newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

అధికారుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..!

18-11-201918-11-2019 01:06:03 IST
2019-11-17T19:36:03.153Z18-11-2019 2019-11-17T19:35:54.695Z - - 06-12-2019

అధికారుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాసు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ హ‌యాంలో మంత్రిగా ప‌నిచేసిన నాయ‌కుడు. గుంటూరు జిల్లాలో రాజ‌కీయ పెత్త‌నం చెలాయించిన కుటుంబం నుంచి వ‌చ్చిన నాయ‌కుడు ఈయ‌న. ఇప్పుడు ఆయ‌న వార‌సుడిగా కుమారుడు మ‌హేష్‌రెడ్డి ఎమ్మెల్యేగా వైసీపీ త‌రుపున ఎన్నికైన సంగ‌తి తెలిసిందే.

ఉమ్మ‌డి రాష్ట్రానికి ఏడేళ్ల‌పాటు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి వార‌సుడిగా, రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కాసు కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా  మూడుసార్లు గెలిచి మూడుసార్లు ఓట‌మిపాలై రెండుసార్లు ఎంపీగా గెలిచి.. ఓసారి ఓట‌మిపాల‌య్యారు.

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్‌కు స్నేహితుడిగా ఆయ‌న మంత్రివ‌ర్గంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత కాసు కృష్ణారెడ్డి కుమారుడే కాసు మ‌హేష్‌రెడ్డి. ఆ కుటుంబంలో ఆయ‌న మూడోత‌రం నాయ‌కుడు.

మొన్న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప‌ల్నాడు రాజ‌కీయాల్లో తెలుగుదేశం పార్టీ బ‌ల‌మైన నేత‌గా గుర్తింపు పొందిన య‌ర‌ప‌తినేని శ్రీ‌నివాస్‌ను ఓడించి ఆ ప్రాంతంలో కాసు కుటుంబం ప‌ట్టు స‌డ‌ల‌కుండా చేశారు. అయితే, ప్ర‌స్తుతం ఆ ప్రాంత వాసులంతా మహేష్‌రెడ్డి గురించే తెగ మాట్లాడేసుకుంటున్నారు.

మాజీ సీఎం మ‌న‌వ‌డిన‌న్న ధైర్య‌మో.. లేక ఫ్యాక్ష‌న్ ప‌ల్నాడులో మ‌ళ్లీ కాసు కుటుంబం రాజ‌కీయ వార‌స‌త్వాన్ని నిల‌బెట్టాన‌న్న గ‌ర్వ‌మో తెలియ‌దు కానీ.. జిల్లాలో త‌న రూటే స‌ప‌రేటంటూ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని జ‌నాలు అనుకుంటున్నారు.

ఎంత‌టి అధికారైనా స‌రే మ‌హేష్‌రెడ్డి నుంచి ఫోన్ వ‌చ్చిందంటే చాలు హ‌డ‌లి పోతున్నారు. నిరంత‌రం జ‌నాల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం నియోజ‌క‌వ‌ర్గంలో అందుబాటులో ఉండ‌ట‌మే కాదు. త‌న దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యేంత వ‌ర‌కు అధికారుల‌ను నిద్ర కూడా పోనివ్వ‌డం లేదు కాసు మ‌హేష్‌రెడ్డి.

ఆయ‌న చెప్పిన స‌మ‌స్య‌ను ఎవ‌రైనా జిల్లా అధికారులు లైట్‌గా తీసుకుంటే ఇక వారి ప‌ని అయిపోయిన‌ట్టే. తెల్ల‌వారేస‌రికి ఆయ‌న ఇంటి ముంగిట బిల్ల బంట్రోతుతో క‌లిసి ఆ అధికారి దిగాల్సిందే. వ‌చ్చిన వెంట‌నే ఇక సుప్ర‌బాతం మొద‌లైపోతుందంటున్నారు.

త‌న తాత ఉమ్మ‌డి ఏపీకి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన విష‌యం మొద‌లుకొని నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు నిర్మాణం వ‌ర‌కు అంతా త‌మ కుటుంబమే చేసింద‌ని చెబుతూ చ‌రిత్రను క‌ళ్లెదుటే చూపించేస్తున్నార‌ట మ‌హేష్‌రెడ్డి. అంతే ఆయ‌న మాట‌ల‌కు హ‌డ‌లిపోతున్న అధికారులు త‌క్ష‌ణ‌మే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేస్తున్నార‌ని ప‌ల్నాడు ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తున్న‌ టాక్.  

మ‌హేష్‌రెడ్డి ఆదేశిస్తే అధికారులు ఉరుకులు, ప‌రుగుల మీద ప‌నులు చేస్తుండటాన్ని చూసి ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌లు సైతం స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఆయ‌న ద‌గ్గ‌ర‌కే వ‌స్తుండ‌టంతో స‌హ‌చ‌ర ఎమ్మెల్యేలు ముక్కున వేలేసుకుంటున్నారు. చూడాలి మ‌రీ.. ప‌ల్నాడు రాజ‌కీయాల్లో కాసు కుటుంబం దూకుడు ఎన్నాళ్లు కొన‌సాగుతుందో..!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle