newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

అదంతా వైసీపీ అసమర్థతే...వరదలపై బాబు తీవ్ర విమర్శలు

24-08-201924-08-2019 08:57:17 IST
Updated On 24-08-2019 14:32:04 ISTUpdated On 24-08-20192019-08-24T03:27:17.124Z24-08-2019 2019-08-24T03:23:14.764Z - 2019-08-24T09:02:04.770Z - 24-08-2019

అదంతా వైసీపీ అసమర్థతే...వరదలపై బాబు తీవ్ర విమర్శలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో వరద రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. అటు వైసీపీ నేతలు -టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హైదరాబాద్ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

కృష్ణా వరదలు ప్రకృతి వైపరీత్యంతో వచ్చినవి కాదని ప్రభుత్వ వైపరీత్యం వల్లే సంభవించాయని చంద్రబాబు ఆరోపించారు.వరదలను నియంత్రించేందుకు అవకాశం ఉన్నా వైసీపీ ప్రభుత్వం అలా పనిచేయలేదని విమర్శించారు. దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు. 

తన ఇంటిని ముంచే కుట్రలో భాగంగా ప్రజలను నిండా ముంచారన్నారు. రాజధాని అమరావతిని వరద నీటితో ముంచాలన్న తప్పుడు ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉందని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతికి వరద ముప్పు ఉందని ప్రచారం చేసి రాజధానిని మార్చే కుట్ర జరుగుతోందని చంద్రబాబు అంటున్నారు. 

కృష్ణా వరదలను ప్రభుత్వం ఉద్దేశపూరితంగా సృష్టించిన విపత్తు అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయన్నారు. కృష్ణా వరదలకు సంబంధించి గుంటూరు పార్టీ కార్యాయలంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వరద సంభవించిన నాటి నుంచి నేటి వరకు కేంద్ర జలసంఘం లెక్కలను సేకరించిన చంద్రబాబు వరదకు అసలు కారణం చెప్పారు.

శ్రీశైలం నుంచి సాగర్‌కు వరద రావాలంటే 12 గంటలు పడితే, ప్రకాశం బ్యారేజీకి వరద రావాలంటే 24 గంటలు పడుతుందని చెప్పుకొచ్చారు. నీటి ప్రవాహాన్ని అంచనా వేసి నియంత్రించే అవకాశం ఉందని కానీ అలా చేయలేదని మండిపడ్డారు.

నీటి ప్రవాహానికి సంబంధించిన అన్ని వివరాలు అధికారుల వద్ద ఉన్నాయని తెలిపారు. ఏ రిజర్వాయర్ లో ఎన్ని నీళ్లు ఉన్నాయో చూసుకోకుండా నీటిని వదిలేశారని చెప్పుకొచ్చారు. అందువల్లే ప్రకాశం బ్యారేజీ దిగువ లంక గ్రామాలు వరదల్లో మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

కృష్ణా వరదలపై సీఎం జగన్ ఏనాడు సమీక్ష నిర్వహించలేదన్నారు. రెండు జిల్లాల్లో తాను 19 గ్రామాలు తిరిగానని చెప్పుకొచ్చారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి వాటర్ మేనేజ్ మెంట్ తెలియదన్నారు.  

 

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

   6 minutes ago


రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   an hour ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   an hour ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   2 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   19 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   21 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle