newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

అధికారుల‌ను పూర్తిగా వ‌దిలేయ‌డం స‌బ‌బేనా జ‌గ‌న్‌..?

29-09-201929-09-2019 08:52:43 IST
2019-09-29T03:22:43.955Z29-09-2019 2019-09-29T03:22:42.019Z - - 08-12-2019

అధికారుల‌ను పూర్తిగా వ‌దిలేయ‌డం స‌బ‌బేనా జ‌గ‌న్‌..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ స‌ర్కార్ హయాంలో అధికారుల‌పై అవ‌స‌రానికి మించిన ఒత్తిడి ఉండ‌దని, ప్ర‌భుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టేలా విధులు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇస్తాన‌ని ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం నాడు వైఎస్ జ‌గ‌న్ అధికారులకు స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.

ఆ క్ర‌మంలో ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌ను, ప్ర‌భుత్వ విధి విధానాల‌కు అనుగుణంగా న‌డుచుకోవాల‌ని, వాటిలో ఏ మాత్రం అల‌క్ష్యం చేయొద్ద‌ని జ‌గ‌న్ అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. అలాగే తమ పార్టీకి చెందిన నేత‌ల నుంచి అడ్డ‌గోలు ప‌నుల‌కు సంబంధించి ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినా ల‌క్ష్య‌పెట్టొద్ద‌ని సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

జ‌గ‌న్ ఆ ప్ర‌క్రియ‌ను మాట‌ల‌కే ప‌రిమితం చేయ‌కుండా చెప్పిన‌దానికి అనుగుణంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు సీఎం జ‌గ‌న్‌. మంత్రుల‌కు, సొంత‌పార్టీ ఎమ్మెల్యేల‌కు కూడా మార్గ‌ద‌ర్శ‌కం చేయ‌డంతో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు  కానీ ప‌రిపాల‌నాప‌ర‌మైన వ్య‌వ‌హారాల్లో పెద్ద‌గా జోక్యం చేసుకోవ‌డం లేద‌నే చెప్పాలి.

అలాగే గ‌త ప్ర‌భుత్వ త‌ర‌హాలో కాకుండా జ‌న‌గ్ స‌ర్కార్ స‌మీక్ష‌ల పేరుతో అధికారుల‌మీద ఎలాంటి ఒత్తిళ్లు పెట్టడం లేదు. ప్ర‌తి రోజు లెక్క‌కు మించిన స‌మీక్ష‌లు, స‌మావేశాలు పెట్ట‌కుండా చెప్పినప‌ని చేయ‌డానికి, అవ‌స‌ర‌మైన స‌మ‌యాన్ని కూడా అధికారుల‌కు ఇస్తున్నారు. దీంతో అధికారులు చాలా వ‌ర‌కు ఫ్రీ అయ్యారు.

ప‌రిపాల‌నా విష‌యంలో అధికారుల‌కు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇవ్వ‌డం బాగానే ఉన్నా పూర్తిగా వారిని వదిలేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అనే దిశ‌గా ఇప్పుడిప్పుడే అధికార‌పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌భుత్వ‌ప‌రంగా ఎటువంటి జోక్యం లేక‌పోవ‌డంతో కొంద‌రు అధికారులు అస్స‌లు పట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తుంది.

అదే స‌మ‌యంలో కొంద‌రు అధికారులు త‌మ ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌భుత్వ ప‌నుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నాలు కూడా చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. దాంతో అవినీతి స‌హా ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తెచ్చే విష‌యాల్లో పొలిటిక‌ల్ కంట్రోల్ బాగానే ఉంటున్నా ఆ మేర‌కు ప్ర‌భుత్వ అధికారుల‌ను క‌ట్ట‌డి చేయాల‌న్న వాద‌న రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తోంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle