newssting
BITING NEWS :
*ఏపీలో ఆన్‌లైన్ క్లాస్‌ల‌పై వెన‌క్కి త‌గ్గుతున్న కార్పొరేట్ స్కూళ్లు.. నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు లేవ‌ంటూ స్కూళ్ల నుంచి విద్యార్థుల‌కు మెసేజ్‌లు *దేశంలో కరోనా వీరవిహారం... దేశ‌వ్యాప్తంగా 24,850 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 613 మంది మృతి, 6,73,165కు చేరిన పాజిటివ్ కేసులు, 19,268కు పెరిగిన మృతుల సంఖ్య..యాక్టీవ్ కేసులు 2,44,814, డిశ్చార్జ్ *నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై నేడు ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం *నెల్లూరు జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 1008... యాక్టివ్ కేసులు 462.. మృతుల సంఖ్య 19*హైద‌రాబాద్‌: నేటి నుంచి బేగంబ‌జార్ మార్కెట్ ఓపెన్*హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రుల కరోనా దందా..గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో కరోనాతో నాగరాజు అనే వ్యక్తి మృతి..డబ్బు కడితేనే మృతదేహం ఇస్తామంటూ బెదిరింపులు..ఆస్పత్రి తీరుపై బంధువుల ఆందోళన *డీజీపీ సవాంగ్ విశాఖ పర్యటనలో ఉండగా డ్రగ్స్ కలకలం..డ్రగ్స్ అమ్ముతూ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డ నలుగురు నిందితులు అరెస్ట్..నిందితుల నుంచి భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం *ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా టెస్టులు..మొత్తం 10,17,123 కరోనా టెస్టులు *ఏపీలో కొత్తగా 99 8 కరోనా కేసులు. 14 మరణాలు. ఏపీలో మొత్తం 18,697కి చేరిన కరోనా కేసులు. ఇప్పటి వరకు మొత్తం 232 కరోనా మరణాలు. 10043 యాక్టివ్ కేసులు ఉండగా, 8422 మంది కోలుకొని డిశ్చార్జ్

అనుభవం, కార్యదక్షతే కొలమానం

03-06-201903-06-2019 09:03:04 IST
Updated On 24-06-2019 17:17:51 ISTUpdated On 24-06-20192019-06-03T03:33:04.729Z03-06-2019 2019-06-03T03:31:47.765Z - 2019-06-24T11:47:51.377Z - 24-06-2019

అనుభవం, కార్యదక్షతే కొలమానం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో త్వరలో జగన్ కేబినెట్ కొలువు తీరనుంది. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లా నుంచి కొంతమంది ఆశావహుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ తొమ్మిదేళ్ళు జగన్ మోహన్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉన్న నేతలే కేబినెట్లో వుంటారని అంటున్నారు. ఈ నేపథ్యంలో 7న ఉదయం వైసీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. శాసనసభాపక్ష భేటీకి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. మంత్రుల ఎంపికపై వారితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. 

కేబినెట్ కూర్పు జగన్మోహన్ రెడ్డికి అంత ఈజీ కాదని అంటున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా మాత్రమే జగన్ కు అనుభవం ఉంది. పరిపాలనలో ఆయనకు అంత పట్టు లేదు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్ అంతగా రాజకీయాల్లోకి రాలేదు. దీంతో అతి చిన్నప్రాయంలోనే సీఎం కుర్చీలో కూర్చున్న జగన్ కు పాలనలో సహకరించేందుకు కాస్త అనుభవం ఉన్న నేతలు కావాలి. అందుకే అనేక ప్రాధాన్యతల్లో పరిపాలన అనుభవం, కార్యదక్షత, సంయమనం పాటించే నేతల కోసం జగన్ చూస్తున్నారు. రెండుమూడేళ్ళు పాలనలో వారి సలహాలు తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

మంత్రుల ఎంపికలో ఈ అంశాలు ప్రముఖ పాత్ర పోషించనున్నాయి. ప్రాంతాలు, సామాజిక వర్గాలు, నేతల ప్రాముఖ్యత, తొలినుంచి పార్టీకి అందించిన సేవలను కొలమానంగా తీసుకున్నప్పటికీ నాలుగైదు పెద్త తలకాయలు కూడా మంత్రివర్గంలో ఉండనున్నాయి. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆనం రామనారాయణరెడ్డి వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి.

వీరిలో ఉమ్మారెడ్డి పేరు డిప్యూటీ సీఎం అని వినిపిస్తోంది. బొత్స. ధర్మాన జగన్ వెంటే ఉన్నారు. కానీ ఆనం రామనారాయణరెడ్డి వైఎస్ విధేయుడిగా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కానీ వైసీపీలో చేరలేదు. అన్న వివేకానందరెడ్డితో కలిసి టీడీపీలో చేరారు. టీడీపీలో ఇమడలేక జగన్ చెంత చేరారు. వెంకటగిరిలో టికెట్ ఇవ్వడంతో భారీ మెజారిటీతో గెలిచారు. జగన్ మంత్రివర్గంలో ఆనంకి చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకున్న ఇమేజ్, పాలనా అనుభవం, ఆర్థిక వ్యవహారాలపై ఆయనకు ఉన్న పట్టు నేపథ్యంలో ఆనం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 

వీరితో పాటు జిల్లాల వారీగా పలువురిని ఎంపిక చేసిన జగన్.. మరి కొంతమంది మంత్రుల ఎంపికపై దృష్టి పెట్టారు. పలు జిల్లాల్లో మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయమై పార్టీ ముఖ్యనేతల అభిప్రాయం తీసుకుంటున్నారు. అన్ని అంశాల్లోనూ సమతుల్యం ఉండేలా తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు.

చంద్రబాబు మాదిరిగానే, ఇప్పుడు జగన్ కూడా, కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ సీనియర్ నేతకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నారు. ఈ పోస్టుకు ఇద్దరు ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానమైనది ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. గోదావరి - గుంటూరు - కృష్ణా జిల్లాల్లో బలంగా ఉన్న కాపు ఓటు బ్యాంకును పదిలంగా కాపాడుకోవాలంటే ఉమ్మారెడ్డికి డిప్యూటీ సీఎం ఇవ్వక తప్పదన్న చర్చ కూడా పార్టీలో జోరుగా సాగుతోంది. అన్ని అంశాలను కూలంకషంగా చర్చించిన తర్వాతే జాబితా బయటకు రానుంది. రెండుమూడేళ్ళు సీనియర్ల సలహాలు స్వీకరించనున్నారు. మొత్తం మీద కేబినెట్ రూపకల్పన జగన్ కు కత్తిమీద సాములా మారనుంది. 

 కడపలో త్వరలో నైట్ ల్యాండింగ్ .. ఫలించిన అవినాష్ రెడ్డి కృషి

కడపలో త్వరలో నైట్ ల్యాండింగ్ .. ఫలించిన అవినాష్ రెడ్డి కృషి

   a few seconds ago


ఏపీలో 10 లక్షలు దాటిన  కరోనా పరీక్షలు.. దేశంలోనే గుర్తింపు

ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా పరీక్షలు.. దేశంలోనే గుర్తింపు

   an hour ago


సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

   2 hours ago


కోవిడ్ బారిన పడకుండా వుండాలంటే..

కోవిడ్ బారిన పడకుండా వుండాలంటే..

   3 hours ago


తెలంగాణలో 1590 కరోనా కేసులు, ఆంధ్రలో 961 కేసులు.. తగ్గని పోటీ

తెలంగాణలో 1590 కరోనా కేసులు, ఆంధ్రలో 961 కేసులు.. తగ్గని పోటీ

   3 hours ago


అల్లాడుతున్న ఇచ్చాపురం... 14 రోజుల లాక్ డౌన్

అల్లాడుతున్న ఇచ్చాపురం... 14 రోజుల లాక్ డౌన్

   3 hours ago


అంత్యక్రియలకు పదివేలమంది... తల పట్టుకున్న అధికారులు

అంత్యక్రియలకు పదివేలమంది... తల పట్టుకున్న అధికారులు

   4 hours ago


కేసీయార్ సార్...కరోనాపై కంట్రోల్ ఏదీ? ట్రెండ్ అవుతున్న #WhereIsKCR హ్యాష్ ట్యాగ్

కేసీయార్ సార్...కరోనాపై కంట్రోల్ ఏదీ? ట్రెండ్ అవుతున్న #WhereIsKCR హ్యాష్ ట్యాగ్

   4 hours ago


ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్‌ కేంద్రం ఢిల్లీలో ప్రారంభం.. 10 వేల పడకల సామర్థ్యం

ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్‌ కేంద్రం ఢిల్లీలో ప్రారంభం.. 10 వేల పడకల సామర్థ్యం

   5 hours ago


కోవిడ్ మరణాలపై కేంద్రం ఆందోళన .. పరీక్షలు పెంచాలని సూచన

కోవిడ్ మరణాలపై కేంద్రం ఆందోళన .. పరీక్షలు పెంచాలని సూచన

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle