకి తీసుకురావడం ఒక ఎత్తైతే సీఎస్‌నే ధిక్కరించేలా ప్రొటోకాల్‌ని  సైతం పక్కనబెడుతూ అపరిమితాధికారాలను కట్టబెట్టడం మరొక ఎత్తు. 

దీనిఫలితమే ఏ ప్రభుత్వ కార్యదర్శికీ జరగని అవమానం ఎల్వీకి జరిగిపోయింది.  ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు, విభజన సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించేందుకు ఎల్వీ సుబ్రమణ్యం ఆదివారం హైదరాబాద్‌ వెళ్లారు. సోమవారం ఆయన అక్కడ ఉండగానే బదిలీ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.

ముఖ్యమంత్రిని నేను చెబితే కూడా చేయరా అంటూ జగన్ చాన్నాళ్లక్రితమే ఐఏఎస్ అధికార్లపై, సాక్షాత్తూ సీఎస్‌నే గద్దించిన విషయం కూడా మీడియాలో వచ్చింది. ప్రోటోకాల్‌ను ధిక్కరించి ముఖ్యమంత్రులు సంతకం పెట్టమన్న చోట్లల్లా గుడ్డిగా సంతకాలు పెట్టిన ఐఏఎస్ అధికారులు ఎలా శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వచ్చిందో వైస్ రాజశేఖర రెడ్డి పాలన తేటతెల్లం చేసింది. 

ఆ ఉదంతంతో గట్టి గుణపాఠాలు నేర్చుకున్న ఐఏఏస్ అధికారులు గత చంద్రబాబు పాలనలో కూడా ప్రభుత్వ నిర్ణయాలకు తలాడించకుండా కొర్రీలు పెట్టారు. తమ విధివిధానాలకు భిన్నమైన నిర్ణయాలను ఆమోదించలేమని గత ప్రభుత్వ కార్యదర్శులే నిరసన తెలిపారు. దీంతో చంద్రబాబు కేబినెట్ ఆమోదంతో, సీఎస్ అనుమతితో నిమిత్తం లేకుండా కీలక నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయించడం కూడా తెలుసు. 

అలాంటి ఐఏఎస్ అధికారులే ఇప్పుడు వైకాపా ప్రభుత్వం ఎల్వీ సుబ్రహ్మణ్యంను అంత ఘోరంగా అవమానించడం చూసి తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వంలో కోటరీ రాజకీయాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే ఇలా బలితీసుకోవడం సరైందేనా అంటూ ఉన్నతాధికారులు ఆగ్రహిస్తున్నారు. ముఖ్యంగా వైకాపా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మద్దతు కలిగిన ప్రవీణ్ ప్రకాష్ ఇష్టానుసారంగా ఇచ్చిన ఆదేశాలను ప్రశ్నించిన పాపానికి సీఎస్ ను బలిచేయడం జరిగిందని ఐఏఎస్ అధికారులు వాపోతున్నట్లు సమాచారం. 

వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఆప్తుడిగా కొనసాగి కేసులు కూడా పెట్టించుకున్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చివరకు వైకాపాలోని కోటరీ రాజకీయాలకు ఇలా బలికావడం చాలామంది అధికారులకు విచారం కలిగించింది. తన నిర్ణయాలను అమలు చేయడం లేదనో, అడ్డు తగులుతున్నారనో సీఎంకి అనిపిస్తే నేరుగా పిలిపించి పదవీ మార్పు గురించి మాట్లాడి తర్వాత నిర్ణయం తీసుకుని ఉంటే ప్రభుత్వ కార్యదర్శి హోదాకు కాస్తయినా గౌరవం మిగిలి ఉండేదని అధికారులు వాపోతున్నారు..

ఎల్వీ సుబ్రహ్మణ్యం వంటి సౌమ్యుడికే ప్రభుత్వ వ్యవస్థలో ఇలాంటి అవమానం జరిగితే అలాంటి ప్రభుత్వం ఇంకెన్ని ఘోరాలకు తలపెడుతుందో అన్న అనుమానం ఉన్నతాధికారుల్లో పొడసూపుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో కానీ ప్రభుత్వం పాలనా వ్యవస్థకు ఇది ఏమాత్రం మంచిది కాదని వీరు భావిస్తున్నారు.

 

హైకోర్టు మెట్లెక్కిన సీఎం జగన్.. వ్యక్తిగత మినహాయింపుకోసం అభ్యర్ధన

హైకోర్టు మెట్లెక్కిన సీఎం జగన్.. వ్యక్తిగత మినహాయింపుకోసం అభ్యర్ధన

   5 hours ago


శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

శాసనమండలి రద్దుపై విపక్షాల ఆగ్రహం..ఎవరెవరు ఏమన్నారంటే..

   7 hours ago


రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

రాజన్నరాజ్యం అంటే ఇదేనా..? జగన్ పై వంగవీటి రాధా ఫైర్

   8 hours ago


హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

హాజీపూర్ కేసులో తుది తీర్పు ఫిబ్రవరికి 6కి వాయిదా!

   10 hours ago


కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

కోమటిరెడ్డి రాజగోపాల్ అరెస్ట్...చౌటుప్పల్‌లో టెన్షన్ టెన్షన్

   10 hours ago


లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

లోకేష్ పై ఎమ్మెల్యే రోజా ఫైర్.. బలిసిన కోడి అంటూ చురకలు

   10 hours ago


శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

శాసనమండలి రద్దుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

   10 hours ago


ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

ఎయిర్ ఇండియా కథ అంతేనా? కొనేది ఎవరో?

   14 hours ago


కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

కేబినెట్ భేటీపై ఉత్కంఠ.. మండలి రద్దేనా?

   14 hours ago


జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

జూప‌ల్లిపై జాలి చూపేదే లేదా..?

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle