newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

అనిల్ వ‌ర్సెస్ ఆనం..! నెల్లూరు వైసీపీలో ర‌చ్చ‌

07-12-201907-12-2019 07:38:08 IST
Updated On 07-12-2019 12:42:44 ISTUpdated On 07-12-20192019-12-07T02:08:08.351Z07-12-2019 2019-12-07T02:06:46.078Z - 2019-12-07T07:12:44.336Z - 07-12-2019

అనిల్ వ‌ర్సెస్ ఆనం..! నెల్లూరు వైసీపీలో ర‌చ్చ‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటల్లాంటి జిల్లాల్లో నెల్లూరు ముఖ్య‌మైన‌ది. పార్టీని స్థాపించిన నాటి నుంచి వ‌చ్చిన ఎన్నిక‌లు, ఉప ఎన్నిక‌ల్లో సింహ‌పురి ప్ర‌జ‌లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప‌ట్టం క‌డుతూ వ‌స్తున్నారు.

మొన్న‌టి ఎన్నిక‌ల్లోనూ వైసీపీ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. ఇంత‌టి ప‌ట్టున్న జిల్లాలో ఇప్పుడు వైసీపీలో ఆధిప‌త్య పోరు మొద‌లైంది. జిల్లా కీల‌క నేత‌లు రెండు వ‌ర్గాలుగా విడిపోవ‌డంతో విభేదాలు మొద‌ల‌య్యాయి.

నెల్లూరు జిల్లాలో 10కి 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను వైసీపీ గెలుచుకుంది. అయితే, మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ విష‌యంలో మాత్రం జ‌గ‌న్ జిల్లాలో ఒక ప్ర‌యోగం చేశారు.

సీనియ‌ర్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి, న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి వంటి వారిని ప‌క్క‌న‌పెట్టి రెండోసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన జూనియ‌ర్లు అనిల్ కుమార్ యాద‌వ్‌, మేక‌పాటి గౌత‌మ్ రెడ్డికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. తాజా ప‌రిణామాలు చూస్తుంటే జ‌గ‌న్ చేసిన ఈ ప్ర‌యోగం విక‌టించేలా క‌నిపిస్తోంది.

మంత్రులు వారి జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి న‌డిపించాలి. కానీ, జిల్లా పార్టీలో విభేదాలు రోజురోజుకూ పెరిగిపోతూ ఉన్నా మంత్రులు ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పైగా మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ కూడా ఈ ఆధిప‌త్య పోరులో భాగం కావ‌డంతో పార్టీ గాడి త‌ప్పుతోంది. శుక్ర‌వారం ఎమ్మెల్యే ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌తో నెల్లూరు జిల్లా వైసీపీలో విభేదాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి.

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌, నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకొని ఆనం ఇన్‌డైరెక్ట్‌గా విమ‌ర్శ‌లు గుప్పించారు.

నెల్లూరు న‌గ‌రం మాఫియాల‌కు అడ్డాగా మారిపోయింద‌ని, భూమాఫియా, ఇసుక మాఫియా, బెట్టింగ్ మాఫియా, ఇలా అన్ని మాఫియాలూ నెల్లూరు న‌గ‌రంలో ఉన్నాయ‌ని ఆనం ఆరోపించారు. మాఫియాల‌ను నియంత్రించే పోలీసు అధికారులు వ‌చ్చినా ప్ర‌జాప్ర‌తినిధులు ఉండ‌నీయ‌ర‌ని ఆయ‌న చెప్పారు.

నెల్లూరు న‌గ‌రం మంత్రి అనిల్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ఉంది. దీంతో ఆనం వ్యాఖ్య‌లు వీరికే త‌గిలాయి. ఎందుకంటే గ‌త ప‌ర్యాయం కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌కు వీరే ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

ఆనం చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఎక్క‌డా పేర్లు చెప్ప‌క‌పోయిన‌ప్ప‌టికీ అనిల్‌, కోటంరెడ్డిని ఉద్దేశించే ఆనం ఈ వ్యాఖ్య‌లు చేశార‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఆనం రాంనారాయాణ‌రెడ్డితో మంత్రి అనిల్‌కు పొస‌గ‌డం లేద‌ని, ఆనంకు చెక్ పెట్టేందుకు అనిల్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. ఆనం ఎమ్మెల్యేగా ఉన్న వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి అనిల్ వేలు పెడుతున్నార‌నే ప్ర‌చారం ఉంది.

ద‌శాబ్దాలుగా ఆనం కుటుంబం చేతుల్లో ఉన్న వెంక‌ట‌గిరి రాజా విద్యాసంస్థ‌ల(వీఆర్‌) అభివృద్ధి క‌మిటీ ఛైర్మ‌న్‌గా రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ప్ర‌క‌టించారు అనిల్ కుమార్ యాద‌వ్‌. ఇది కూడా ఆనం జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ఆనం వ‌ర్గంగా స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఉన్నారు. ఆ0య‌న‌కు, రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి విభేదాలు ఉన్నారు. ఒక‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌రు జోక్యం చేసుకుంటున్నార‌ని ఇటీవ‌ల వీరిద్ద‌రూ రచ్చ‌కెక్కారు.

వీరి ఆధిప‌త్య పోరులో మ‌ధ్య‌లో అధికారులు ఇబ్బంది ప‌డుతున్నారు. మొత్తానికి త‌మ‌కు ప‌ట్టున్న జిల్లాలో పార్టీ రెండు వ‌ర్గాలుగా చీలిపోవ‌డం వైసీపీకి ఇబ్బందిక‌ర‌మే. మ‌రి, ఈ వ్య‌వ‌హారానికి జ‌గ‌న్ ఎలా చెక్ పెడ‌తారో చూడాలి.

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle