newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

అన్నగారికి అవమానం .. నిలువెత్తు విగ్రహం మాయం

10-01-202010-01-2020 12:30:48 IST
Updated On 10-01-2020 13:45:53 ISTUpdated On 10-01-20202020-01-10T07:00:48.216Z10-01-2020 2020-01-10T07:00:46.331Z - 2020-01-10T08:15:53.444Z - 10-01-2020

అన్నగారికి అవమానం .. నిలువెత్తు విగ్రహం మాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ప్రభుత్వం మెరుపు వేగంతో రాజధాని కార్యకలాపాలను సాగించాలని ఏర్పాట్లు చేసుకుంటున్న విశాఖలో ఇప్పుడు ఓ సంఘటన వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో రాజధానిపై ఆందోళనలు రోజురోజుకీ ఉదృతంగా మారిపోతున్నా.. ప్రభుత్వం మాత్రం ఆ సాగరతీరం మీదనే మనసు పారేసుకుంది. అయితే అదే విశాఖ నట్ట నడిరోడ్డుపై ఉన్న నిలువెత్తు విగ్రహం రాత్రికి రాత్రి మాయమవడం వివాదాస్పదంగా మారింది.

విశాఖపట్నం మధురవాడ మార్కెట్ రోడ్డులో ఓ భారీ ఎన్టీఆర్ విగ్రహం ఉండేది. ఈ విగ్రహాం చాలా ఏళ్లుగా ఇక్కడే ఉంది. ఆంధ్రుల ఆత్మగౌరవానికి నిదర్శనంగా ఉండాలని అప్పట్లో అయన అభిమానులు, టీడీపీ నేతలు ఈ నిలువెత్తు విగ్రహాన్ని పెట్టారు. మార్కెట్ రోడ్డులో అదో అడ్రస్ మార్క్‌గా కూడా గుర్తింపు పొందింది. అయితే గురువారం ఉదయం సెంటర్ వద్దకు వచ్చిన ప్రజలు అవాక్కయ్యారు.

మార్కెట్ సెంటర్ కావడంతో అక్కడ వేకువజామున ఐదు గంటలకే ప్రజల సందడి కనిపిస్తుంది. అయితే సెంటర్ వద్దకు వచ్చిన ప్రజలకి అక్కడ రోజూ చేయి చాచి పిలిచే ఎన్టీఆర్ విగ్రహం కనిపించకపోవడంతో ఖంగు తిన్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో కాసేపటికి కానీ అక్కడి ప్రజలకి అర్ధం కాలేదు. రాత్రికి రాత్రి అక్కడ ఉన్న విగ్రహాన్ని దిమ్మతో సహా లేపుకెళ్లిపోయారు.

స్థలానికి చేరుకున్న టీడీపీ నేతలు అర్ధరాత్రి సమయంలో దుండగులు విగ్రహాన్ని దోచుకెళ్లారని నిర్ణయించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్నిపెకిలించిన వారిని పట్టుకుని విగ్రహాన్ని తెచ్చి ఎక్కడ ఉన్నది అక్కడే పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. నడిరోడ్డుపై ఉన్న విగ్రహాన్ని తీసుకెళ్లిన ఈ వ్యవహారం విశాఖలో రాజకీయంగా చర్చనీయాంశమయింది.

ఇది ఖచ్చితంగా అధికార పార్టీ నేతల ప్లాన్ అని.. ఏ ధైర్యం లేకుండా రద్దీగా ఉండే సెంటర్ లో విగ్రహాన్ని కొల్లగొట్టడం అసాధ్యమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ శాఖ.. కార్పొరేషన్ లో కొందరు ఉద్యోగులు ఈ పనికి సహకరించి ఉంటారని.. అధికార బలంతోనే ముందుగా ప్లాన్ చేసి ఈ పనికి పూనుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మార్కెట్ సెంటర్ లో ఆకర్షణగా ఉండే ఈ విగ్రహంపై కొందరు గిట్టని వాళ్ళు కళ్ళు చాలా రోజులుగా ఉన్నాయని.. అయితే ఇప్పుడు అధికార పార్టీ అండతోనే ఈ పనికి పూనుకున్నారని.. వీలైనంత త్వరగా దుండగులను పట్టుకొకేకపోతే నిరసనలకు దిగుతామని టీడీపీ నేతలు హెచ్చరించారు. అయితే నడిరోడ్డుపై ఉన్న విగ్రహాలకు రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle