newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

అధికారుల గొడవలు.. నివురుగప్పిన నిప్పులా ఏపీ సచివాలయం

09-12-201909-12-2019 10:46:57 IST
Updated On 11-12-2019 10:28:18 ISTUpdated On 11-12-20192019-12-09T05:16:57.220Z09-12-2019 2019-12-09T05:16:54.120Z - 2019-12-11T04:58:18.500Z - 11-12-2019

అధికారుల గొడవలు.. నివురుగప్పిన నిప్పులా ఏపీ సచివాలయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా పాలనలో పట్టు సాధించారో లేదో కానీ ప్రభుత్వ శాఖలు.. ముఖ్యంగా ఉన్నతాధికారుల మధ్య సమన్వయం, సీఎంఓ, సచివాలయం ఉద్యోగులలో మాత్రం పట్టు బిగించలేకపోతున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్ గా ఉన్నప్పుడే జరిగిన గొడవలు, సీఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ సిఎస్ ను బదిలీ చేయటం ఘటనతో గొడవలు స్పష్టంగా బయటపడ్డాయి.

అయితే ఆ గొడవలు వాళ్ళిద్దరి మధ్యే కాదని, అది సీఎం కార్యాలయానికి.. సచివాలయానికి మధ్య మాత్రమే కాదని తరచుగా అక్కడి అధికారుల మధ్య గొడవలు చాలా సాధారణంగా మారిపోయాయని తాజాగా వినిపిస్తున్న మాట. దీనికి తగ్గట్లే రెండు రోజుల క్రితమే సచివాలయంలో ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఎదురెదురుగా అరుపులు కేకలతో గొడవకు దిగి బీభత్సం సృష్టించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అటు సీఎంఓలో కానీ ఇటు సచివాలయంలో కానీ తరచుగా ఉన్నతాధికారుల మధ్య గొడవలకు దిగడం.. అధికారులు ఒకరంటే మరొకరికి గిట్టకపోవడానికి కారణం కూడా ప్రభుత్వ తీసుకున్న ఓ నిర్ణయమే కారణంగా అక్కడి అధికారులు చెప్పడం గమనార్హం. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక ప్రభుత్వంతో పాటు సీఎం వ్యక్తిగత కార్యాలయంలో భారీగా బదిలీలు చేశారు.

ఆ సమయంలో గత ప్రభుత్వంలో అవకతవకలు, పాలనలో లొసుగులను వెలికితీసి మాజీ సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపాలని ఇప్పటి ప్రభుత్వ పెద్దల నుండి ఆదేశాలు వెళ్లాయని అధికారుల దగ్గర బహిరంగంగానే వినిపించింది. దీంతో శాఖల వారీగా అప్పటి జీవోలు, పనులు, తీసుకున్న నిర్ణయాలు అన్నిటినీ ఆరు నెలలుగా జల్లెడ పడుతూనే ఉన్నారు. ఈక్రమంలోనే అధికారుల మధ్య వివాదాలు మొదలవుతున్నాయి.

గత ప్రభుత్వంలో కీలకమైన పదవులలో ఉన్నవాళ్లు ఇప్పుడు మరో శాఖలో ఉన్నారు. ఆ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను తవ్వడం అంటే అప్పుడు ఆ శాఖలో పనిచేసిన ఉన్నతాధికారులకు సహజంగానే మంటపుట్టిస్తుంది. దీంతో ఇప్పుడు ఆ శాఖలో ఉన్న అధికారిపై వ్యతిరేకత వచ్చేస్తుంది. ప్రతిశాఖలో ఇప్పుడు ఇదే సమస్యతో అధికారుల మధ్య అంతరం ఏర్పడింది. ఇదే తరచుగా గొడవలకు కారణమవుతుంది.

ఈక్రమంలోనే సచివాలయంలో రెండు రోజుల క్రితం జరిగిన గొడవలో కూడా అప్పుడు కీలక పదవిలో ఉన్న అధికారి ఇప్పుడు పదవిలో ఉన్న అధికారి ఛాంబర్ కు నేరుగా వెళ్లి గొడవకి దిగినట్లుగా తెలుస్తుంది. ఆరునెలలుగా బయటకు తీసిన లొసుగులు ఇప్పటికీ బయటకు రాలేదు కానీ వాటి పుణ్యమా అని అధికారుల మధ్య గొడవలు మాత్రం బయటపడుతున్నాయని.. ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయాల కోసం తమని బలిచేస్తున్నారని అధికారులు వాపోతున్నారు.

 

 

 

 

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   14 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   15 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   17 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   17 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   17 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   17 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   18 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   18 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   19 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle