newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

‘‘అధికారం చేతుల్లో ఉందని ఇంత అరాచకమా?’’

09-01-202009-01-2020 15:07:06 IST
Updated On 09-01-2020 15:07:22 ISTUpdated On 09-01-20202020-01-09T09:37:06.368Z09-01-2020 2020-01-09T09:37:03.566Z - 2020-01-09T09:37:22.864Z - 09-01-2020

‘‘అధికారం చేతుల్లో ఉందని ఇంత అరాచకమా?’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతి రాజధాని మార్పుని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఆందోళనను పోలీసు బలంతో అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు జనసేన నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్. అధికారం చేతుల్లో ఉందని శాంతియుత ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడం, పోలీసులను మోహరించి భయకంపితులను చేయడం దారుణం అన్నారు. రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు రైతులు చేస్తున్న ఉద్యమానికి జనసేన పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. 

ఇలాంటి చర్యల వల్ల శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చే ప్రమాదం ఉందని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల్ని, యువకుల్ని, వృద్ధుల్ని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న తీరుని జనసేన తీవ్రంగా ఖండించింది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని,  రైతులు చేస్తున్న పోరాటానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని మనోహర్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి స్వార్ధ రాజకీయాల కోసమే అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

ఏడునెలల పాలనపై సెటైర్లు వేశారు మనోహర్. 22 రోజులుగా రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు, దీక్షలు చేస్తున్నారు. వారికి మద్దతుగా జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పంజా సెంటర్ లో నిర్వహించిన సామూహిక నిరాహారదీక్షలో ఆయన పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని పదే పదే ఆరోపిస్తున్న వైసీపీ నేతలు బాధ్యులపై విచారణ జరపి7నెలల్లో శిక్షించాల్సింది పోయిందన్నారు. ఇది ప్రభుత్వ అసమర్ధత అని స్పష్టంగా అందరికీ కనిపిస్తోందన్నారు. 

ప్రతిపక్షంలో ఉన్పప్పుడు రాజధానికి 30 వేల ఎకరాలు కావాలన్న వ్యక్తి... ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వగానే మాట మార్చేశారు. ఇలాంటి మాటలు మార్చే వ్యక్తిని ఎవరైనా ఎందుకు నమ్ముతారు..? పెట్టుబడులు ఎలా వస్తాయి..? అభివృద్ధి ఎలా జరుగుతుంది..? ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఈ ఏడు నెలల్లో బస్తా సిమెంట్ పెట్టి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదన్నారు. మాట తప్పను.. మడమ తిప్పను అన్న సీఎం అమరావతి విషయంలో చేస్తున్నదేంటన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle