newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

అదంతా సుజనా, రమేష్ పక్కా వ్యూహమా?

20-06-201920-06-2019 17:38:48 IST
Updated On 20-06-2019 18:26:06 ISTUpdated On 20-06-20192019-06-20T12:08:48.263Z20-06-2019 2019-06-20T12:08:46.126Z - 2019-06-20T12:56:06.585Z - 20-06-2019

అదంతా సుజనా, రమేష్ పక్కా వ్యూహమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీలో తాజా సంక్షోభానికి గత కొద్దికాలం నుంచి నాంది పడిందా? టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహనరావు, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లు పార్టీ మారడానికి ఎప్పటినుంచో స్కెచ్చేశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.  అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీడీపీలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

No photo description available.

ఇటీవల ఓ ఛానెల్‌కి  ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పార్టీ మార్పుపై సంకేతాలిచ్చారు. ‘టీడీపీలో ఉన్నంతకాలం’ అనే పదం వాడారు. సుజనా చౌదరి ఇంటర్వ్యూ అనంతరం ‘న్యూస్ స్టింగ్’ విశ్లేషణాత్మక కథనాలు అందించిన సంగతి తెలిసిందే. ఆ కథనాలు ఇప్పుడు నిజమయ్యాయి. సుజనా చౌదరి టీడీపీని వీడుతున్నట్టేనా?-1సుజనా చౌదరి టీడీపీని వీడుతున్నట్టేనా?-2

అందులో భాగంగా గురువారం దేశరాజధాని ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. తమను ఒక గ్రూప్‌గా పరిగణించాలంటూ ఎంపీలు సీఎం రమేశ్‌, సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌ రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ అందజేశారు. నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీమారేందుకు వీలుగా అన్ని పావులు కదిపారు. రాజ్యసభలో ఉన్న ఆరుగురు సభ్యుల్లో నలుగురు సభ్యులం పార్టీనీ బీజేపీలో విలీనం చేయాలని తీర్మానం చేశామని వారు లేఖ ఇచ్చారు. తమపై వత్తిడి ఉందని, అందుకే తాము పార్టీ మారుతున్నామని సుజనా చౌదరి చెప్పారు.

బీజేపీలో చేరుతున్నట్టు లాంఛనంగా ప్రకటించారు. రాజ్యాంగ నిపుణుల సలహాలను అనుసరించి సుజనా చౌదరి కథ నడిపారని తెలుస్తోంది. న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణుల సలహాతో ఏ సెక్షన్, ఏ క్లాజ్ కింద తమను బీజేపీలో విలీనం చేయాలో వివరించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నాలుగవ పేరాగ్రాఫ్ ప్రకారం తమ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవాలని సుజనా చౌదరి బీజేపీ అధ్యక్షుడికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. టీడీపీతో ఇకపై తమకు ఎలాంటి సంబంధం లేదని రాజ్యసభ ఛైర్మన్‌కు అందజేసిన లేఖలో ఎంపీలు పేర్కొన్నారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో వారు బీజేపీ కండువా కప్పుకున్నారు. 

నలుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో రాజ్యసభలో టీడీపీ బలం రెండుకి పడిపోయింది. టీడీపీలో మిగిలిన ఇద్దరు తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్. వీరిద్దరిలో  తోట సీతారామలక్ష్మి పదవీ కాలం త్వరలో ముగియనుంది.  ఆమెతో పాటు ఇటీవల రాజ్యసభ సభ్యుడైన సీనియర్ అడ్వకేట్ కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు. కనకమేడల ఉన్నత న్యాయస్థానంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తికి అనుయాయుడిగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీమారే అవకాశం లేదని తెలుస్తోంది.

ఇది అంతా అనుకున్నట్టు పార్టీలో చీలిక కాదు. మెజారిటీ సభ్యుల తీర్మానం ద్వారా పార్టీ విలీనం మాత్రమే. టీడీపీ ఎంపీలు చేరడంతో బీజేపీ సభ్యుల బలం 103కి కానుంది. మరోవైపు బీజేపీ చర్యలను తీవ్రంగా ఖండించారు చంద్రబాబునాయుడు.  తెలుగుదేశం పార్టీలో సంక్షోభాలు కొత్తకాదు ఎవరూ అధైర్యపడవద్దని చంద్రబాబు కోరారు. మరోవైపు పార్టీ సీనియర్లతో చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సిఎం చంద్రబాబు ఫారిన్ టూర్ లో ఉన్నప్పుడు ఒకదానివెంట ఒకటిగా జరిగిన ఈ అనూహ్య పరిణామాలు నిజంగా ఓ పెద్ద లాజిక్ కి కూడా అందనంతగా జరిగిపోయాయని రాజకీయ విశ్లేషకులు అవాక్కవుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle