newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

అన్నరాడని తేల్చేసిన తమ్ముడు

05-04-201905-04-2019 08:41:38 IST
Updated On 05-04-2019 11:24:48 ISTUpdated On 05-04-20192019-04-05T03:11:38.176Z05-04-2019 2019-04-05T03:11:16.309Z - 2019-04-05T05:54:48.177Z - 05-04-2019

 అన్నరాడని తేల్చేసిన తమ్ముడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో జనసేన ఎలాగైనా తన సత్తా చాటాలని అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఎన్నికల ప్రచారానికి ఇక నాలుగు రోజులే వున్నాయి. దీంతో జనసేన తరఫున ఎవరైనా పెద్ద తారలు వచ్చి ప్రచారం చేస్తారని భావిస్తున్నారు. అయితే జనసేన అభిమానులు అడియాశలేనని అర్థం అవుతోంది. అన్నయ్య చిరంజీవి గ్లాసు గుర్తుకోసం ప్రచారం చేసే అవకాశాలు లేవని అర్థం అవుతోంది. 

రాజ్యసభ మాజీ సభ్యుడు,మెగాస్టార్ చిరంజీవి జనసేన తరపున ప్రచారం నిర్వహించే విషయమై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్  ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. తాజాగా పవన్ ఓ ఛానెల్ కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజకీయాల విషయంలో ఎవరి విధానం వారిదని, పాలిటిక్స్‌లో తమ అన్నదమ్ముల మధ్య స్పష్టత ఉందన్నారు. ఆయన ఓ కళాకారుడు..నేను కళాకారుణ్ణి కాదు..అంతే తేడా. అని అన్నారు.

ఎన్నికల విషయంలో తాము స్పష్టంగా ఉన్నామన్నారు పవన్. ‘‘జనసేన పార్టీ తరపున ప్రచారానికి అన్నయ్య వచ్చే అవకాశం లేదు. ఆయన పొలిటికల్ కన్‌క్లూజన్ తీసేసుకున్నారు’’ అంటూ పవన్ కల్యాణ్  స్పష్టం చేశారు. జనసేన తరఫున పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాకలో రెండుచోట్ల పోటీచేస్తున్నారు.

పవన్ సోదరుడు నాగబాబు నర్సాపురం నుంచి లోక్ సభకు పోటీచేస్తున్నారు. కూతురు నిహారిక, కొంతమంది బుల్లితెర తారలు, జబర్ధస్త్ ఆర్టిస్టులు మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు. చిరంజీవి వస్తే పార్టీపై వ్యతిరేక ప్రభావం కనిపిస్తుందని తెలియడంతో చిరంజీవి జనసేనకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. మొత్తం మీద అన్నయ్య రాడని తేల్చడంతో పవన్-నాగబాబు మాత్రమే ప్రచారంలో వున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle