newssting
BITING NEWS :
*ఏపీలో ఆన్‌లైన్ క్లాస్‌ల‌పై వెన‌క్కి త‌గ్గుతున్న కార్పొరేట్ స్కూళ్లు.. నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు లేవ‌ంటూ స్కూళ్ల నుంచి విద్యార్థుల‌కు మెసేజ్‌లు *దేశంలో కరోనా వీరవిహారం... దేశ‌వ్యాప్తంగా 24,850 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 613 మంది మృతి, 6,73,165కు చేరిన పాజిటివ్ కేసులు, 19,268కు పెరిగిన మృతుల సంఖ్య..యాక్టీవ్ కేసులు 2,44,814, డిశ్చార్జ్ *నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై నేడు ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం *నెల్లూరు జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 1008... యాక్టివ్ కేసులు 462.. మృతుల సంఖ్య 19*హైద‌రాబాద్‌: నేటి నుంచి బేగంబ‌జార్ మార్కెట్ ఓపెన్*హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రుల కరోనా దందా..గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో కరోనాతో నాగరాజు అనే వ్యక్తి మృతి..డబ్బు కడితేనే మృతదేహం ఇస్తామంటూ బెదిరింపులు..ఆస్పత్రి తీరుపై బంధువుల ఆందోళన *డీజీపీ సవాంగ్ విశాఖ పర్యటనలో ఉండగా డ్రగ్స్ కలకలం..డ్రగ్స్ అమ్ముతూ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డ నలుగురు నిందితులు అరెస్ట్..నిందితుల నుంచి భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం *ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా టెస్టులు..మొత్తం 10,17,123 కరోనా టెస్టులు *ఏపీలో కొత్తగా 99 8 కరోనా కేసులు. 14 మరణాలు. ఏపీలో మొత్తం 18,697కి చేరిన కరోనా కేసులు. ఇప్పటి వరకు మొత్తం 232 కరోనా మరణాలు. 10043 యాక్టివ్ కేసులు ఉండగా, 8422 మంది కోలుకొని డిశ్చార్జ్

అనంతలో ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరుగుతుందా..?

08-04-201908-04-2019 07:42:59 IST
2019-04-08T02:12:59.976Z08-04-2019 2019-04-08T02:12:42.715Z - - 06-07-2020

అనంతలో ఫ్యాన్  ఫుల్ స్పీడ్లో తిరుగుతుందా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలోని మొత్తం 14 స్థానాల్లో ఆ పార్టీ కేవలం 2 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. రాయలసీమలోని మిగతా మూడు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచినా అనంతపురంలో మాత్రం తెలుగుదేశం జెండా ఎగిరింది.

దీంతో ఈసారి కచ్చితంగా జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఇదే సమయంలో మళ్లీ జిల్లాపై ఆధిపత్యం చూపించాలని తెలుగుదేశం పట్టుదలగా ఉంది.

జిల్లాలోని మొత్తం 14  స్ధానాల్లో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీ తలపడుతున్నాయి. అన్ని స్థానాల్లో ఈ రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోరు ఉండగా మూడింట మాత్రం త్రిముఖ పోరు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ జిల్లాలో ఉరవకొండ, కదిరి నియోజకవర్గాలను గెలుచుకోగా తర్వాత కదిరి ఎమ్మెల్యే చాంద్ పాషా టీడీపీలో చేరిపోయారు. దీంతో ఇన్నిరోజులుగా ఆ పార్టీకి జిల్లాలో ఒకే ఎమ్మెల్యే ఉన్నారు.

మరోసారి సిట్టింగ్ స్థానాలైన కదిరి, ఉరవకొండలో గెలవాలని వైసీపీ భావిస్తుంది. కదిరి టికెట్‌ను కొత్త అభ్యర్థి డా.సిద్ధారెడ్డికి కేటాయించారు. ఇక తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి స్థానాలపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. చాలా నియోజకవర్గాలకు రెండేళ్ల క్రితమే జగన్ అభర్ధులను ఖరారు చేశారు. ఇది వైసీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది.

టీడీపీకి బలమైన స్థానాలైన రాప్తాడులో పరిటాల శ్రీరామ్ కి వైసీపీ నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తాడిపత్రిలో జేసీ అస్మిత్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. ధర్మవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వరదాపురం సూరికి వైసీపీ నుంచి వెంకట్రామ్ రెడ్డి, అనంతపురం అర్బన్ లో ప్రభాకర్ చౌదరికి అనంత వెంకట్రాంరెడ్డి బలమైన పోటీ ఇస్తున్నారు. 

ఈ స్థానాలు టీడీపీ సులువుగా గెలవాల్సి ఉన్నా ఇప్పుడు అంత సులువు కాదనే అంచనాలు ఉన్నాయి. ఇక పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి కూడా వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి మంచి పోటీ ఇస్తున్నారు.

ఈ అన్ని స్థానాల్లో ఎవరు గెలిచినా పెద్దగా మెజారిటీ ఉండకపోవచ్చు. శింగనమలలో మాజీ మంత్రి శైలజానాథ్, కళ్యాణదుర్గంలో రఘువీరా రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉండటంతో ఈ రెండు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉంది. ఇక, గుంతకల్లులో జనసేన నుంచి టీడీపీ రెబల్ మధుసూదన్ గుప్తా బరిలో దిగడంతో అక్కడ త్రిముఖ పోటీ ఉంది. 

తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య విబేధాలు ఆ పార్టీకి నష్టం చేసే అవకాశం ఉంది. అనంతపురం ఎంపీ అభ్యర్థి జేసీ పవన్ రెడ్డికి పలువురు ఎమ్మెల్యే అభర్ధులతో  సఖ్యత లేదు. దీంతో క్రాస్ వోటింగ్ కూడా జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

వైసీపీ ఈసారి జిల్లాలో బీసీ కార్డు ప్రయోగించింది. హిందూపురం, అనంతపురం స్థానాలను బీసీలకు కేటాయించి వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇది కొంతవరకు సఫలం కావొచ్చు. మొత్తానికి గత ఎన్నికల మాదిరి ఈసారి జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసే అవకాశం అయితే లేదు. ఇప్పటికీ జిల్లాలో టీడీపీ బలంగా ఉన్నా వైసీపీ కూడా గత ఎన్నికల కంటే చాలా మెరుగ్గా కనిపిస్తుంది.

కడపలో జగన్ రెండురోజుల టూర్... పర్యటన ఖరారు

కడపలో జగన్ రెండురోజుల టూర్... పర్యటన ఖరారు

   15 minutes ago


 కడపలో త్వరలో నైట్ ల్యాండింగ్ .. ఫలించిన అవినాష్ రెడ్డి కృషి

కడపలో త్వరలో నైట్ ల్యాండింగ్ .. ఫలించిన అవినాష్ రెడ్డి కృషి

   20 minutes ago


ఏపీలో 10 లక్షలు దాటిన  కరోనా పరీక్షలు.. దేశంలోనే గుర్తింపు

ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా పరీక్షలు.. దేశంలోనే గుర్తింపు

   2 hours ago


సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ

   2 hours ago


కోవిడ్ బారిన పడకుండా వుండాలంటే..

కోవిడ్ బారిన పడకుండా వుండాలంటే..

   3 hours ago


తెలంగాణలో 1590 కరోనా కేసులు, ఆంధ్రలో 961 కేసులు.. తగ్గని పోటీ

తెలంగాణలో 1590 కరోనా కేసులు, ఆంధ్రలో 961 కేసులు.. తగ్గని పోటీ

   3 hours ago


అల్లాడుతున్న ఇచ్చాపురం... 14 రోజుల లాక్ డౌన్

అల్లాడుతున్న ఇచ్చాపురం... 14 రోజుల లాక్ డౌన్

   4 hours ago


అంత్యక్రియలకు పదివేలమంది... తల పట్టుకున్న అధికారులు

అంత్యక్రియలకు పదివేలమంది... తల పట్టుకున్న అధికారులు

   4 hours ago


కేసీయార్ సార్...కరోనాపై కంట్రోల్ ఏదీ? ట్రెండ్ అవుతున్న #WhereIsKCR హ్యాష్ ట్యాగ్

కేసీయార్ సార్...కరోనాపై కంట్రోల్ ఏదీ? ట్రెండ్ అవుతున్న #WhereIsKCR హ్యాష్ ట్యాగ్

   5 hours ago


ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్‌ కేంద్రం ఢిల్లీలో ప్రారంభం.. 10 వేల పడకల సామర్థ్యం

ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్‌ కేంద్రం ఢిల్లీలో ప్రారంభం.. 10 వేల పడకల సామర్థ్యం

   5 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle