newssting
BITING NEWS :
* ఏపీ: గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 54 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి..2841కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య 824..మొత్తం 1958 మంది డిశ్చార్జ్.. కాగా మొత్తం కరోనాతో 59 మంది మృతి *భారత్ లో 1,58,333 కరోనా పాజిటివ్ కేసులు..దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 86,110..కరోనా నుండి డిశ్చార్జ్ అయిన బాధితులు 67,692..కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,531*దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 6,566 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు..గడచిన 24 గంటలలో మొత్తం 194 మంది మృతి*ఇవాళ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి... ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు*బోరు బావి ఘటన విషాదాంతం..కన్నుమూసిన చిన్నారి సాయి వర్ధన్..సమాంతరంగా గొయ్యి మృతదేహం వెలికి తీత..సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడ్డ బాలుడు*లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్*ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి-కేసీఆర్*హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి, ఆసరా పెన్షన్లను యథావిథిగా అందించాలి-సీఎం కేసీఆర్

అనంత‌పురం నేత‌ల‌పై అనుమాన‌పు చూపులు!

04-07-201904-07-2019 08:33:18 IST
Updated On 04-07-2019 10:50:56 ISTUpdated On 04-07-20192019-07-04T03:03:18.690Z04-07-2019 2019-07-04T03:03:11.627Z - 2019-07-04T05:20:56.689Z - 04-07-2019

అనంత‌పురం నేత‌ల‌పై అనుమాన‌పు చూపులు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మి త‌ర్వాత తెలుగుదేశం పార్టీ నేత‌ల్లో రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై బెంగ ఏర్ప‌డింది. రాష్ట్రంలో తాము తీవ్రంగా వ్య‌తిరేకించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌టం, కేంద్రంలో శ‌త్రువుగా భావించిన బీజేపీ మ‌రోసారి అధికారంలోకి రావ‌డంతో కొంద‌రు నేత‌లు తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ఆలోచ‌న‌తో ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే న‌లుగురు టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో విలీనం అయ్యారు.

ఇక‌, రోజుకొక తెలుగుదేశం పార్టీ నేత బీజేపీలో చేరుతార‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. మొన్న‌టి వ‌ర‌కు టీడీపీలోని కాపు సామాజ‌క‌వ‌ర్గం నేత‌లు పార్టీపై అసంతృప్తితో ఉండ‌టంతో వారు బీజేపీలో చేరే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. వారిని చంద్ర‌బాబు ఏదోర‌కంగా పిలిపించుకొని బుజ్జ‌గించి తాత్కాలికంగా అయితే పార్టీలోనే కొన‌సాగేలా చూసుకున్నారు.

ఇప్పుడు, మ‌రికొంద‌రు పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో ఎక్కువ‌గా అనంత‌పురం జిల్లా నేత‌లు క‌నిపిస్తున్నారు. అనంత‌రం జిల్లా తెలుగుదేశం పార్టీలో కీల‌క నేత‌లుగా ఉన్న కొంద‌రు పార్టీ మార‌తార‌నే ప్ర‌చారంతో పార్టీ నేత‌లు వారిని అనుమానపు చూపులు చూడాల్సి వ‌స్తోంది. ఇప్ప‌టికే జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి బీజేపీలో చేర‌డంతో ఈ అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి.

వ‌ర‌దాపురం సూరి కూడా టీడీపీలో నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేసిన వ్య‌క్తే. ఎన్నిక‌ల ముందు ఆయ‌న మ‌ళ్లీ తామే అధికారంలోకి వ‌స్తామ‌ని, ఆ త‌ర్వాత వైసీపీ వాళ్ల‌పై దాడులు చేసినా తాను చూసుకుంటాన‌ని మాట్లాడిన ఆడియో బాగా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

దీంతో ధ‌ర్మ‌వ‌రంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఆయ‌న టీడీపీలో ఉంటే ఇబ్బందులు తప్ప‌వ‌నే భావ‌న‌తో బీజేపీలో చేరారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండ‌టం, బీజేపీ నేత‌ల జోలికి వైసీపీ వ‌చ్చే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఆ పార్టీని సేఫ్ జోన్‌గా భావించి ఆయ‌న కాషాయ కండువా క‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక‌, జేసీ కుటుంబం విష‌యంలోనూ ఇదే ప్రచారం జ‌రుగుతోంది. నాలుగు ద‌శాబ్దాలుగా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గాన్ని కంచుకోట‌గా శాసించిన జేసీ కుటుంబానికి ఈసారి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.

తాడిప‌త్రిలో జేసీ కుటుంబానికి చిర‌కాల ప్ర‌త్య‌ర్థిగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి విజ‌యం సాధించారు. దీంతో కేతిరెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్రం తిప్పుతున్నారు. జేసీ వ‌ర్గాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ప‌రిస్థితి ఇలానే ఉంటే జేసీ సోద‌రులు ప‌ట్టుకోల్పోవ‌డంతో పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌నే భావ‌న వారిలో ఉంద‌ట‌.

దీంతో జేసీ సోద‌రులు రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొని వారి కుమారులు ప‌వ‌న్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల‌ను బీజేపీలోకి పంపుతార‌ని జిల్లాలో ప్ర‌చారం ఉంది. త‌మ కుమారుల రాజ‌కీయ నిర్ణ‌యాలు వారి ఇష్టం అంటూ జేసీ దివాక‌ర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఈ ప్ర‌చారానికి ఊతం ఇస్తున్నాయి.

ఇక‌, జిల్లాలో టీడీపీకి కీల‌క నేత‌లుగా ఉన్న ప‌రిటాల కుటుంబం, ప‌య్యావుల కేశ‌వ్ పేర్లు కూడా పార్టీ మారే లిస్టులో వినిపిస్తున్నాయి. అయితే, తెలుగుదేశం పార్టీలో వారు అత్యంత నిబ‌ద్ధ‌త‌తో ఉండే నేత‌లు కావ‌డంతో వారు పార్టీ మారే అవ‌కాశాలు మాత్రం ఎక్కువ‌గా క‌నిపించ‌డం లేదు.  

 

 అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ  కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

అన్నిటికంటే అతి పెద్ద జలపండుగ కొండపోచమ్మ రిజర్వాయర్ వేడుక

   25 minutes ago


ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంపై హైకోర్టు సీరియస్

   2 hours ago


చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

చెరో సెంచరీ దాటేసిన తెలుగురాష్ట్రాలు.. ఏపీ 134.. తెలంగాణ 107

   3 hours ago


ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

ఈ నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ టూర్ షెడ్యూల్

   8 hours ago


గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సులకు మినహాయింపులు

   9 hours ago


ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. ఎన్టీయార్ ఘాట్లో కుటుంబసభ్యుల శ్రద్ధాంజలి

   10 hours ago


విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

విద్యపై పెట్టే ఖర్చు... పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి.. జగన్ స్పష్టీకరణ

   10 hours ago


‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

‘‘ఏపీలో ప్రాథమిక హక్కులు లేవు.. నడుస్తోంది ఆటవిక రాజ్యం’’

   10 hours ago


పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

పాజిటివ్ కేసులు పెరుగుతాయి.. భయపడొద్దు.. కేసీఆర్ భరోసా

   10 hours ago


 పాపం పసివాడు..  ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

పాపం పసివాడు.. ఆక్సిజన్ అందక బోరుబావిలో పడ్డ బాలుడి మృతి

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle