newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

అన్నబాటలో తమ్ముడు.. భీమవరం, గాజువాకలో పోటీ

19-03-201919-03-2019 12:28:00 IST
Updated On 19-03-2019 17:24:36 ISTUpdated On 19-03-20192019-03-19T06:58:00.171Z19-03-2019 2019-03-19T06:57:58.345Z - 2019-03-19T11:54:36.209Z - 19-03-2019

అన్నబాటలో తమ్ముడు.. భీమవరం, గాజువాకలో పోటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేయబోతున్నారు..? ఇదే అంశంపై గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతోంది. పార్టీ కార్యవర్గం నిర్ణయం మేరకు భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

గతంలో భీమవరం, పిఠాపురం, గాజువాక అని వార్తలు వచ్చాయి. తర్వాత ఏలూరు, అనంతపురం, ఇచ్చాపురం, కర్నూలు, తిరుపతి నియోజకవర్గాలు కూడా తెరమీదకు వచ్చాయి. చివరాఖరికి గాజువాక సీటు కన్ ఫర్మ్ అయింది. ఆయన రెండు అసెంబ్లీ స్థానాల్లో ఈ సారి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుందని పవన్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. గాజువాక పారిశ్రామిక ప్రాంతం కావడంతో.. వామపక్షాల పొత్తు కార్మిక వర్గ ఓటు బ్యాంకును సొంతం చేసుకోవచ్చంటున్నారు. భీమవరంలో కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండడంతో పార్టీ భీమవరం వైపు మొగ్గుచూపింది. 

గాజువాకతో పాటు తిరుపతి స్థానం నుంచి పవన్ పోటీచేయాలని తొలుత భావించారు. 2009 ఎన్నికల్లో పవన్ అన్నయ్య చిరంజీవీ పీఆర్పీ తరఫున పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీచేసిన సంగతి తెలిసిందే. అయితే పాలకొల్లులో బంగారు ఉషారాణి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. తిరుపతిలో విజయం సాధించారు. ఇప్పుడు తమ్ముడు పవన్ కూడా తిరుపతిలో పోటీచేయడానికి రెడీ కావాలని భావించినా పార్టీ అధిష్టానం మాత్రం తిరుపతిని తప్పించింది. 

గాజువాక నుంచి ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన చింతలపూడి వెంకట్రామయ్య గతేడాది జనసేనలో చేరారు. గాజువాక నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుని గ్రౌండ్‌ వర్క్‌ కూడా పూర్తి చేసుకున్నారు. పవన్‌ దృష్టి గాజువాకపై పడిందని తెలియడంతో ఆయన.. పక్కనే ఉన్న పెందుర్తిపై ఫోకస్‌ పెట్టారు. కాపులు అధికంగా ఉన్న పెందుర్తిలో పరిస్థితి సానుకూలంగా ఉంటుందన్న నమ్మకంతో అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈక్రమంలోనే జనసేన రెండో జాబితాలో చింతలపూడి వెంకట్రామయ్యకు పెందుర్తి టికెట్‌ను ఖరారు చేశారు.

గాజువాక విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలే ఇక్కడ ప్రధానంగా పోటీ పడ్డాయి. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు. గాజువాక నుంచి వైసీపీ తరఫున తిప్పల నాగిరెడ్డి, బీజేపీ నుంచి పులుసు జనార్దన్‌ పోటీ చేయబోతున్నారు. గాజువాకలో అనూహ్యంగా చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకే సీటిచ్చారు.

ఇటు భీమవరం సీటులో పవన్ గెలవడం అంత ఆషామాషీ కాదంటున్నారు. అక్కడ టీడీపీ, వైసీపీ మధ్య బలమయిన పోటీ ఉంది. ఈ పోటీ మధ్య భీమవరం పవన్ కళ్యాణ్ కి ఏమేరకు కలిసి వస్తుందో చూడాలి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle