newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

అనకాపల్లి... అమలాపురం.... తర్వాత ?

18-02-201918-02-2019 17:36:50 IST
Updated On 18-02-2019 17:46:26 ISTUpdated On 18-02-20192019-02-18T12:06:50.672Z18-02-2019 2019-02-18T12:04:35.606Z - 2019-02-18T12:16:26.129Z - 18-02-2019

అనకాపల్లి... అమలాపురం.... తర్వాత ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వలసలు సీజన్ నడుస్తోంది. టీడీపీ ఎంపీలలో చాలామంది వైసీపీ వైపు నడుస్తున్నారు. ఇంతకుముందే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా ఆయన తర్వాత క్యూ కట్టారు అమలాపురం ఎంపీ రవీంద్రబాబు. గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున గెలిచిన రవీంద్రబాబు వైసీపీ అధినేత‌ జగన్‌తో సోమవారం భేటీ అయి పార్టీలో చేరిపోయారు. వైసీపీలో చేరాక పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబుతో రాష్ట్రానికి ఏమీ రావన్నారు. 

ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం మేలు చేస్తోందని ఆరోపించారు. తనకు సీటు రాదనే వైసీపీలో చేరడం లేదన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు నీరుగార్చారని, ఆయన వల్లే ప్రత్యేక హోదా రాలేదని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోవడం వల్లే చంద్రబాబు హడావుడిగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనికిరారని, ఆయన వల్ల రాష్ట్రం బాగుపడదన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతిచోట అవినీతి పెరిగిపోయిందని, ఒకే సామాజిక వర్గానికి మేలు జరుగుతోందన్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే సత్తా వైఎస్‌ జగన్‌కు మాత్రమే ఉందని రవీంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. కులాలవారీగా చంద్రబాబు దగ్గర ఆర్మీ ఉంటుందని, ఏ కులం​వారితో ఆ కులం వారిని తిట్టిస్తారని చెప్పారు. అమలాపురం ఎంపీ పదవికి స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసినట్టు రవీంద్రబాబు ప్రకటించారు. రాజీనామా లేఖను మీడియాకు చూపించారు. టీడీపీకి కూడా రాజీనామా చేసినట్టు తెలిపారు.

ప్రజలంతా ఏకమై వైసీపీని గెలిపించాలని రవీంద్రబాబు కోరారు. చంద్రబాబు విధానాలు నచ్చక అధికార పార్టీని వీడామని, తమ స్వార్థం కోసం పార్టీ మారలేదని టీడీపీ మాజీ ఎంపీ, వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ అన్నారు. మోసపూరిత విధానాలతో చంద్రబాబు పదేపదే ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. కులాలను విభజించి తిట్టించడం ద్వారా చంద్రబాబు ఆనందం పొందుతారని ఆయన విమర్శించారు. మొత్తం మీద ఇద్దరు ఎంపీల రాజీనామాలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. వీరిద్దరి తర్వాత ఎవరనే చర్చ నడుస్తోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle