newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

అద్దంకి బరిలో మామ.. అల్లుడి ప్రచారం

02-03-201902-03-2019 07:22:46 IST
2019-03-02T01:52:46.658Z02-03-2019 2019-03-02T01:52:43.093Z - - 20-09-2019

 అద్దంకి బరిలో మామ.. అల్లుడి ప్రచారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు ఊపందుకున్నాయి. ఈమధ్యే సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. తనకు రాజకీయాలంటే ఆసక్తి అని, జగన్ సీఎం అయితే చూడాలని ఉందన్న నార్నెఎస్టేట్స్ అధినేత ఓ అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 

నార్నె శ్రీనివాసరావు ప్రకాశం జిల్లాలోని అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వార్తలు షికారు చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత గొట్టిపాటి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ క్రమంలో రవికుమార్‌ను ఢీకొట్టడానికి ఆర్థికంగా ఉన్న నాయకుడిని రంగంలోకి దించాలని జగన్ భావిస్తున్నారు. అక్కడినించి నార్నె అయితే బాగుంటుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఒకవేళ అద్దంకి నుంచి నార్నె పోటీచేస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మామ తరఫున వైసీపీకి ప్రచారం చేయక తప్పని పరిస్థితి. అదే నిజమయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడం ఖాయం. దీంతో ఏపీ రాజకీయాల్లో కీలకమయిన మలుపులు తప్పవంటున్నారు. చంద్రబాబుకి వ్యతిరేకంగా ఇప్పటికే తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరారు. కొడుకు హితేష్ టికెట్ కూడా దాదాపుగా కన్ ఫర్మ్ అయింది. అటు మామ నార్నె, ఇటు బావ హితేష్ తరఫున తారక్ ప్రచారం చేస్తారని అంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle